శ్రావణ బెలగొళ చరిత్ర మరియు వారసత్వం ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక కళోత్సవం

Written By: Telugu Samhitha
Subscribe to Boldsky

ఈ ఉత్సవం భారతదేశం మరియు ప్రపంచమంతటా స్థిరపడిన అనేక మంది కళాకారులకు, రాబోయే కళాకారులకు, కళా సంస్థలకు, గ్యాలరీలకు మరియు కళాపోషకులకు గొప్ప సహకారంగా ఉంటుంది.

ఈ అపూర్వమైన ఘట్టం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జైనుల ఆరాధ్యుడు అయినబాహుబలికి జరిగే 'మహామస్తకాభిషేకం' అనే మహోత్సవాన్ని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుండి లక్షల మంది భక్తులుప్రసిద్ధ జైన తీర్ధయాత్రా క్షేత్రమైన శ్రావణ బెలగొళకు చేరుకుంటారు.

ప్రపంచంలో అత్యంత సంభ్రమాశ్చర్యయాలను కలిగించే మహామస్తాకాభిషేక ఆరాధనా వేడుకలలో భాగంగా ఈ కళా ఉత్సవంఫిబ్రవరి 17 నుండి 26 మధ్య జరుగుతుంది.

ఈ పవిత్రమైన శ్రావణ బెలగొళ కళా వేడుక శ్రావణ బెలగొళ మఠాశ్రమ అధ్వర్యంలో శ్రీమతి పుష్ప పాండ్య మరియు శ్రీ రజత్ పాండ్యల పర్యవేక్షణల సారధ్యంలో, స్వస్తి శ్రీ చారుకీర్తి భట్టారక స్వామిజీ ఆశీస్సులతో ఎంతో వైభవంగా జరుగుతుంది.

'మహామస్తకాభిషేకం' సమయంలో ఇటువంటి ప్రత్యేకమైన కళావేడుక ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి. శ్రీమతి పుష్ప పాండ్య ఇండోర్ విశ్వవిద్యాలయం నుండి M.A. ఫైన్ ఆర్ట్స్లో ఒక బంగారు పతకాన్ని పొందినటువంటి వారు.అంతే కాకుండా ఆమె ఎన్నో కళా ప్రదర్శనలు, జైన నాటకాలు, డ్రామాలను ఇండోర్, జైపూర్ మరియు బావంగజాలలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన విస్తృతమైన అనుభవాన్ని కలిగియున్నారు.

శ్రావణ బెలగొళ కళోత్సవాలు జరగడానికి ముందు మరియు జరుగుతున్న క్రమంలో ప్రణాళిక పరిచిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు క్రింద ఉన్నాయి:

మహామస్తకాభిషేకం సమయంలో ప్రఖ్యాత కళాకారులచే ప్రత్యక్షఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్: శ్రావణ బెలగొళ వద్ద మహామస్తకాభిషేకం సమయంలో నిర్వహించే ఈ వేడుక చూడటానికి మరియు ప్రదర్శించడానికి జీవితంలో ఒకే ఒక్కసారి కలిగే అద్భుతమైన అవకాశం. ప్రత్యక్ష చిత్ర లేఖన(live painting) ప్రదర్శన ఫిబ్రవరి 19వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రతిరోజూ నిర్వహించబడతాయి.కళాశాల ప్రదర్శన జరుగుతున్నప్పుడు లైవ్ పెయింటింగ్ కోసం పరిమితంగా రెండు స్లాట్లు అందుబాటులో ఉన్నాయి.

మహామస్తకాభిషేకమునకు ముందు జరిగే ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ శిభిరం : మూడు రోజుల ఆర్ట్ క్యాంప్ 2018 జనవరి 26 నుండి28 మధ్య జరిగాయి. ఈ శిబిరంలో ప్రపంచవ్యాప్తంగా 50 మంది కళాకారుల శ్రావణ బెలగొళ యొక్క సంస్కృతి మరియు వారసత్వాన్ని తమ అధ్వితీయ నైపుణ్యంతోపట్టణంలోని ఆలయాలు జరుపుకునే కళోత్సవాలకు తమ స్వంత కళాకృతులు సమర్పించి ముంచెత్తారు.

మహామస్తాభిషేకం సమయంలో జరగనున్న కళా వీక్షణ మరియు కళా ప్రదర్శన : శ్రావణ బెలగొళ యొక్క కళ, చరిత్ర మరియు వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన 75 ప్రత్యేక చిత్రాల సృష్టిని ఫిబ్రవరి 17 మరియు 28 మధ్య ప్రదర్శనలో ప్రదర్శించబడుతుంది. అలాగే ఈ వేడుకలో భాగంగా ఎంచుకున్న కళాకృతులతో ఒక రోడ్డు ప్రదర్శనను శ్రావణ బెలగొళ నుండి ప్రారంభించి దేశవ్యాప్తంగా ప్రయాణించి ప్రదర్శిస్తుంది.

దేవాలయాలలో రూపొందించిన ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు పాత చిత్రలేఖనాల ఆధారంగా టాక్ షోలు మరియు ముఖాముఖి చర్చలు జరుగుతాయి.

శ్రావణ బెలగొళలోను మరియు చుట్టుపక్కల వీధి గోడలమీద చిత్రలేఖనం.

శ్రావణ బెలగొళలో జరుగుతున్న కలోత్సవాల యొక్క నిర్వాహకులు ఇచ్చినఒక ఇంటర్వ్యూఇక్కడ ఉంది. ఒక సారి చూడండి.

1) మీరు ఎక్కడ జన్మించారు మరియు ఎక్కడ పెరిగారు?మీరు ఈ రంగంలో ఆసక్తిని ఎలా పెంచుకున్నారు?

1) మీరు ఎక్కడ జన్మించారు మరియు ఎక్కడ పెరిగారు?మీరు ఈ రంగంలో ఆసక్తిని ఎలా పెంచుకున్నారు?

నేను మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో పుట్టి పెరిగాను. నేను ఎల్లప్పుడూ కళలు, నాటకాలు మరియు కవిత్వాలపై ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాను.అంతే కాకుండా ఇండోర్ యూనివర్శిటీ నుండి ఫైన్ ఆర్ట్స్‌లో ఒక మాస్టర్స్ డిగ్రీ సంపాదించడంతో పాటుగా ఆ విభాగంలో గోల్డ్ మెడల్ కూడా పొందాను.

2)ఈ కలోత్సవం గురించి మాకు మరింత చెప్పండి.

2)ఈ కలోత్సవం గురించి మాకు మరింత చెప్పండి.

ఈ పండుగ భారతదేశంలోని శ్రావణబెలగొళలో నిర్వహిస్తున్న ఒక ప్రత్యేకమైన కళల పండుగ. ఈ ఉత్సవం శ్రావణ బెలగొళ చరిత్ర మరియు వారసత్వాన్ని ప్రదర్శించడానికి జనవరి మరియు ఫిబ్రవరి 2018లో జైనుల అరాధ్యుడు అయిన బాహుబలి యొక్క విగ్రహానికి జరిగే మహాభిషేకం సమయంలో జరుగుతుంది. శ్రావణ బెలగొళ మఠం యొక్క ఆధ్వర్యంలో స్వస్తి శ్రీ చారు కీర్తి భట్టారక స్వామీజీ యొక్క ఆశీర్వాదంతో ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది.ఈ ఉత్సవం భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన అనేకమంది కళాకారులకు మరియు రాబోయే కళాకారులు, సంస్థలకు, కళా ప్రదర్శనశాలలకుమరియు పోషకులకు ఎంతో సహకారంగా ఉంటుంది.

ఈ ఉత్సవంలో భాగంగా2018 జనవరి నుండి మార్చి మధ్య మూడు కార్యక్రమాలు నిర్వహించబడతాయి.శ్రావణ బెలగొళ యొక్క కళ, నిర్మాణ శైలి మరియు బాహుబలి ఆధ్యాత్మిక సందేశము ద్వారా ప్రేరణ పొందిన కళలను సృష్టించటానికి జనవరిలో కళాకారుల శిబిరంతో 45 మందికి పైగా కళాకారులు కలసి రావడంతో ఉత్సవం ప్రారంభించబడి, తరువాతి దశలో శ్రావణ బెలగొళలో మహా మస్తకాభిషేకం సమయంలో ఒక భారీ ప్రదర్శన నిర్వహించబడుతుంది. అక్కడ శిభిరం నుండి ఎన్నో పెయింటింగులు 40 లక్షల మంది సందర్శకులకు మరియు భక్తులకు ప్రదర్శించబడతాయి.

అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా బాహుబలి యొక్క అభిషేకం సమయంలో మొట్టమొదటిసారి కళాకారులు కాన్వాస్ మీద ప్రత్యక్షంగా పెయింటింగ్ చేస్తారు. చివరగా ఈ ప్రదర్శన భారతదేశం అంతటా మా యొక్క భాగస్వామ్యం కలిగిన ప్రధాన గ్యాలరీలు మీదగా ఒక రోడ్డు ప్రదర్శణ ఉంటుంది.

3) జనవరి 26-28 సమయంలో మొదటి రౌండుకు ఎలా స్పందన వచ్చింది?

3) జనవరి 26-28 సమయంలో మొదటి రౌండుకు ఎలా స్పందన వచ్చింది?

ఈ కళా శిభిరం దేశవ్యాప్తంగా 45 మంది కళాకారులను నిర్వహించింది. దీనిలో అన్ని రకాల కళా ప్రక్రియల మీదగా విభిన్న వర్గాల సీనియర్లు మరియు బాగా గుర్తింపు పొందిన కళాకారులతో పాటు యువ, భవిష్య కళాకారులు మరియు విద్యార్థులు ఉన్నారు. అందులో ప్రముఖులు ప్రొఫెసర్ MJ కమలాక్షి, శ్రీమతి సుధా మనోహర్, ప్రొఫెసర్ VG అందానీ, ప్రొఫెసర్ కె.ఎస్.అప్పాజయ్య వంటి ప్రసిద్ధులు దేశవ్యాప్తంగా అనేకమంది కళాకారులతో పాటు శిబిరంలో చేరారు.

కళాకారులు శ్రావణబెలగొళ యొక్క సంస్కృతి మరియు వారసత్వంతో తన్మయత్వం పొంది, తమ స్వీయ కళా ఖండాల చేత పట్టణ మరియు దాని ఆలయాలను సముదాయాల యొక్క ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించారు. వారు బాహుబలి యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు కనుగొన్న ప్రేరణ కథలు సృష్టించిన రచన ద్వారా మేము నిజమైన స్పూర్తిని పొందాము. ప్రతి కళాకారుడికి విశిష్టమైన ఒక ప్రత్యేక దృష్టి ఉంది. అది ఆ శిబిరం యొక్క విలువలను మరింత విస్తృత పరిచింది.

4) మీరు ముందుగా ఎప్పుడయినా ఈ రకమైన కళోత్సవాన్ని నిర్వహించారా?

4) మీరు ముందుగా ఎప్పుడయినా ఈ రకమైన కళోత్సవాన్ని నిర్వహించారా?

అవును, మధ్యప్రదేశ్ లోని బద్వానిలో నేను ఇటువంటి ఒక శిబిరాన్ని నిర్వహించాను. బద్వాని ఇండోర్ కు దగ్గరగా ఉన్న ఒక చిన్న పట్టణం. అక్కడ బాహుబలి యొక్క తండ్రి ఆదినాధుడి యొక్క పొడవైన విగ్రహం ఉంది. మేము మధ్యప్రదేశ్ నుండి 15-25 మంది కళాకారులను ఆ శిబిరంలో పాల్గొనడానికి ఆహ్వానించి, ఆదినాధుడి కథ ప్రేరణతో గొప్ప చిత్రాలను చిత్రీకరించాం.

5) శ్రావణ బెలగొళ చరిత్ర, జైన మతం చరిత్ర గురించి అధ్యయనం చేసిన తర్వాత మీరు కళోత్సవం చేస్తున్నారా?

5) శ్రావణ బెలగొళ చరిత్ర, జైన మతం చరిత్ర గురించి అధ్యయనం చేసిన తర్వాత మీరు కళోత్సవం చేస్తున్నారా?

మేము చాలాకాలంగా శ్రావణ బెలగొళతో అనుబంధం కలిగి ఉన్నాం. అంతే కాకుండా మాకు ఈ స్థలంతో బలమైన ఆధ్యాత్మిక సంబంధం ఉంది. కాలక్రమేణా శ్రావణ బెలగొళ చరిత్ర అలాగే బాహుబలి మరియు అతని తమ్ముడు భరతుని యొక్క కథలను అధ్యయనం చేసాము.శ్రావణ బెలగొళ మరియు బాహుబలి నేటి తరానికి ఎంతో సమకాలీన సందేశాన్ని అందిస్తుంది మరియు అది మన అహంకారాన్ని మరియు దురాశను వదిలిపెట్టడానికి చాలా స్పూర్తినిస్తుంది. తద్వారా ఇతరులకు క్షమాపణ చేస్తూ, కోరికల వెంట పరాధీనం కాకుండా మన ప్రాపంచిక స్వాధీనంలో మనం ఉండేటట్లు నిర్దేశించడానికి ఎంతో ప్రేరణ కలిగిస్తున్నట్లుగా మేము తెలుసుకున్నాం.నేను జైన సాహిత్యాన్ని మరియు జైన చరిత్రను నా జీవితమంతా అధ్యయనం చేశాను అంతే కాకుండా అదే బోధనలను నా పిల్లలకు కూడా అందించాను.

6) ప్రపంచ వ్యాప్తంగా 50 మంది కళాకారులను ఒకే త్రాటిపైకి తీసుకురావడానికి మీరు చేసిన ప్రయత్నాలను గురించి మాకు చెప్పండి.

6) ప్రపంచ వ్యాప్తంగా 50 మంది కళాకారులను ఒకే త్రాటిపైకి తీసుకురావడానికి మీరు చేసిన ప్రయత్నాలను గురించి మాకు చెప్పండి.

మేము "బహిరంగ జ్వాల"(wild ఫైర్) లాంటి ఒక బహిరంగ పిలుపుని ఉంచడం వలన అది చాలా త్వరగా వ్యాప్తి చెందింది. దేశ వ్యాప్తంగా కళాకారుల ఆశక్తి నిజంగా చాలా అధ్బుతమైనది. ప్రతీ ఒక్కరూ ఒక ప్రత్యేక అనుభవంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. అదే వాళ్ళని ఈ ప్రత్యేక ప్రదేశానికి ఆకర్షించింది. మేము కళాకారులను ఆహ్వానించడానికి కర్నాటక చిత్రకళా పరిషత్తుతో పాటు మా యొక్క గ్యాలరీ భాగస్వాములతో ఎంతో సన్నిహితంగా కలిసి పనిచేసి వారి యొక్క నెట్వర్క్‌ల నుండి కళాకారులను ఆహ్వానించాము.వారి నుండి వచ్చిన ఉహించని ప్రతిస్పందనకు మరియు వారందరితో కలసి పనిచేస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. కళాకారులు ఈ వేడుక యొక్క నిజమైన కధానాయకులు.మేము అన్ని రకాల కళా ప్రక్రియల యొక్క కళాకారులను దేశవ్యాప్తంగా అలాగే కర్ణాటకా రాష్ట్రం నుండి సీనియర్లు మరియు రాబోయే కళాకారులను కలిగి ఉన్నాము. ఈ వేదికశ్రావణబెలగొళ యొక్క సారాంశాన్ని బయటకు తీసుకురావడానికి వారి ఉత్తమ సృజనాత్మక కృషిని అంకితమిస్తున్న సృజనాత్మక వ్యక్తుల పరిశీలనాత్మక కలయిక.

7) ఈ ఆర్ట్ ఫెస్టివల్ కోసం అంచనా వ్యయం ఏమిటి? మీకు ఏదైనా స్పాన్సర్లు వచ్చాయా?

7) ఈ ఆర్ట్ ఫెస్టివల్ కోసం అంచనా వ్యయం ఏమిటి? మీకు ఏదైనా స్పాన్సర్లు వచ్చాయా?

పలు దశలలో ప్రాజెక్టు పరిధి, పరిమాణం మరియు వ్యవధి కారణంగా ఇది ఒక ముఖ్యమైన బాధ్యత మరియు బడ్జెట్టుగా ఉంటుంది. దీనికి మద్దతివ్వడానికి సానుకూలంగా ముందుకు సాగుతున్న పలువురు దాతల మద్దతును కలిగి ఉన్నందుకు మేము వారికి ఎంతో కృతజ్ఞులం. మా దాతలు ప్రపంచం మొత్తం నుండి వచ్చారు, ముఖ్యంగా - యునైటెడ్ స్టేట్స్, హాంగ్కాంగ్, సింగపూర్ మరియు భారతదేశం నుండి ఢిల్లీ, బాంబే, బెంగుళూరు నుండి ఉన్నారు. మా వ్యవస్థాపక పోషకులు మరియు పోషకుల వివరణాత్మక జాబితాను https://www.sbgartfestival.com/patrons/ లో చూడవచ్చు. మా యొక్క దాతలు వ్యక్తులు మరియు సంస్థలుగా ఉన్నారు.

8) ఉత్సవం కోసం చేసిన మొత్తం ఏర్పాట్లు మరియు 'మహామస్తకాభిషేకం' గురించి మాకు చెప్పండి ?

ప్రపంచంలోని అతిపెద్ద జైన ఉత్సవాలలో మహామస్తకాభిషేకం ఒకటి. ఈ వేడుక భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో జైనులు మరియు జైన మత ఇతరులను కూడా ఆకర్షిస్తుంది. నిర్వాహకుల అంచనా ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 17 మరియు 26 తేదీల మధ్య జరిగే ఈ కార్యక్రమంలో 10 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటున్నారు. ప్రభుత్వం, అలాగే శ్రావణ బెలగొళ ఆర్గనైజింగ్ కమిటీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విస్తృతమైన ప్రయత్నాలను చేశాయి.

Read more about: art festival pulse పల్స్
English summary

A Unique Art Festival To Showcase The History And Heritage Of Shravanabelagola

The festival is a collaboration between many established and upcoming artists, art institutes, galleries and patrons from India and across the world.As you may be aware, lakhs of devotees from all over the country and abroad are expected to gather at Shravanabelagola, the Jain pilgrimage centre, for Lord Bahubali's 'Mahamastakabhisheka', a once-in-12-year ritual.
Story first published: Saturday, March 3, 2018, 15:30 [IST]