ఒక్కో రాశి వారికి ఒక్కో వ్యసనం ఉంటుంది.. మీ రాశి ప్రకారం మీ వ్యసనం ఏమిటో తెలుసుకోండి

Written By:
Subscribe to Boldsky

మనిషి అన్నాక ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆసక్తి ఉంటుంది. అయితే రాశుల వారీగా మనుషులకు కొన్ని వ్యసనాలుంటాయి. వ్యసనాలు అంటే తాగడం.. తిరగడం కాదు. మనం ఏదైనా ఒక దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం లేదా అదే పని చేయాలని ఎక్కువగా ఆసక్తి కనబరచడాన్ని కూడా వ్యసనమే అంటారు. ఒక రాశి వారికి శృంగారం అంటే బాగా పిచ్చి ఉంటుంది. ఇంకొకరికి షాపింగ్ అంటే వ్యసనం. మరి మీ రాశి ప్రకారం మీ వ్యసనం ఏమిటో ఒకసారి చూడండి.

మేషరాశి

మేషరాశి

మేషరాశి వారు ఎక్కువగా కాఫీ తాగుతారు. వీరికి కాఫీ అంటే పిచ్చి. కాస్త డిప్రెషన్ లో ఉన్నా నిరాశగా ఉన్నా వీరు వెంటనే కాఫీ తాగి రిలీఫ్ చెందుతారు. కాఫీ తాగడం అంటే వీరికి చాలా బాగా ఇష్టం. ఎవరైన ఫ్రెండ్ కలిస్తే వెంటనే కాఫీ కేఫ్ కు తీసుకెళ్తాను. వీరు కాఫీ లేకుండా అస్సలు ఉండలేరు. వీరి వ్యసనం కాఫీ తాగడం.

వృషభం

వృషభం

వృషభ రాశివారు ఎక్కువగా తినాలని కోరుకుంటారు. వీరు శరీరంలో ఎక్కువ కేలరీలు పెరగడానికి కారణం వీరికి ఎక్కువగా తిండిపైనే ధ్యాస ఉండడం. వీరు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. రోజూ ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ తింటూ ఉంటారు. వీరికి ఇది ఒక వ్యసనంలా ఉంటుంది. వృషభ రాశి వారు ఎక్కువగా ఫ్యాటీగా తయారై ఉంటారు. అందుకే వాళ్ల ఫ్రెండ్స్ త్వరగా జిమ్ లో జాయిన్ కండి అంటూ సలహాలు ఇస్తుంటారు.

మిథునరాశి

మిథునరాశి

మిథునరాశివారు ఎక్కువగా జ్ఞాన సముపార్జనపైన ధ్యాస ఉంచుతారు. వీరు వారి నాలెడ్జ్ ను మరింత పెంచుకునేందుకు ఎక్కువగా చదువుతుంటారు. వీరికి ప్రతి విషయంపై మంచి అవగాహన ఉంటుంది. అలాగే కొత్తకొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. ఎప్పుడూ ఏదైనా సాధించాలనే తపనలో వీరు ఉంటారు.

కర్కాటకరాశి

కర్కాటకరాశి

కర్కాటకరాశి వారు ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వీళ్లని ఎవరైనా ఏమన్నా అంటే గంటల తరబడి దాని గురించే చింతిస్తూ ఉంటారు. దాని గురించే బాధపడుతుంటారు. అయితే ఇది అంత మంచిదికాదు. వీరు చిన్న విషయాలకు ఎక్కువగా ఫీలవుతుంటారు. పక్కవారు వీరిని ఏమన్నా ఒక్కమాట అంటే చాలు హర్ట్ అయిపోతుంటారు. మనస్సులో కుంగిపోతుంటారు. ఎక్కువగా ఫీల్ అయిపోవడమే వీరికున్న వ్యసనం.

సింహరాశి

సింహరాశి

సింహరాశి వారు తమని తాము ఎక్కువగా భావించుకునే పనిలో ఉంటారు. ప్రతి క్షణం వారి గురించే ఎక్కువగా ఆలోచించుకుంటారు. వీరికి కాస్త గర్వం ఉంటుంది. తమ శరీరాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. తమకన్నా ఎవరు గొప్పకాదంటూ వీరు కాస్త ఎక్కువగా ఫీలవుతుంటారు. వీరు ఇలాంటి విషయాలపై ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వీరికుండే వ్యసనం ఇదే.

కన్యరాశి

కన్యరాశి

కన్యరాశి వారి ధ్యాసంతా పరిశుభ్రతపైనే. వీరు ఎక్కువగా వ్యక్తిగత శుభ్రత పాటిస్తారు. మహానుభావుడు మూవీలో శర్వానంద్ లాగా వీరు కడా వ్యక్తిగత శుభ్రత, పరిశుభ్రత అంటే ప్రాణం ఇస్తారు. ఏమాత్రం నీట్ గా లేకున్నా వీరికి చాలా కోపం వస్తుంది. వాళ్లు శుభ్రత పాటించడంతో పాటు పక్కవారు కూడా శుభ్రత పాటించాలని వీరు ఎక్కువగా కోరుకుంటారు. వీరి వ్యసనం పరిశుభ్రత.

తులరాశి

తులరాశి

తులరాశి వారికి షాపింగ్ పిచ్చి ఉంటుంది. వీరి ధ్యాసంతా ఎక్కువగా ఎప్పుడు వీకెండ్ వస్తుందా ఎప్పుడు షాపింగ్ చేద్దామా అనే ఉంటుంది. వీరు కొన్న వస్తువులనే మళ్లీ కొంటూ ఉంటారు. ఈ రాశి అమ్మాయి మీ భార్య కచ్చితంగా మీ క్రెడిట్, డెబిట్ కార్డుల బ్యాలెన్స్ జీరోనే.

వృశ్చికరాశి

వృశ్చికరాశి

వృశ్చికరాశి వారికి ఎక్కువగా శృంగారం పిచ్చి ఉంటుంది. వీరికి లైంగిక ఆసక్తి చాలా ఎక్కువ. వీరు శృంగారానికి సంబంధించిన అంశాలపైనే ఎక్కువగా ధ్యాస ఉంచుతారు. వృశ్చికరాశి వారు శృంగారంలో ఎక్కువగా పాల్గొనాలని కోరుకుంటారు. శృంగారంలో బాగా సంతృప్తి చెందాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. వీరు శృంగారంలో రకరకాల భంగిమలను ప్రయత్నించాలని పరితపిస్తుంటారు. వృశ్చికరాశి వారి వ్యసనం శృంగారమే.

ధనుస్సురాశి

ధనుస్సురాశి

ధనుస్సురాశి వారికి ఎక్కువగా జూదం ఆడాలని ఉంటుంది. అలాగే వీరు రిస్క్ లు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే వీరికుంటే ఈ అలవాట్లు, వ్యసనాలతో చాలా సందర్భాల్లో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ధనుస్సురాశి వారు చాలా రకాల బెట్టింగ్ లు వేస్తూ ఉంటారు.

మకరరాశి

మకరరాశి

మకరరాశి వారు ఎక్కువగా పని చేయాలని కోరుకుంటూ ఉంటారు. వీరు చేసే పనిపై ఎక్కువగా ధ్యాస పెడతారు. వీరు ఆఫీసులలో గానీ లేదంటే వారి సొంత వ్యాపారాల్లో గానీ గంటల తరబడి పని చేస్తూనే ఉంటారు. పనిలో నిమగ్నమై అన్నీ మరిచిపోతుంటారు.

కుంభరాశి

కుంభరాశి

కుంభరాశి వారికి ఎక్కువగా తాగడంపై పిచ్చి ఉంటుంది. బాగా తాగి ఎంజాయ్ చేయాలని వీళ్లు అనుకుంటూ ఉంటారు. పని ఒత్తిడి నుంచి రిలీఫ్ కావడానికి వీరు ఎక్కువగా పార్టీలకు వెళ్తుంటారు. అక్కడ తాగి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. వీరు ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా అని అనుకుంటూ ఉంటారు. వీకెండ్ రాగానే తాగడంతో బిజీ అయిపోతారు.

మీనరాశి

మీనరాశి

మీనరాశి వారు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ప్రతి విషయానిక భయపడుతుంటారు. అలాగే వీరు కాస్త మూడీగా ఉన్న కూడా వెంటనే పాటలు వినడమో లేదంటే రెస్టారెంట్ కు వెళ్లడమో చేస్తారు. వీరిని వీరు కంట్రోల్ చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటారు. వీరి వ్యసనం ఎక్కువగా ఆందోళన చెందడం.

English summary

biggest addiction each zodiac sign revealed

biggest addiction each zodiac sign revealed
Story first published: Saturday, January 20, 2018, 11:04 [IST]
Subscribe Newsletter