మొహంపై బుగ్గ‌లు అమ‌ర్చుకుంది. ఎందుకో తెలిస్తే ...!

By: sujeeth kumar
Subscribe to Boldsky

ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు మొద‌లుకొని బార్బీ డాల్ లాగా క‌నిపించాల‌నుకొనే త‌హ‌త‌హ‌. స్లిమ్ గా క‌నిపించేందుకు ప‌క్క‌టెముక‌ల‌ను తీసేసేందుకు కూడా వెన‌కాడని వైనం. ఇలాంటి వైవిధ్య‌మైన ఘ‌ట‌న‌లెన్నో కోకొల్ల‌లుగా వింటూనే ఉన్నాం. ఆక‌ర్ష‌ణీయంగా కనిపించేందుకే ఈ స‌ర్జ‌రీల‌న్నీ చేయించుకుంటున్నార‌ని వేరే చెప్పాలా?

అనారోగ్య ప‌రిస్థితిని అధిగ‌మించేందుకు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకోవాల్సి వ‌స్తే.. అది వారి లుక్స్‌ను మ‌రింత పెంచేలా చేయ‌గ‌లిగితే.? అలాంటి ఘ‌ట‌నే చైనాలో చోటుచేసుకుంది.

Can You Believe That Balloons Have Been Inserted In A Woman's Face?

మొహం పైన పెద్ద మ‌చ్చ‌. దానికి తోడు కాంజెనైట‌ల్ మెల‌నోసైటిక్ నెవుస్ కండిష‌న్ అనే రుగ్మ‌త‌. చికిత్స‌లో భాగంగా ఆమె మొఖంపైన బుగ్గ‌లు ఏర్ప‌డేలా చేశాయి.

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఆశ్చర్యపరిచే సెక్స్ రూల్స్

1. చైనాకు చెందిన చిన్న‌ది...

1. చైనాకు చెందిన చిన్న‌ది...

షియో యాన్ 23ఏళ్ల చైనా చిన్న‌ది. గ్వాంగ్జు ప్రావినెన్స్‌కు ఈమె చెందింది. పుట్టుక‌తోనే కాంజెనైట‌ల్ మెల‌నోసైటిక్ నెవ‌స్ కండిష‌న్‌తో బాధ‌ప‌డుతోంది. వైద్య నివేదిక‌ల ప్ర‌కారం ఇది 5 ల‌క్ష‌ల మందిలో ఒక‌రికి వ‌స్తుంది.

2. మ‌చ్చ బాధించింది

2. మ‌చ్చ బాధించింది

షియో త‌న మొహం పైనున్న మ‌చ్చ త‌న‌ను చాలా బాధ క‌లిగించేలా చేస్తుంద‌ని చాలా సార్లు వాపోయింది. ఈ మ‌చ్చ క్యాన్స‌ర్‌కు దారితీయొచ్చ‌ని డాక్ట‌ర్లు సైతం ఆందోళ‌న ప‌డ్డారు.

3. విచిత్ర‌మైన చికిత్స‌

3. విచిత్ర‌మైన చికిత్స‌

ఆ మ‌చ్చ తొల‌గించేందుకు డాక్ట‌ర్లు నిర్ణ‌యించుకున్నారు. ఇందుకోసం స్కిన్ గ్రాఫ్టింగ్ ప‌ద్ధ‌తిని పాటించాల‌నుకున్నారు. ఆమె మొహం చుట్టూ 4 బెలూన్లు అమర్చాలనుకున్నారు. ఇది పెరిగి అక్క‌డ అధిక చ‌ర్మం త‌యార‌వుతుంద‌ని వారిన‌మ్మ‌కం.

ఏమిటి! ఇలా కన్పించడానికి ఆమె నిజంగానే 50 సర్జరీలు చేయించుకుందా?!

4. పెరిగే బెలూన్లు

4. పెరిగే బెలూన్లు

ఆమె త‌ర‌చూ ఆసుప‌త్రికి వెళ్లి ఆమె మొహంపైనున్న బెలూన్ల‌లో ద్ర‌వం నింపుకోవాల్సి ఉంటుంది. త‌ద్వారా అవి పెరుగుతాయి. కొంత కాలం త‌ర్వాత అవి క‌నిపించేలా మారాయి. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మొహాన్ని క‌ప్పుకొని వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డేది.

5. మ‌రి కొన్ని నెల‌లు

5. మ‌రి కొన్ని నెల‌లు

వైద్యులు తెలిపిన ప్ర‌కారం చికిత్స మ‌రి 5 నెల‌ల‌పాటు కొన‌సాగ‌నుంది. ఆమె కుటుంబం అన్ని ర‌కాలుగా అండ‌గా నిలిచింది. ఈ బాధాక‌ర‌మైన చికిత్స కొన‌సాగేట‌ప్పుడు అందుక‌య్యే ఖ‌ర్చు కోసం ఎన్నో ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేశారు.

ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిద్దాం. ఇలాంటి ద‌య‌నీయ ప‌రిస్థితి గురించి మీరేమ‌నుకుంటున్నారో మాకు తెలియ‌జేయండి.

English summary

Can You Believe That Balloons Have Been Inserted In A Woman's Face?

Can You Believe That Balloons Have Been Inserted In A Woman's Face?,According to doctors, she needs the life-saving treatment to grow new tissues. Her face has balloons in four different places, where expanders have been surgically inserted.
Story first published: Saturday, February 3, 2018, 9:00 [IST]
Subscribe Newsletter