Just In
- 7 hrs ago
Happy Eid al-Adha 2022 : బక్రీద్ సందర్భంగా మీ ముస్లిం మిత్రులకు ఈ విషయం చెప్పడం మర్చిపోకండి...!
- 8 hrs ago
అన్ని రకాల డైట్లు ప్రయత్నించినా బరువు తగ్గలేదా?... ఈ చిన్న పొరపాటు వల్లే...
- 10 hrs ago
పొరపాటున మర్చిపోయి వీటిని బెడ్ కింద పెట్టకండి లేకపోతే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది..
- 13 hrs ago
మధుమేహాన్ని సులభంగా నియంత్రించడానికి ఈ చియా విత్తనాలను ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా?
Don't Miss
- Sports
టీ20 ప్రపంచకప్‌కు మా ప్లాన్లలో ఉమ్రాన్ మాలిక్ కచ్చితంగా ఉంటాడు : రోహిత్ శర్మ
- News
కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియాకు అదనపు శాఖల బాధ్యతలు
- Movies
విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజాలకు కేంద్రం కీలక పదవులు.. నేరుగా రాజ్యసభకు!
- Technology
Flipkart లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి!
- Automobiles
టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు
- Finance
Anand Mahindra: అదిరిపోయిన ఆనంద్ మహీంద్రా రిప్లై.. HRI అంటూ సమాధానం..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
సైకలాజికల్ టెస్ట్ : ఏ ప్రదేశానికి మీరు వెళ్ళడానికి భయపడుతారు
ఒక అమెరికన్ చరిత్రకారుడు మరియు రచయిత అయినటువంటి జోసెఫ్ కాంప్బెల్ మానసిక మరియు మనస్తత్వ శాస్త్రాలను పరిశోధించి ఒక సిద్దాంతాన్ని రూపొందించారు. దానిని అనుసరించి ఒక వ్యక్తి తన భయాలను అధిగమించాలనే కోరికతో ఉంటే, అతను ముఖ్యంగా సంతోషంగా ఉండాలి.
ఇక్కడ మీకొక మానసిక పరీక్ష, మీరు ఏ ప్రదేశానికి వెళ్తే భయపడుతారో. ఆ ప్రదేశాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది. ఆ ప్రదేశాలను బట్టి ఒకమనిషి సహజ లక్షణాలను సైతం అంచనా వెయ్యవచ్చు అని సిద్దాంత సారాంశం.
మనలో ఉన్న భయాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి మరియు ఆ భయాలు కలగడానికి మన చుట్టూ ఎలాంటి అడ్డంకులను సృష్టించాము, తద్వారా భయాలు ఎలా పెరిగాయి అన్నది తెలుసుకోవడం ముఖ్యం.
ఇక్కడ పై చిత్రం నుండి ఒక స్థలాన్ని ఎంచుకోండి మరియు ఆ స్థలం ఎంచుకోవడం ద్వారా మీ మానసిక నిజాలను తెలుసుకోండి.

ఎవ్వరూ దరిచేరని ఇల్లు: (వదిలివేయబడి, వెళ్ళడానికి భయం గొల్పించే ప్రాంతం)
మీరు ఇలా వదిలివేయబడిన ఇంటిని ఎంచుకున్నట్లయితే, మీరు చాలా తెలివైన మరియు విశ్లేషణ చెయ్యగలిగిన వ్యక్తి. కళ్ళకు కనపడే అంశాలని అంత తేలికగా నమ్మే స్వభావం మీది కాదు. మీరు కొన్ని ఎంపిక చెయ్యబడిన వస్తువులను సైతం ప్రేమిస్తారు, అపురూపంగా చూసుకుంటారు. కారణం మీకు వాటి విలువ, విశిష్టత తెలుసుకాబట్టి. మీరు ఎక్కువ భావోద్వేగ మరియు ఆద్యాత్మిక లక్షణాలను కలిగి ఉంటారు. తద్వారా ఇతరులు మిమ్ములను అంచనా వెయ్యడం కష్టతరం. మీ జీవితంలో మీకంటూ ఉన్న నిజమైన స్నేహితులు కొద్దిమందే ఉంటారు. మీరు మేదావితనాన్ని ప్రదర్శించే కన్నా మానసిక ఉల్లాసానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు.

మంచుగుహ :
ఒక మంచు గుహను ఎన్నుకోవడమంటే మీచుట్టూ ఉన్న భావోద్వేగ వెచ్చదనం కోసం మీరు ఎక్కువకాలం ఎదురుచూశారు. మీరు శోధిస్తున్న నిధి ప్రేమ. ఇది ఆప్యాయత అయినా శృంగారపరముగానైనా ఉంటుంది. ఒక వ్యక్తిగా మీరు నిరాశకు గురవుతున్నారన్నభ్రమలో భయానికి గురవుతూ ఉంటారు. అందుకే మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అయితే, మీరు కోరుకున్న వాటిపై ఉన్న అవగాహన మూలంగా, అత్యాశలకు పోకుండా అందమైన జీవితాన్ని గడుపుటకు అనువుగా ఉంటారు. మరోవైపు, మీరు గొప్ప విలువలతో కూడుకుని, మరియు స్వేచ్చా స్వతంత్ర భావాలున్న వ్యక్తిగా ఉంటారు.

చైన్డ్ డోర్:
మీరు ఈ తలుపు ఎంచుకున్నట్లయితే, మీరు పారదర్శకంగా పనులను దిగ్విజయంతో పూర్తి చెయ్యగలిగిన సమర్ధులై ఉంటారు. తద్వారా అకుంటిత దీక్షతో లక్ష్య సాధనలో ఎల్లప్పుడూ ముందు ఉంటారు. ఎక్కువ క్లిష్టమైన లక్ష్యాలను ఎన్నుకోవడం మీఅలవాటు. మీరు సృజనాత్మకంగా ఉంటారు మరియు సమస్యలను పరిష్కరించడంలో చాలా ముందుచూపు కలిగిన వారై ఉంటారు. మంచి నాయకత్వపు లక్షణాలతో ఉత్తమంగా ఉంటారు. మరోవైపు, మీ లక్ష్యాలు పెరిగే కొద్దీ మానసిక అశాంతి తోడవుతుంది. కావున ఎక్కువ పనిని నిలబెట్టుకోకుండా విశ్రాంతికి కూడా ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది. తద్వారా జీవితంలో ఎన్నో సరళమైన విషయాలను ఆలోచించడం చేయగలుగుతారు, తద్వారా ఒక ఉన్నతమైన ఆనందకరమైన జీవితాన్ని పొందగలిగిన వారవుతారు.

చీకటి సొరంగం:
మీరు ఒక చీకటి సొరంగం ఎంచుకుంటే, మీరు మీ భావోద్వేగాలను పరిశీలించవలసి ఉంటుంది. ఒక వ్యక్తిగా, మీరు తెలివైన మరియు భావోద్వేగం ఎక్కువగా కలిగినవారై ఉంటారు. ఎంచుకున్న చీకటి సొరంగం, మీ మనసు ఆలోచనల పుట్ట అని చెప్పకనే చెబుతుంది. మీ ఆలోచనలను సరిగ్గా అర్ధం చేసుకోడానికి సమయం వెచ్చించవలసి ఉంటుంది. మరోవైపు, మీరు సమస్యల గురించి చింతించకుండా, పరిష్కారమార్గాల కోసం అన్వేషణ చెయవలసి ఉంటుంది.

ఎ వుడెన్ క్యాబిన్:
మీరు దీనిని సందర్శించకూడదనే చోటుగా ఎంచుకున్నట్లయితే, మీరు ఇతరులకు ఎల్లప్పుడూ కనిపించే ఒక ఉదారస్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటారు. ఒక వ్యక్తిగా, మీరు యదార్ధవంతులుగా నీతి నిజాయితీలతో ఉంటారు. కాని ఇవి ప్రతిఒక్కరూ ఆహ్వానించలేరు. మీరు ఎంచుకున్నది ఇలాంటి ఇల్లే అయితే , మీకు కావలసినది ముఖ్యంగా డబ్బు పరపతి. కావున ఎక్కువ కష్టం చేయవలసి ఉంటుంది.

మెట్ల మార్గం:
మీరు ఈ చిత్రాన్ని ఎన్నుకుంటే, మీకు ఖననం అంటే భయం అని అర్ధం. మీకు మరణం భయం ఉంది మరియు మీ మార్గంలో వస్తున్నది ఏదీ మీకు తెలియదు. ఏది జరిగితే అది అన్న భావనలో ఉంటారు. మీరు కోరుకునే నిధి మంచి ఆరోగ్యం. మరొక వైపు, మీరు ఏ విషయాన్నైనా అతిగా ఆలోచన చేస్తారు, కానీ ఎప్పటికీ మీ జీవన శైలిని , జీవన మార్గాన్ని ప్రేమిస్తూనే ఉంటారు.