For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ చేతిలోని హృదయ రేఖలో “V” అనే అక్షరం తెలిపే విషయాలు

  |

  కొన్ని నిర్దిష్టమైన అంశాలు రాశి చక్ర అంచనాలు, జాతకం, న్యూమరాలజీ మరియు హస్తసాముద్రికoపై కూడా ఆధారపడి ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిన విషయo. పురాతన కాలం నుండి జ్యోతిష్య శాస్త్రంతో పాటు హస్తసాముద్రికం కూడా అత్యంత ప్రాచుర్యం పొందింది. హస్తసాముద్రికం ప్రకారం అరచేతిలో ఉన్న రేఖలను పరిగణనలోనికి తీసుకుని భవిష్యత్ కాలాలను సైతం అంచనా వేయవచ్చని చెప్పబడినది. ఈ వ్యాసంలో ఆ రేఖలలో ముఖ్యమైన హృదయ రేఖలోని v అను అక్షరం ప్రాధాన్యతను తెలుసుకుందాం.

  అంచనాలు ఎంత అనూహ్యమైనవి అయినా, వాటి ఖచ్చితత్వంతో సరైన ఫలితాలను ఇస్తూ వ్యక్తి మానసిక ఆందోళనలను దూరం చేసే దిశగా దోహదపడుతుంటాయి.

  What Does The Letter “V” On Your Heart Line Reveal

  హస్తసాముద్రికం ప్రకారం, మన చేతి రేఖలు కలిగి ఉన్న కొన్ని పంక్తులు మన భవిష్యత్ నిర్దేశకంగా ఉంటాయి అనడంలో ఆశ్చర్యం లేదు.

  ఈ వ్యాసంలో చేతి హృదయరేఖలో ఉండే V అనే అక్షరం తెలిపే విషయాల గురించిన వివరాలను మీముందుకు తెస్తున్నాం.

  మీ హృదయ రేఖ చివరిలో మీకు 'V' అక్షరం ఉంటే, అది అదృష్టంగా పరిగణించబడుతుంది. మరియు, అదే సమయంలో, మీ అరచేతిలో ఈ రేఖ లేని పక్షాన, మీరు హృదయం లేని వారిగా చెప్పబడింది! అనగా క్లిష్ట సమయాల్లో కూడా మొండి వైఖరిని అవలంభిస్తూ కఠినాత్మక ధోరణి ప్రదర్శిస్తుంటారు అని అర్ధం.

  ఒకవేళ మీరు మీ హృదయ రేఖపై ఈ అక్షరాన్ని కలిగి అదృష్టవంతులుగా ఉన్న ఎడల, మీ వ్యక్తిత్వo ఎలా నిర్వచించబడిందో తెలుసుకోండి.

  అక్షరం యొక్క స్థానం...

  V అనే అక్షరం హృదయ రేఖ చివరిలో ఖచ్చితత్వంతో ఉండాలి. అరచేతిలో ఈ అక్షరం లేని వారు, హృదయం లేని వారిగా పరిగణించబడడమే కాదు, ఏ సమయంలో అయినా ఏ విధమైన పశ్చాత్తాపం, ప్రేమ మరియు ప్రశంసలు చూపించని వ్యక్తులుగా కూడా వారు చెప్పబడ్డారు. తద్వారా వీరు అనేక ప్రతికూల ప్రభావిత పరిస్థితులను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. ముక్కుసూటి తత్వం ప్రదర్శిoచడం వీరి ప్రధాన లక్షణంగా ఉంటుంది.

  హృదయ రేఖ ప్రాముఖ్యత:

  హస్తసాముద్రికంలో, మీ సంబంధాలు మరియు భావోద్వేగాలను అంచనా వేసేందుకు హృదయ రేఖ ప్రాథమికంగా సహాయపడుతుంది. ఇది కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి ఖచ్చితత్వంతో కూడిన వివరాలు అందించడంలో సహాయపడుతుంది. మీ హృదయ రేఖ చాలా ప్రాముఖ్యమైనది, ఇది మీ గత సంబంధాల గురించి కూడా చెప్పగలదు. హస్తసాముద్రికంలో హృదయ రేఖ అనేది ముఖ్యమైన నాలుగు ప్రధాన పంక్తులలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది మరియు వ్యక్తి గురించిన అనేక వివరాలను వెల్లడించగలడు కూడా. ముఖ్యంగా హృదయ రేఖలోని “V” అనే అక్షరం దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్వచించడంలో ఈ హృదయ రేఖ ఎంతగానో దోహదపడుతుంది.

  బ్రేక్స్ ఉన్నాయేమో చూడండి:

  మీ హృదయ రేఖలో విరామాలు కనిపిస్తూ ఉంటే, మీ భావాలు తరచుగా మారుతుంటాయని అర్ధం. ఈ భావాలు అనేక మంది మీపట్ల వ్యతిరేక ఆలోచనలు చేసేలా పురిగొల్పుతాయి. పరిస్థితులకు తగ్గట్లుగా సమయానుసారం మీ ఆలోచన ధోరణి తరచుగా మారుతూ ఉంటుంది. తద్వారా, నిలకడ లేని స్వభావం ప్రస్పుటంగా ప్రదర్శితమవుతుంది. ఇటువంటివి కుటుంబ కలహాలకు కూడా కారణభూతమవుతూ ఉంటాయి. ఒడిదుడుకుల మద్య జీవితం కొంచం క్లిష్టతరంగా కొనసాగుతుంది.

  “V” అనే అక్షరం రేఖ చివరలో కనిపించినప్పుడు:

  హస్తసాముద్రికం ప్రకారం, ఈ V అనే అక్షరం హృదయ రేఖ చివరలో కన్పించిన ఎడల అసంపూర్ణ వ్యాపారo లేదా వ్యక్తి యొక్క వ్యక్తిగత అభివృద్ధిని సూచిస్తుంది అని నమ్ముతారు. చివరిలో ఈ అక్షరాన్ని కలిగి ఉన్న ఎడల, అనేక ప్రతికూల పరిస్థితుల మద్య ఒడిదుడుకులతో కూడుకుని అనేక సమస్యల మద్య ఆర్ధిక పరిస్థితులు కొట్టుమిట్టాడుతుంటాయి. కానీ విజయం మాత్రం తప్పక వరిస్తుంది. ఇక్కడ ఓర్పు సహనం అనేవి ఖచ్చితంగా అవసరమవుతాయి.

  మీరు అదృష్టవంతులు!

  మీ అరచేతి హృదయ రేఖలో V అనే అక్షరం ఉన్న ఎడల, మీరు చాలా అదృష్టవంతులుగా మరియు విజయవంతమైనవారిగా భావించబడుతారు. మీరు మీ జీవితంలో అధిక ధనాన్ని సంపాదించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, మీరు గొప్ప అదృష్టంతో ఆశీర్వదించబడడమే కాకుండా, మీ జీవితాలలో ఉత్తమమైన వ్యక్తులను స్నేహితులుగా కలిగి ఉంటారని కూడా చెప్పబడింది. స్నేహం పరంగా మాత్రమే కాకుండా జీవిత భాగస్వామి పట్ల మీరు అత్యంత విధేయతను ప్రదర్శిస్తుంటారు.

  మీరు నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు:

  మీరు మీ విశ్వాస పాత్రులైన స్నేహితులను కలిగి ఉండడమే కాకుండా, మీరు కూడా వారి స్నేహం పట్ల నిబద్దతను ప్రదర్శిస్తూ ఉంటారు. మరోవైపు, సమాజoలో మంచి పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. మీ జీవితం 35 సంవత్సరాల వయసులో ఖచ్చితంగా ఊహకందని మలుపును కలిగి ఉంటుంది. ఈ మలుపు మీ జీవితాన్నే మార్చివేయగలదని చెప్పబడినది. కుటుంబంతో అత్యున్నత సంబంధాలను కలిగి ఉండడమే కాకుండా, ప్రేమానురాగాలను కూడా కలిగి ఉంటారు. మీ కష్టనష్టాలను పంచుకునే క్రమంలో మీకై ఎదురుచూసే వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారని మరవకండి. 35 ఏళ్ళ తర్వాత మీ ఆర్ధిక, సామాజిక పురోగతి అద్భుతంగా ఉంటుంది. తద్వారా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వెన్నంటి ఉండే మీ ప్రియమైన వారి పట్ల మీరు చూపే నిబద్దత, మీ సంబంధాలను మరింత దృడ పరుస్తుంది.

  హస్త సాముద్రికంలో హృదయ రేఖ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు కదా, మరి మీ అర చేతిలో హృదయ రేఖ వెంబడి V అను అక్షరం ఉందా ? , అయితే మీ వ్యాఖ్యలను లేదా అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక సంబందిత అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

  English summary

  What Does The Letter “V” On Your Heart Line Reveal

  When it is about believing in certain untold facts, we tend to depend on the predictions of zodiacs, horoscope, numerology and even palmistry. No matter how unpredictable the predictions can be, we tend to believe in these predictions at times, due to their accuracy.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more