For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లావుపాటి పురుషులు మాత్రమే అందంగా ఉంటారని భావించే “ఇథియోపియన్ తెగ“

Ethiopian Tribe Belives Fattest Man were Beautiful

|

ఏదైతే అతి పెద్ద తెగ/జాతిగా ఉంటుందో, అది ఖచ్చితంగా అందమైన తెగే అయ్యుంటుంది: ఆ గ్రామంలోని ఇథియోపియన్ పురుషులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ, 6నెలల పాటు ఒంటరిగా నివసిస్తూ రక్తం మరియు పాల మిశ్రమాన్ని సేవించి మరీ లావుగా తయారవుతుంటారు.

“బోడి” తెగ నుండి వచ్చిన పురుషులు కొత్త సంవత్సరం లేదా కయేల్ వేడుకలో భాగంగా లావుగా తయారవుటకు ఇలాంటి జీవనాన్ని అవలంబిస్తారు. వింటేనే వళ్ళు గగుర్పొడుస్తుంది కదూ. వారు వీలయినంత వేగంగా లావుగా మారే క్రమంలో భాగంగా ఆరునెలల పాటు రక్తం మరియు పాల మిశ్రమాన్ని అదేపనిగా తీసుకుంటూ గడుపుతారు.

గెలుపొందిన మనిషి బహుమతిని పొందలేడు కానీ మిగిలిన జాతికి, జీవితాoతo ఒక నాయకునిగా లేదా హీరోలా ఉంటాడు.

Ethiopian Tribe Belives Fattest Man were Beautiful

బోడి తెగ వారు తమ సంప్రదాయాలను నిలబెట్టుకోవడానికి అనేక కష్టాలు పడుతున్నారు, కానీ ప్రభుత్వo పునరావాస పథకాలు అంటూ, వీరి సాంప్రదాయాన్ని నాశనం చేసే దిశగా కదుపుతున్న పావులు వీరికి బెదిరింపులవలె తోస్తున్నాయి.

సన్నగా మరేదైనా తెగలో ఉండవచ్చు, కానీ ఇథియోపియాలోని బోడి తెగలో మాత్రం పురుషులు లావుగా ఉండడమే ఉత్తమంగా భావిస్తారు., ఇథియోపియా యొక్క ఓమో లోయలో ఒక రిమోట్ ప్రాంతంలో నివసిస్తున్న ఈతెగ, అసాధారణ ఆచారాలకు నిలయంగా చెప్పబడుతున్నది., ఈ ఆచారాల ప్రకారంగా గోరక్తాన్ని మరియు పాలను లావుగా మారుటలో భాగంగా వినియోగిస్తారు.

వీరిని ఎవరు మార్చాలని ప్రయత్నించినా, అవి బెదిరింపులుగా భావిస్తుంటారు. ఇప్పుడు కొద్దిగా తెలిసిన ఈసమాచారం కూడా “ ఫ్రెంచ్ షట్టర్బగ్ ఎరిక్ లాఫ్ఫోర్గ్యూ” అనే ఔత్సాహికుడు తీసిన నమ్మశక్యం కాని ఫోటోల ద్వారా ప్రపంచానికి తెలిసింది– ఇతను, నైరుతి ఇథియోపియాకు ప్రయాణిస్తున్న సమయంలో ఈతెగ వారితో బోడీ న్యూయియర్ లేదా కయేల్ వేడుకలలో భాగంగా వీరితో సరదాగా గడిపాడు. ఈ వివరాలు గురించి మరి కొంత తెలుసుకుందాం..

హీరో:

హీరో:

లాఫ్ఫోర్గ్యూ ప్రకారం, ప్రతి పిల్లవాడు కూడా ఫ్యాట్ మెన్లలో ఒకరిగా కావాలని కోరుకుంటారు. వీరు తమలాగే ఈ తెగలోని మిగిలిన వారికి కూడా మార్గదర్శకంగా మారాలని భావిస్తుంటారు.

ఛాలెంజ్:

ఛాలెంజ్:

ఈ పోటీ 6నెలల ముందే ప్రారంభమవుతుంది. ఈ పోటీలో భాగంగా, ఒక గుడిసెకు పూర్తిగా అంకితమయిపోయి, వారి మహిళలు తెచ్చే ఆహారాన్ని భుజిస్తూ జీవనాన్ని కొనసాగిస్తారు. న్యూయియర్ రోజున ఈగుడిసె నుండి పూర్తిగా బయటకు వస్తారు. వీరికి న్యూయియర్ జూన్లో మరి.

ఒక్కోసారి ఉదయాన్నే ఇలాంటి ఆహారాన్ని అపరిమితంగా తీసుకోవడం వలన

ఒక్కోసారి ఉదయాన్నే ఇలాంటి ఆహారాన్ని అపరిమితంగా తీసుకోవడం వలన

ఒక్కోసారి ఉదయాన్నే ఇలాంటి ఆహారాన్ని అపరిమితంగా తీసుకోవడం వలన జబ్బునపడి అనేక సమస్యలను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. అయినా కూడా ఆగుడిసె నుండి బయటకు వచ్చుటకు మాత్రం సుముఖంగా ఉండరు. వారికి వారి సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవం, నాయకత్వం మీద ఉన్న ఆశ, అంత ఉన్నతంగా ఉంటుంది మరి.

పాలన:

పాలన:

ప్రతి పోటీదారుడు తన కుటుంబం ద్వారా ఎన్నుకోబడుతాడు. ఆ తరువాత అతను ఆరునెలల పాటు ఆవు రక్తం మరియు పాలను ఆహారoగా తీసుకునేలా ఒక గుడిసెకు కేటాయించబడుతాడు.

భాదాకరమైన విషయం ఏమిటంటే,

భాదాకరమైన విషయం ఏమిటంటే,

ఈ కయేల్ వేడుకలు మరియు ఈ బోడీ తెగ సాంప్రదాయాలు మరియు వారి జీవనవిధానాలకు, ఇథియోపియన్ గవర్నమెంట్ నుండే ప్రమాదం పొంచిఉంది. పునరావాస పథకాలలో భాగంగా వీరు తీసుకునే నిర్ణయాలు ఈతెగ విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండడమే దీనికి కారణం.

ప్రస్తుతానికి, ఈతెగవారు తమ జీవనశైలిని కొనసాగిస్తూ ఉన్నారు,

ప్రస్తుతానికి, ఈతెగవారు తమ జీవనశైలిని కొనసాగిస్తూ ఉన్నారు,

ప్రస్తుతానికి, ఈతెగవారు తమ జీవనశైలిని కొనసాగిస్తూ ఉన్నారు, మరియ ప్రతి జూన్లో తమ సంప్రదాయ శైలిలో కయేల్ ను జరుపుకుంటున్నారు కూడా.

ఈ పోటీ వేడుక ఆరునెలల ముందు ప్రారంభమవుతుంది

ఈ పోటీ వేడుక ఆరునెలల ముందు ప్రారంభమవుతుంది

ఈ పోటీ వేడుక ఆరునెలల ముందు ప్రారంభమవుతుందని ముందే చెప్పుకున్నాం కదా, మరియు వారి కుటుంబం నుండి ఒక వ్యక్తిని కూడా ఎన్నుకుంటారని తెలుసుకున్నాం. కానీ ఈవ్యక్తి ఎంపికలో కూడా ఒక విధానం ఉంటుంది. వీరు ఈ పోటీలో భాగంగా తమ కుటుంబంలోని పెళ్ళికాని వ్యక్తిని ఎన్నుకోవలసి ఉంటుంది. ఎవరైతే ఇలా ఎన్నుకోబడ్డారో వారు ఎక్కడికీ కదలకుండా గుడిసెలకు అంకితమవ్వడమే కాకుండా, ఈ పరిధి కాలంలో లైంగిక సంబంధాలకు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇలా కఠిన నిర్ణయాలు తీస్కోవడం ద్వారా, వీరిలో పట్టుదల పెరిగి, లావుగా అయ్యే మార్గం దిశగా ఆహారం మీదనే అధిక ద్యాసను కేంద్రీకరిస్తారని వీళ్ళ ఆలోచన.

వీరి ఆహారం ఆవురక్తం మరియు పాలమిశ్రమం రూపంలో వస్తుంది,

వీరి ఆహారం ఆవురక్తం మరియు పాలమిశ్రమం రూపంలో వస్తుంది,

వీరి ఆహారం ఆవురక్తం మరియు పాలమిశ్రమం రూపంలో వస్తుంది, గ్రామానికి చెందిన స్త్రీలు ఈ పురుషులకు క్రమంగా సేవలను అందిస్తారు. లాఫ్ఫోర్గు చెప్పిన వివరాల ప్రకారం ఈతెగ వారికి ఆవు పవిత్రమైనది, కావున వీరు రక్తంకోసం గోవధ చేయరు. 'ఒక కవచం లేదా గొడ్డలితో ఒక ప్రత్యేకమైన పద్దతిలో గోవుకు రంధ్రం చేయడం ద్వారా రక్తాన్ని సంగ్రహిస్తారు. ఆ తర్వాత ఆ రంద్రాన్ని మట్టితో మూసివేస్తారు.'

మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగా,

మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగా,

మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, ఈ రెండు లీటర్ల మిశ్రమాన్ని అతి త్వరగా సేవించవలసి ఉంటుంది. లేనిచో అవి కొన్ని ఈగల కారణంగా లేదా సూర్యరస్మి కారణంగా కొన్నిచర్యలకు గురయ్యి నిరుపయోగంగా లేదా విషపూరితంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంత వేగంగా ఈ రెండు లీటర్ల మిశ్రమాన్ని సేవించడం అందరి వలనా కాదు కూడా. వేడుక జరిగే ముందు రోజు పురుషులు, వీరి శరీరాలను మట్టితో,బూడిదతో కప్పి, గుడిసెలనుండి బయటకు వస్తారు. తద్వారా వేడుకకు నడుస్తూ చేరుకుంటారు.

తయారీ:

తయారీ:

వేడుకలో భాగంగా ఆరోజు, బోడి తెగ యొక్క లావుపాటి మనిషి తన శరీరాన్ని తెల్లని బురద లేదా మట్టి మరియు బూడిదతో కప్పుకుని సిద్దమని ప్రకటిస్తారు.

అలంకరణ :

అలంకరణ :

ఈ వేడుకలో పాల్గొనడానికి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. ఈ దుస్తులలో భాగంగా అందంగా తయారుచేయబడిన మరియు ఎంపిక చేయబడిన శిరస్త్రాణాలు ధరించవలసి ఉంటుంది, ఇవి ఉష్ట్రపక్షి రెక్కలతో, గవ్వలతో తయారుచేయబడి ఉంటాయి.

కవరింగ్:

కవరింగ్:

పురుషుల శరీరంలోని ప్రతి భాగాన్ని బూడిద మరియు మట్టి మిశ్రమంతో కప్పినట్లే, రంగురంగుల పూసలుగల హారాలను మరియు బ్రాస్లెట్లను కూడా ధరిస్తారు.

మార్గంలో:

మార్గంలో:

పురుషులు వేడుకలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వారు వేడుక జరిగే పవిత్రమైన చెట్టు వద్దకు నడిచి వెళ్ళవలసి ఉంటుంది - వారి బరువు కారణంగా వారు అక్కడికి చేరుకోవడం అనేది ఒక సవాలుగా ఉంటుంది. ఫోటోలు చూడండి మీకే అర్ధమవుతుంది.

చాలెంజింగ్:

చాలెంజింగ్:

కొవ్వు ఎక్కువ చేరుకున్న కారణాన చాలామందికి, నడక నిరుత్సాహంగా ఉంటుంది. అదృష్టవశాత్తు అతనికి సహాయం చేసేందుకు మహిళలు (ఎడమ వైపు) మరియు లాఫ్ఫోర్గూ (కుడి వైపు చేరి) స్వయంగా సహాయం చేశారు కూడా.

ఉపశమనం:

ఉపశమనం:

నడకలో భాగంగా డస్సిపోతున్న వ్యక్తికి బోడి తెగ మహిళలు పానీయాలు మరియు బలపరిచే అంశాలు కలిగిన మద్యాన్ని శక్తి పానీయంగా అందజేస్తుంటారు కూడా.

బరువు పెరుగుట అత్యంత ఆహ్వానించదగ్గ అంశం వీరికి.

బరువు పెరుగుట అత్యంత ఆహ్వానించదగ్గ అంశం వీరికి.

బరువు పెరుగుట అత్యంత ఆహ్వానించదగ్గ అంశం వీరికి. వీరిలో కొందరు తమ మార్గంలో కొంత దూరం మాత్రమే కష్టంగా నడుపుతారు. కానీ కొందరు మాత్రం వారు అనుకున్న బరువుకన్నా అధిక బరువు పొందడం వలన కొంత దూరo కూడా నడవలేని స్థితికి వస్తారు. నిజానికి ఇది వాళ్లకి చాలా క్లిష్టమైన అంశమనే చెప్పాలి.

వేడుక ప్రాంతానికి చేరుకునే క్రమంలో భాగంగా ఒకరు,

వేడుక ప్రాంతానికి చేరుకునే క్రమంలో భాగంగా ఒకరు,

వేడుక ప్రాంతానికి చేరుకునే క్రమంలో భాగంగా ఒకరు, లాఫ్ఫోర్గూను కారులో లిఫ్ట్ ఇమ్మని కూడా అడిగారు. మరియు కారులో కూడా పాలు, రక్తాన్ని సేవించడం చేశాడు. ఎందుకిలా అని అడగగా, ఆ ప్రదేశాన్ని చేరుకునే చివరి క్షణం వరకు లావుగా మారాలన్న నాప్రయత్నాన్ని ఆపను అన్నాడు.

 ఈ వేడుకలో ఒక పవిత్ర వృక్షం చుట్టూ వృత్తాకారంలో

ఈ వేడుకలో ఒక పవిత్ర వృక్షం చుట్టూ వృత్తాకారంలో

వేడుకలో ఒక పవిత్ర వృక్షం చుట్టూ వృత్తాకారంలో గంటల పాటు పురుషులచే నడక నిర్వహించబడుతుంది మరియు వీరి మహిళలు వీరిని సేద తీర్చడంలో భాగంగా మద్య మద్యలో మద్యాన్ని, పానీయాలను అందిస్తూ, చమట తుడుస్తూ ఉంటారు.

నాయకుడిని ఎంపిక చేయబడిన తరువాత

నాయకుడిని ఎంపిక చేయబడిన తరువాత

నాయకుడిని ఎంపిక చేయబడిన తరువాత, ఒక పవిత్రమైన పెద్ద రాయిని ఉపయోగించి నాయకుడు రక్తం సంగ్రహించిన ఆవును చంపడం ద్వారా వేడుక ముగుస్తుంది. గ్రామీణ పెద్దలు ఆవు కడుపును తనిఖీ చేయడం ద్వారా ఆ ఆవు ఆరోగ్యస్థితిని అంచనా వేసి, వీరి భవిష్యత్తు బాగుంటుందో లేదో నిర్ణయిస్తారు.

 వేడుక తరువాత,

వేడుక తరువాత,

వేడుక తరువాత, పురుషుల సాధారణ జీవన శైలికి అలవాటు పడి, ఆహారాన్ని తగ్గించి నెమ్మదిగా పొట్టను తగ్గించడం, సన్నబడడం వంటి చర్యలకు ఉపక్రమిస్తారు. కానీ కొన్ని వారాల తరువాత, తరువాతి తరానికి పోటీ మరలా ప్రారంభమవుతుంది.

'ఒక లావుపాటి మనిషి కావడం బోడి తెగలోని ప్రతి పిల్లవాడి కల,'

'ఒక లావుపాటి మనిషి కావడం బోడి తెగలోని ప్రతి పిల్లవాడి కల,'

'ఒక లావుపాటి మనిషి కావడం బోడి తెగలోని ప్రతి పిల్లవాడి కల,' అని లాఫ్పోర్గ్యు చెబుతాడు. 'కొన్ని వారాలు [వేడుక తర్వాత] అతను సాధారణ కడుపుని తిరిగి పొందుతాడు, కానీ అతను జీవితాంతం తమ తెగకు ఒక హీరోగా ఉంటాడు.'

పవిత్రమైన అంశం: ఈ లావుపాటి పురుషులు, తమ మహిళల మరియు కొందరి సహాయంతో ఈ ప్రత్యేకమైన చెట్టు చుట్టూ నడవడం లేదా పరుగెత్తడం.

సహించలేని అంశం:

సహించలేని అంశం:

వేడుకకు సిద్దమవడానికి 6నెలల పాటు వ్యాయామం కూడా చేయని కారణంగా, వీరు వేడుకలో చెట్టు చుట్టూ తిరగడంలో అనేక విరామాలు కూడా తీసుకుంటారు. వేడుక పూర్తయిన తర్వాత కూడా వీరు వ్యాయామాన్ని చేయలేని స్థితిలో ఉంటారు. కావున ముందుగా ఆహారాన్ని తగ్గించి, తద్వారా బరువు తగ్గిన పిమ్మట తమ పనులకు పూనుకోగలుగుతారు.

నాయకునిగా ప్రకటించడం:

నాయకునిగా ప్రకటించడం:

ఎండలో చెట్టుచుట్టూ గంటలపాటు నడిచిన తర్వాత, వీరిలో ఎవరు బోడి తెగ నాయకునిగా ఎన్నుకోబడ్డారో ప్రకటించబడుతారు. ఆ తర్వాతనే నడకను ఆపివేయవలసి ఉంటుంది.

ఆసక్తికర అంశం : మహిళలు, వీరిలో ఎవరు నాయకునిగా ఎన్నుకోబడుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎన్నుకోబడిన నాయకుని పెళ్లి చేసుకోవాలని వీరి ఆలోచనగా ఉంటుంది.

విజేత: కుడివైపున మనిషితో సహా - 2013లో ఎడమవైపున ఉన్న వ్యక్తి కూడా విజేతగా నిలిచిన వ్యక్తి. జీవితాంతం వీరు హీరోలుగా పిలువబడుతారు.

త్యాగం:

త్యాగం:

వేడుక ముగింపులో బోడి వారి విలువైన ఆవులలో ఒకదానిని చంపి, దాని రక్తం మరియు మృదులాస్థులను పరీక్షించి భవిష్యత్తులో వీరి భవితవ్యం ఎలా ఉంటుందో నిర్ణయిస్తారు.

ఉపశమనం: ఈ వేడుక ముగిసిన తరువాత, పురుషులు సాధారణ ఆహారపదార్ధాలకు తిరిగి వస్తారు. మరియు సాధారణంగా కయేల్ తర్వాత కొన్ని వారాల గడువులోనే అదనపు బరువును కోల్పోతారు.

అవకాశo : బోడి మహిళలు తమ భర్తలను నిర్ణయించుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు.

బ్యూటిఫుల్ : హనా ముర్సిలోని పునరావాస గ్రామంలో నివసిస్తున్న ఒక బోడి తెగ మహిళ ఆమెకు అలంకరించబడిన మచ్చ నమూనాలు మరియు సొగసైన ఆభరణాలను చూపించింది.

నిశ్చేష్టులను చేసే అంశం:

నిశ్చేష్టులను చేసే అంశం:

బోడి గిరిజనులు ధరించే ప్రకాశవంతమైన దుస్తులు.

బోడి మహిళలు కూడా బూడిద మరియు తెలుపు మట్టి ధరిస్తారు, కానీ ముఖ్యంగా వారి జుట్టు కోసం మాత్రమే ఉపయోగిస్తారు

స్ట్రైకింగ్: వేడుకకు హాజరైన మహిళలు తమ ప్రకాశవంతమైన మరియు అత్యంత అందమైన దుస్తులను, తమను తాము ప్రదర్శించడంలో భాగంగా ధరిస్తారు అంటే ఊహించగలమా.

All Images Source

English summary

Ethiopian Tribe Belives Fattest Man were Beautiful

Ethiopian Tribe Belives Fattest Man were Beautiful
Story first published:Tuesday, May 15, 2018, 18:35 [IST]
Desktop Bottom Promotion