వీళ్లు బాబాలు కాదు.. కామ పిశాచులు, భక్తి ముసుగులో అమ్మాయిలతో శృంగారాలు.. రాజభోగాలు

Subscribe to Boldsky

భక్తి ముసుగులో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన బాబాలు మన దేశంలో చాలామందే ఉన్నారు. అయితే ఇప్పటికీ కొందరు బాబాలను గుడ్డిగా నమ్మే జనం ఇంకా ఉన్నారు. ఇలాంటి బాబాల అరాచకాలు బయటపడుతుండడంతో వరుసగా జైలు పాలు అవుతూనే ఉన్నారు.

జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు

జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు

ఇలాంటి రేపిస్ట్ బాబాలు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌, ఆశారాం బాపూలాంటి వారు బయటపడ్డారు కానీ ఇంకా వేలాది మంది బాబాలు ఇలాంటి అరాచకాలు సాగిస్తూనే ఉన్నారు.

నమ్ముతూనే ఉన్నారు

నమ్ముతూనే ఉన్నారు

అమాయక జనం వాళ్లను ఇంకా నమ్ముతూనే ఉన్నారు.

భక్తి, సంప్రదాయాల ముసుగులో అనైతిక కార్యకలాపాలకు పాల్పడే ఇలాంటి బాబాల విషయంలో భక్తులు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి.

ఆశారాం బాపు

ఆశారాం బాపు

ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ను సీబీఐ న్యాయస్థానం దోషిగా పేర్కోంటూ 20 ఏళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అలాగే ఆశారాం బాపు కూడా అత్యాచారం కేసులో జైలు వెళ్లారు.

నారాయణ్ సాయి

నారాయణ్ సాయి

అతడి కుమారుడు నారాయణ్ సాయి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. అలాగే హరియాణాకు చెందిన మరో గురువు రామ్‌పాల్ కూడా ప్రస్తుతం జైళ్లో ఉన్నారు. ఇలాంటి బాబాలు ఇంకా చాలా మందే ఉన్నారు.

తనను తాను దేవుడిగా చెప్పుకుంటూ

తనను తాను దేవుడిగా చెప్పుకుంటూ

భారత దేశంలో దొంగ బాబాలు విపరీతంగా పెరిగిపోయారు. ఆశ్రమంలో 16 బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపుపై కేసు నమోదై తాజాగా జైలు పాలయ్యారు. తనను తాను దేవుడిగా చెప్పుకుంటున్న ఆశారాం బాపుపై నమోదైన అత్యాచార కేసులో తుది తీర్పు తాజాగానే వెలువడింది.

దోషిగా తేల్చింది

దోషిగా తేల్చింది

జోధ్‌ పూర్‌ సెంట్రల్‌ జైలులో ఏర్పాటుచేసిన ప్రత్యేక గదిలో ఈ కేసుకు సంబంధించిన తుది విచారణ కొనసాగింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో గల ఆశారాం ఆశ్రమంలో చదువుకుంటున్న బాలికపై ఆగస్టు 15, 2013న అత్యాచారం చేసినట్లు ఆశారాం బాపుపై కేసు నమోదైంది. బాలికపై రేప్ కేసులో ఆశారాం బాపూని జోధ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది.

అందరి కళ్లు గప్పి

అందరి కళ్లు గప్పి

మొదటు కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు.

సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు

సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు

చివరికి 2013 సెప్టెంబర్‌ 1న ఆశారాంను జోధ్‌పూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూకు సంబంధించిన మనుషులు దాడులకు దిగారు. ఆశారాం బాపూని అరెస్ట్‌ చేసి రెండు నెలలు తిరక్కుండానే సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.

మూడో తరగతే

మూడో తరగతే

అసలు ఈ ఆశారాం ఎవరు? ఈయన ఎలా ఎదిగారు అనేది చూస్తూ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 1941 సంవత్సరంలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సింధ్‌ ప్రాంతంలో పుట్టాడు ఇతను. 15 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మూడో తరగతి మాత్రమే చదివాడు. గురు లీలా షాజీ మహరాజ్‌ దగ్గర శిష్యరికం చేశాడు ఆశారాం. మొదట గుజరాత్‌లోని మొతేరా దగ్గర సబర్మతి తీరంలో చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత దేశ విదేశాల్లో తన ప్రవచనాలతో పేరు సాధించాడు.

ప్రధాని మోదీ కూడా

ప్రధాని మోదీ కూడా

ఆశారాంపై భూ కబ్జా ఆరోపణలు, ఆశ్రమంలో అనుమానాస్పద మృతులు వంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. చాలా తక్కువ సమయంలోనే ఆశారాం పాపులారిటీ దేశవ్యాప్తంగా పెరిగింది. అనేక రాజకీయవేత్తలు కూడా ఆశారాంకు స్నేహితులుగా ఉన్నారు. గతంలో ప్రధాని మోదీ కూడా ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఆశారాంకు కోట్లు విలువైన ఆస్తులున్నాయి.

అందరి బాబాలా మాదిరిగా కాదు

అందరి బాబాలా మాదిరిగా కాదు

ఇక ఆశారాం కన్నా డేరా బాబా చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. డేరా సచ్చా సౌధా గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు ఉత్తర భారత దేశంలో ఎంతో మంది అభిమానులు ఉండేవారు. ఈయన అందరి బాబాలా మాదిరిగా కాదు. ఈయనలో ఓ రాక్‌స్టార్.. సినీ స్టార్‌ కూడా ఉన్నారు.

నీలి చిత్రాలు చూస్తూ

నీలి చిత్రాలు చూస్తూ

డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ బెడ్ రూమ్ లో పడుకుని మందు తాగుతూ, నీలి చిత్రాలు చూస్తూ.. స్కూల్ పిల్లలను కూడా రప్పించుకుని తన రాక్షస రాస క్రీడను సాగించేవాడు. బాబా డేరాలో ఎప్పుడూ 200 మంది అందమైన అమ్మాయిలు ఉండేవారు.

కృష్ణుడట

కృష్ణుడట

ఎప్పుడు ఎవరు నచ్చితే వాళ్లు రావాల్సిందే. తనను తాను కృష్ణుడని, వారంతా గోపికలని, దేవుడి కోరికలు తీర్చడమే మోక్షమని ఈ బాబా మాయమాటలు చెప్పేవాడు. తన సెక్స్ లైఫ్ కోసం ఓ బెడ్ రూమ్ డిజైన్ చేయించుకుని ఆనందించాడు.

కేవలం శృంగారమే

కేవలం శృంగారమే

డేరా బాబా మొత్తం వ్యవహారం అంతా కేవలం శృంగారమే. దాదాపు 270 మంది మహిళలను చెరచిన నీచుడు ఈ బాబా. రేపిస్టు బాబా రామ్ రహీమ్ సింగ్ అరాచకాలకు పరాకాష్టగా ఉండేవాడు. అతని డేరాల నిండా గర్భనిరోధక మాత్రలు, కండమ్‌లు దాడుల్లో దొరికాయంటే ఈయన ఎంత కామాంధుడో అర్థం చేసుకోవొచ్చు.

బాబా కామ దాహాన్ని తీర్చాలి

బాబా కామ దాహాన్ని తీర్చాలి

డేరా బాబా యువతులను లోబర్చుకోవడానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకునే వాడు. దాని ప్రకారమే యువతుల్ని అనుభవించేవాడు. కొత్తగా బాబా ఆశీర్వాదం కోసం వచ్చే యువతుల్లో ఎవరి పైన బాబా కన్ను పడుతుందో వారు బాబా కామ దాహాన్ని తీర్చాలి.

శృంగారం చేసేందుకు

శృంగారం చేసేందుకు

ఇక ఆ యువతికి ఓ వారం పాటు క్లాసులు తీసుకునే వారు డేరా బాబా దగ్గరున్న కొందరు యువతులు. ఆమెను బాబాతో శృంగారం చేసేందుకు మానసికంగా సిద్ధం చేసేవారు. ఈ శృంగారాన్ని పవిత్ర కార్యంగా చిత్రీకరించేవారు.

అత్యాచారం చేసేవాడు

అత్యాచారం చేసేవాడు

ఒకవేళ ఆమె అంగీకరించకపోతే మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు దోషం పట్టుకుంటుదనీ చెప్పేవారు. భయపించేవారు. దాంతో యువతి దారికి వస్తే ఇక డేరా బాబా అనుభవించేవాడు. ఒకవేళ మాట వినకపోతే ఆమెపై డేరా బాబా అత్యాచారం చేసేవాడు. ఇలా కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాలను డేరా బాబా నాశనం చేశాడు.

మోడరన్ మాత

మోడరన్ మాత

ఇక డేరా బాబా, ఆశారాం బాపూ తరహాలోనే రాధేమా లీలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. తనను తాను దైవాంశసంభూతురాలిగా రాధేమా చెప్పుకుంటుంది. ఈ మోడరన్ మాతపై ఎన్నో బెదిరింపులు, వరకట్న వేధింపుల కేసులు కూడా నమోదయ్యాయి.

ఆశ్రమానికి వెళ్తే

ఆశ్రమానికి వెళ్తే

ఇక పంజాబ్‌కు చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యుడు సురీందర్ మిట్టల్ రాధేమాపై ఫిర్యాదు కూడా చేశారు. తనను ప్రేమిస్తున్నానని అన్నారని, ఆమె మాటలను నమ్మి ఆశ్రమానికి వెళ్తే తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని సురీందర్ ఆ మధ్య చెప్పాడు. ఈ ఘటనపై అప్పట్లో సురీందర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆయన చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించారు.

సుఖ్వీందర్ కౌర్

సుఖ్వీందర్ కౌర్

రాధేమా అనే ఈవిడ.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ సాధారణ గృహిణి. రాధేమాగా మారి భక్తి ముసుగులో ముంబైలో విలాసవంతమైన ఆశ్రమం నడుపుతోంది. వందల కోట్ల రూపాయాల సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకుంది. అయితే రాధేమా ఎదుగుదల వెనుక పెద్ద కథే ఉంది. రాధేమా అసలు పేరు సుఖ్వీందర్ కౌర్. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డోరంగల గ్రామంలో రాధేమా జన్మించారు. నాలుగో తరగతి వరకు చదివిన సుఖ్వీందర్ చిన్నతనంలో ఎప్పుడూ గ్రామంలోని కాళీ మాత ఆలయంలోనే గడిపేది.

బట్టలు కుట్టేది

బట్టలు కుట్టేది

17 ఏళ్ల వయసులో ఆమో మోహన్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లాడారు. భర్త ఆదాయం చాలా తక్కువగా ఉండటంతో బట్టలు కుడుతూ సాయంగా ఉండేవారు. అయితే కొంతకాలానికి ఉద్యోగం కోసం ఆమె భర్త ఖతార్‌లోని దోహ వెళ్లిపోయారు.

రామ్ దీన్ దాస్ వద్ద శిష్యురాలిగా

రామ్ దీన్ దాస్ వద్ద శిష్యురాలిగా

ఆ తరవాత ఆధ్యాత్మికంవైపు మళ్లిన సుఖ్వీందర్.. 23 ఏళ్ల వయసులో మహంత్ రామ్ దీన్ దాస్ వద్ద శిష్యురాలుగా చేరారు. ఆయనే సుఖ్వీందర్ పేరును రాధేమాగా మార్చారు. తర్వాత ఆమె తన మకాంను ముంబైలోని బొరివాలికి మార్చారు. అక్కడ ఆమె అతిపెద్ద ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే 2015లో నిఖీ గుప్తా అనే వివాహిత వరకట్న వేధింపుల ఆరోపణలతో రాధేమా పేరు దేశవ్యాప్తంగా తెలిసింది.

నిత్యానంద, రంజిత రాసలీలలు

నిత్యానంద, రంజిత రాసలీలలు

ఇక ఆధ్యాత్మిక గురువు నిత్యానంద, నటి రంజిత రాసలీలలుగురించి కూడా అందరికీ తెలిసిందే. ఇక నిత్యానంద ధాన్య పీఠాధిపతి నిత్యానంద స్వామి ఆశ్రమంలో సేవకురాలిగా ఉన్న తనపై నిత్యానంద అత్యాచారానికి పాల్పడ్డారని ఒక బాలిక మైసూర్‌ సమీపం లోని రామ్‌నగర్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

రాసలీలలు సాగిస్తూ

రాసలీలలు సాగిస్తూ

ఇక ఐదేళ్ల పాటు తనపై శారీరక వేధింపులకు పాల్పడ్డాడని అమెరికాకు చెందిన మహిళ గతంలో ఫిర్యాదు చేయగా, అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సదానందగౌడ తీవ్రంగానే స్పందించారు. ఇలా నిత్యానంద కూడా పలుమార్లు రాసలీలల విషయంలో అప్పట్లో వార్తల్లో నిలిచారు.

సర్వనాశనం చేస్తున్నారు

సర్వనాశనం చేస్తున్నారు

డబ్బు, పొలిటికల్ పవర్, జనాల విశ్వాసాలు వంటి వాటిని అడ్డం పెట్టుకుని బాబాలు ఎందరో జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. ఇలాంటి బాబాలకు నాయకులు వెన్నుదన్నుగా వున్నంతవరకూ సమాజాన్ని సర్వనాశనం చేస్తూనే ఉంటారు. ఈ కామ బాబాలు ఇంకా వస్తూనే వుంటారు. వీరి మాటలు నమ్మకూడదు. వీరిని సమాజం నుంచి తరిమి తరిమి కొట్టాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  English summary

  from asaram to radhe maa top 4 controversial gurus of india

  from asaram to radhe maa top 4 controversial gurus of india
  Story first published: Thursday, April 26, 2018, 10:09 [IST]
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more