చైనాలో తాతను పెళ్ళిచేసుకున్న మనుమరాలు : మరి ఆ కథేంటి ?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

వెర్రి వెయ్యి విధాలు అని ఊరికే అనలేదు. ఒక్కోసారి అది వెర్రో, తెలివో కూడా అర్ధం కాని పరిస్థితులు ప్రజలకు నెలకొంటూ ఉంటాయి. అలాంటి వింత పరిస్థితికి వేదికైంది చైనా.

25 సంవత్సరాల వయసున్న యువతి 87 ఏళ్ళ వయసు ఉన్న తన తాతను పెళ్లి చేసుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేశాయి.

Grand Daughter Satisfies Her Grand Father Wish

వృద్దుడైన తన తాత , తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే జీవించలేడని భావించి, అతని పరిస్థితికి భయపడిన ఒక చైనా మహిళ, తన పెళ్లి భాద్యతను తానే తీసుకుని, తాతనే పెళ్లి చేసుకున్నట్లుగా “మాక్ ఫోటోగ్రాఫ్స్” (ఫేక్) కు పోజులిచ్చింది. ఈ ఫోటో షూట్ లో భాగంగా వధువు తెల్లని దుస్తులను ధరించగా, వరుడు 3 పీస్ సూట్ ధరించి ముచ్చటగా రెడీ అయ్యారు. మరి ఈ కథను కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఈ ఫోటో షూట్ లో భాగంగా

ఈ ఫోటో షూట్ లో భాగంగా

ఈ ఫోటో షూట్ లో భాగంగా "అతను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి" అని ఆమె చెప్పారు. "నేను ఇప్పుడు వివాహం చేసుకోవాలని ఏ ప్రణాళికలు లేవు. కానీ నా భవిష్యత్ లో నా పిల్లలు మరియు ప్రియమైన వారు అతని ముఖం గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను ". కావున నేను చేసింది తప్పు అని మాత్రం నేను ఎప్పటికీ అనుకోను, మరియు ఒకరి అసహనాలతో నాకు పని లేదు అని తెలిపింది.

Image courtesy

దక్షిణ చైనా లోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని

దక్షిణ చైనా లోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని

దక్షిణ చైనా లోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని అయిన చెంగ్డు లో "ఫు - క్షూవీ" నివసిస్తుంది. చిన్నతనంలో ప్రైమరీ స్కూల్ లో చదువుకుంటున్న వయసులో తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నాక, తనను పెంచడంలో కీలకపాత్ర పోషించిన తన గ్రాండ్ పేరెంట్స్ కు ఎంత చేసినా తక్కువే అంటుంది "ఫు".

Image Courtesy

ఈమద్యనే తన తాత “ఫు - కిక్వాన్” కు రెండు సార్లు గుండె పోటు

ఈమద్యనే తన తాత “ఫు - కిక్వాన్” కు రెండు సార్లు గుండె పోటు

ఈమద్యనే తన తాత "ఫు - కిక్వాన్" కు రెండు సార్లు గుండె పోటు వచ్చిన సందర్భంగా, ఇతనికి ఎక్కువ వైద్య సహాయం అవసరమని వైద్యులు తెలిపిన నేపధ్యంలో, అతని ఆరోగ్యం అతని సంతోషం నా భాద్యతగా మారాయి అని సెలవిచ్చింది "ఫు".

Image Courtesy

"గత సెప్టెంబర్ నుండి

"గత సెప్టెంబర్ నుండి అతను ఆసుపత్రికి తరచూ వెళ్ళాల్సిన అవసరం వచ్చేది," అని ఫూ ఆన్లైన్లో ప్రచురించిన ఒక వీడియోలో తెలిపారు". అన్ని రకాల మార్గాల్లో తన తాత సంతోషం కోసం నా ప్రేమను వ్యక్తం చేయాలని" భావిస్తున్నట్లు ఆమె తెలిపింది .

Image Courtesy

డిసెంబరులో జరిపిన ఫోటో చిత్రీకరణకు

డిసెంబరులో జరిపిన ఫోటో చిత్రీకరణకు

డిసెంబరులో జరిపిన ఫోటో చిత్రీకరణకు కేవలం కొన్ని వారాల ముందు ఆమె తన కుడి చేయి మీద తన తాత చిత్రపటాన్ని కలిగి ఉన్న టాటూను కూడా వేయించుకుంది. నిజానికి ఇన్క్ వర్క్ మాత్రమే జరిగింది. ఎక్కువ నొప్పిని భరించవలసి రావడం మూలంగా టాటూ ని వాయిదా వేయవలసి వచ్చింది. త్వరలో ఆ పనిని కూడా పూర్తి చేస్తాను అని " ఫు" తెలిపింది.

Image courtesy

ఫూ మరియు ఆమె తాత చిత్రాలకు

ఫూ మరియు ఆమె తాత చిత్రాలకు

ఫూ మరియు ఆమె తాత చిత్రాలకు సామాజిక మాధ్యమాలలో అత్యధిక స్పందనలు వచ్చాయి. ఆమె ఒరిజినల్ సోషల్ మీడియా పోస్ట్లకు 5,000 కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి కూడా.

Image Courtesy

ఫూ తన తాతతో ఒక మితమైన జీవితాన్ని గడిపినప్పటికీ,

ఫూ తన తాతతో ఒక మితమైన జీవితాన్ని గడిపినప్పటికీ,

ఫూ తన తాతతో ఒక మితమైన జీవితాన్ని గడిపినప్పటికీ, ఆమె వెన్నంటి ఉంటూ ప్రతి క్షణమూ తోడుగా నీడగా ఉన్నాడని, అటువంటి వ్యక్తికి ప్రాణమిచ్చినా తక్కువే అని భావిస్తుంది.

Image courtesy

"అతను నేను కోరిన ప్రతి వస్తువును,

"అతను నేను కోరిన ప్రతి వస్తువును, ప్రతి అంశాన్ని లేదు కాదు అనకుండా నాకు అందించాడు" . నా మనసులో అతనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అతను ఇక్కడ లేకపోతే జీవితాన్ని ఊహించలేను. " అని ఎంతో మదనపడుతుంది "ఫు".

Image Courtesy

వివాహ ఛాయా చిత్రాల గురించి

వివాహ ఛాయా చిత్రాల గురించి

వివాహ ఛాయా చిత్రాల గురించి అతను ఏమనుకుంటున్నారో అని అడిగినప్పుడు, ఫూ కిక్వాన్ ఇలా అన్నాడు: " ఆమె కోరుకుంది, ఆమె కోసం ఏమైనా చేస్తాను. ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు, అందుకే తన సంతోషం నా భాద్యత అయింది " అని తెలిపాడు.

Image Courtesy

English summary

Grand Daughter Satisfies Her Grand Father Wish

Grand Daughter Satisfies Her Grand Father Wish.వెర్రి వెయ్యి విధాలు అని ఊరికే అనలేదు. ఒక్కోసారి అది వెర్రో, తెలివో కూడా అర్ధం కాని పరిస్థితులు ప్రజలకు నెలకొంటూ ఉంటాయి. అలాంటి వింత పరిస్థితికి వేదికైంది చైనా.
Story first published: Thursday, May 10, 2018, 14:00 [IST]