Latest Updates
-
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.?
పదకొండు ఫోన్లను ఉపయోగించి పోకీమాన్ గో వీడియో గేమ్ ఆడే ఈ తాతగారిని చూడండి!
పదకొండు ఫోన్లను ఉపయోగించి పోకీమాన్ గో వీడియో గేమ్ ఆడే ఈ తాతగారిని చూడండి!
2016 లో ప్రపంచమంతటిని పోకీమాన్ గో వీడియో గేమ్ జ్వరం పట్టి కుదిపేసి ఒక చరిత్ర సృష్టించి ఉండవచ్చు. కానీ ఈ 70 ఏళ్ల తాతగారు మాత్రం తన ఉత్సాహంతో, పోకీమాన్ వెర్రిని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్ళాడు.
తన ద్విచక్ర వాహనంకి ఆరు మొబైల్ ఫోన్లు కనెక్ట్ చేసుకుని డ్రైవింగ్ చేస్తున్న ఈ తైవానీస్ ఫెంగ్ షుయ్ మాస్టర్ అయిన చెన్ సాన్-యువాన్ వీడియో బయట పడిన అనంతరం, అతనికి ఎక్కడలేని ప్రజాదరణ లభించింది.
మొబైల్ తెరల మీద పోకీమాన్ గో గేమ్ తో ఉన్న అతని వీడియోని, ఆన్లైన్ వేదిక అయిన రెడిట్ ఇటీవల పంచుకోవడం మనం చూడవచ్చు. అతనికి ఈ గేమ్ ను, అతని మనవడు పరిచయం చేసాడు. మరుక్షణం నుండి అతను ఈ ఆటకి దాసోహం అయిపోయాడు!

రెడిట్ లో "హార్డ్కోర్ పోకీమాన్ హంటర్ గ్రాండ్ పా" గా ప్రచురితమైన పోస్ట్ కు , ఇప్పటి వరకు 75,000 పైగా అప్ ఓట్స్ వచ్చాయి.
ఈ వీడియోలో చెన్,ఈ ఆట నిమిత్తం ప్రతి నెల $ 10,000 పైగా ఖర్చు చేస్తానని వెల్లడించారు!
అతను తనతో పాటు చాలా పవర్ బ్యాంకులను తీసుకువెళతాడు. అంతేకాకుండా, వాటిని ఉపయోగిస్తూ అతను తన మొబైల్ ఫోన్లను, 20 గంటలకు పైగా ఏకధాటిగా పనిచేసేలా ఛార్జ్ చేసుకుంటాడు.
చెన్ తన వద్ద ఉన్న తొమ్మిది మొబైల్ ఫోన్లను బైక్ చుట్టూ కట్టి ఉంచగా, ఆటలో అతను తరువాత స్థాయిలకు చేరి అనుమతి లభించగానే వాడటానికి మరొక రెండు ఫోన్లకు సంసిద్ధం చేసుకున్నట్టు తెలిపారు.
అతను ఈ గేమ్ ఆడుతూ, వీధుల వెంట కొత్త పోకీమాన్ లను పట్టుకోవడానికి బైక్ పై ఎలా ఉరుకుతున్నాడో ఈ ఇంటర్వ్యూలో చూడండి!
ఇది వేలంవెర్రి అని మీకు అనిపిస్తుందా? దిగువ కామెంట్ విభాగం ద్వారా, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.
మరింత ఉత్తేజకరమైన వీడియోల కోసం, ఈ విభాగాన్ని తరచూ సందర్శించండి.



Click it and Unblock the Notifications
