మీలో రసికతను బయటపెట్టే మీ పెదవుల ఆకారం

Subscribe to Boldsky

మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో మన శారీరక లక్షణాలు దోహదపడతాయని అంటారు. అంతేకాకుండా, అవి మీలో ఉండే ఆత్మవిశ్వాసంను కూడా నిర్ధారిస్తాయి.

మానసిక నిపుణుల అధ్యయనం ప్రకారం, మీ పెదవుల ఆకారం, మీ వ్యక్తిత్వాన్ని గురించి చాలా విషయాలు చెప్తుందని అంటారు. అంతేకాక మీలో రసికతను కూడా మీ పెదవుల ఆకారం బయటపెడుతుంది. అయితే మీకు ఈ విషయం గురించి తెలిసి ఉండకపోవచ్చు.

ఇప్పుడు మీకోసం ఈ కధనంలో, మానసిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, వివిధ ఆకారాలు కలిగి ఉన్న పెదవులు, వ్యక్తిత్వం గురించి వెల్లడించే ఖచ్చితమైన మరియు ఆసక్తికరమైన వాస్తవాలేమిటో, తెలుసుకుందాం!

ఇంకెందుకు ఆలస్యం, చదవండి మరి!

విల్లు వంటి పెదవులు:

విల్లు వంటి పెదవులు:

విల్లు వంటి పెదవులు కలిగినవారు, పదునైన మేధస్సు , ఏకాగ్రత మరియు సునిశిత దృష్టి కలిగి ఉంటారని అంటారు. వీరు అకుంఠిత దీక్షతో తమ కలలను సాకారం చేసుకోవడానికి, లక్ష్యాలను నిర్ధారించుకుని ప్రయాణం చేస్తారు. వీరిలో శృంగారం విషయానికి వస్తే, వీరికి తమపై తమకు విశ్వాసం ఎక్కువ అంతేకాకుండా తమ సమర్ధతపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, వారు అనుబంధం విషయంలో తమ భాగస్వామిని కూడా సవాలు చేస్తారు. వీరి భాగస్వామి రసికతతో వీరిని మెప్పించలేకపోతే, తమలోని రసికతను బయటపెట్టరు.

క్రిందికి ఒంపు తిరిగిన పెదవులు:

క్రిందికి ఒంపు తిరిగిన పెదవులు:

క్రిందికి ఒంపు తిరిగిన పెదవులు కలిగివున్న వారు ఏ విషయాన్నైనా నిశితంగా పరిశీలిస్తారు. ఈ వ్యక్తులలో కలుపుగోలుతనం తక్కువ పైగా అనవసరంగా మాట్లాడరు. వీరిలోని రసికత అంతా వారి అంతుబట్టకుండా ఉండే వ్యక్తిత్వంలొనే ఉంటుంది. వారి భాగస్వామిలో అనుక్షణం, మరుక్షణం ఏమి జరుగుతుందో అని ఆరటపడేట్టు చేస్తారు.లైంగికపరంగా అయినా లేదా మేధోపరంగా అయినా, వీరు తమ భాగస్వామి యొక్క అవసరాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.

నిండైన పెదవులు:

నిండైన పెదవులు:

నిండైన పెదవులు కలిగినవారు అనుబంధం విషయంలో కూడా సమరూపత కలిగి ఉంటారు.

ఈ వ్యక్తులు సహజంగానే చాలా ఆకర్షణీయంగా ఉంటారు, అంతేకాక ఈ విషయం గురించి వారికి పూర్తి అవగాహన ఉంది. వీరిలో రసికత ఏ మేరకు ఉండు వారికి బాగా తెలుసు. వీరిలో ఆ కోణాన్ని బయట పెట్టడానికి వీరి భాగస్వామికి అదనపు ధ్యాస అవసరం. అలా చేస్తేనే వారిలోని చిలిపితనం సులభంగా బయటపడుతుంది.

హృదయాకార పెదవులు:

హృదయాకార పెదవులు:

వారి పెదవుల ఆకారమే,సహజంగా వారెంత రాసికులో తెలియజేస్తాయి. ఈ వ్యక్తులు మృదుస్వభావంతో అందంగా ఉంటారు. అదే సమయంలో, వీరు తుంటరితనంతో పాటుగా శృంగార వాంఛ కలిగినవారై ఉంటారు. వారిని రెచ్చగొట్టగలిగితే కనుక, జీవితంలో మరువలేని అనుభవం మీ సొంతమవుతుంది. వారిలో అంతటి సమ్మోహన శక్తి ఉంటుంది.

పైపెదవి మాత్రమే నిండుగా ఉన్నవారు:

పైపెదవి మాత్రమే నిండుగా ఉన్నవారు:

మన శరీరంలో పై పెదవులు అత్యంత శృంగార స్పందన కలిగిన భాగాలని అంటారు ఎందుకంటే, ఎవరినైనా చుంబించేటప్పుడు, దృష్టాంతా వారి పై పెదవులపై నిలిచి ఉంటుందట! ఇటువంటి పెదవులు కలిగిఉన్నవారు, తమ దేహం ఏ తీరుగా ఉన్నా ఆమోదిస్తారు పైగా వారి పై పెదవులు ఒలకబోసే శృంగార రసం గురించి ఎరిగి ఉంటారు.

గుండ్రని పెదవులు:

గుండ్రని పెదవులు:

గుండ్రని పెదవులు కలిగినవారు బహుముఖ ప్రజ్ఞావంతులు మరియు వారు శారీరకంగా మరియు మానసికంగా చురుకుగా ఉంటారు.వీరు నైపుణ్యాత్మకత, సృజనాత్మకత మరియు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవారు. ఇది చాలా అరుదుగా ఉండే సమ్మేళనం. వారి వ్యక్తిత్వంలోనే రసికత పొంగిపొర్లుతుంది. వీరు అంత సులువుగా మాయమాటలకు పడిపోరు కానీ ఒక్కసారి నమ్మితే,వారి భాగస్వామితో లోతైన అనుబంధం ఏర్పరచుకుంటారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How Does The Shape Of Your Lips Define Your Sensuality

    According to psychological revelations one can find out the sensuality of a person by just looking at the shape of their lips and it is so accurate. These predictions are made by the experts and they reveal the naive and sensual side of the individual. For Eg:It is said that our physical attributes contribute a lot in terms of analysing our personalities.
    Story first published: Thursday, May 24, 2018, 16:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more