Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
మీ భార్య అలా చేస్తే మీకు అన్నీ నష్టాలే, రాత్రి జుట్టు ఆరబోసుకుని పడుకుందంటే అరిష్టం, అలా చేయకూడదు
ఆడవారు మధ్య పాపిడి తీసి సింధూరం పెట్టుకోవాలి. అలా కాదని పక్క పాపిడి తీసి అక్కడ సింధూరం పెడితే, భార్యా భర్తలు మద్య గొడవలు ఎక్కువగా అవుతాయి.మీ భార్య అలా చేస్తే మీకు అన్నీ నష్టాలే.
మన హిందూ సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తల బందం ఎంతో పవిత్రమైనది. ఎన్నో వేదమంత్రాల సాక్షిగా, పెద్దల సమక్షంలో పెళ్లి చేసి ఇద్దరినీ ఏకం చేస్తారు. అలా వారిద్దరూ కలసి ఆనందంగా జీవించాలని పెద్దలు కోరుకుంటారు.
అయితే పెళ్లి అయిన స్త్రీ కొన్ని నియమాలను పాటించాలి. అందులో ముఖ్యమైనది సిందూరం. పెళ్లి అయిన ఆడవారు నుదిటిన సింధూరం పెట్టుకోవాలి. సింధూరం పెట్టుకోవడం వలన, భర్త దీర్గాయుశ్శుతో ఉంటారు. అలానే కొన్ని చిన్న చిన్న తప్పులు వలన భర్తకు కష్టాలు కూడా మొదలవుతాయి.

మీ భార్య చేసే కొన్ని పనుల వల్ల
మీరు చేసే కొన్ని తప్పులే మిమ్మల్ని పేదరికంలో కి నెడతాయని అధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మీరు, మీ ఇంట్లో వారి మీప్రవర్తనే మీకష్టాలకు కారణమవుతుందనేది కొందరు ఆధ్యాత్మిక నిపుణుల వాదన. మరీ ముఖ్యంగా మీ ఇంట్లోని ఆడవాళ్లు తెలిసో, తెలియకనో చేసిన తప్పులతో లక్ష్మి దేవి మీ ఇంటికి రాకుండా చేస్తాయట. మీ భార్య చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంటికి సంపద రాదు.

పాలు, పెరుగు అడిగితే
అయితే ఎటువంటి పనులు చేస్తే లక్ష్మి దేవి ఇంట్లోకి వస్తుంది అనేది తెలుసుకుందాం. సాయంత్రం పూట అంటే సంధ్యా సమయంలో ఎవరైనా ఇంటికి వచ్చి పాలు, పెరుగు అడిగితే ఇవ్వకూడదట. పాలు, పెరుగు లక్ష్మి దేవి కి ప్రతీకలట. అందుకే ఇవి అడిగిన వారికి ఇవ్వడం వల్ల మీ ఇంట్లోని లక్ష్మి దేవిని మీరే స్వయంగా బయటకు పంపినవారవుతారని హెచ్చరిస్తున్నారు.

వంట పాత్రల్ని, స్టవ్ ను శుభ్రపరచి
వంటింట్లో ఉండేది అన్నపూర్ణాదేవి.. అంటే లక్ష్మీ దేవి స్వరూపమే. కాబట్టి రాత్రిపూట నిద్రించే ముందు వంట పాత్రల్ని, స్టవ్ ను శుభ్రపరచి పడుకోవాలట. ఇలా చేయకపోతే ఆర్థిక కష్టాలను కొని తెచ్చుకున్నట్లేనట. లక్ష్మీ దేవి అలిగి ఇంట్లోనుంచి బయటకి వెళ్ళిపోతుందట. అలాగే చాలా మంది స్త్రీలు జుట్టు విరబోసుకొని నిద్రిస్తుంటారు.

ఉప్పు అంటే లక్ష్మి దేవికి ఇష్టం
ఇలా చేయడం రాక్షసుల జాతి లక్షణమని పురాణాలు వక్కాణిస్తున్నాయి. ఇటువంటి చర్యలు లక్ష్మీ దేవికి ఇష్టముండదట. ఆమెకు కోపం వస్తుందట. ఉప్పు అంటే ఆ సిరుల తల్లి లక్ష్మి దేవికి ఇష్టం. కనుక ఉప్పును పేపర్ లలో చుట్టి రాత్రి మీరు ఉన్న ఇంట్లోని ప్రతి రూం లో ఉంచాలట.

నెగెటివ్ ఎనర్జీ బయటకు
ఉదయం లేవగానే ఆ ఇంటి స్త్రీ ఎవరితో మాట్లాడకుండా వాటిని తీసి బయట పడేయాలట. ఇలా చేయడం వలన నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుందని పండితుల ఉవాచ. దీంతో లక్ష్మి దేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందట. ఇంట్లో అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. వేరే ఏ దిక్కున ఉండకూడదు. అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది.

తల దగ్గర నీరు
నిద్రపోయేటప్పుడు కొంతమంది తల దగ్గర నీటిని పెట్టుకుంటారు. నిద్ర లేచి తాగుదామని.. కానీ అలా చేయకూడదు. నీళ్ళ దప్పిక వస్తే పైకి లేచి వెళ్ళి తాగాలి. ఇలా చేస్తే ధనప్రాప్తి ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే వివాహము నందు తప్ప జీవితంలో ఎప్పుడు భార్యతో కలసి భర్త భుజించరాదు అని అంటారు. అలాగే పిల్లలకు, వృద్దులకు పెట్టకుండా ముందే తినరాదు. కాళ్ళు చాపి భోజనం చేయుట దోషం.

సింధూరం పెట్టుకోవాలి
ఆడవారు మధ్య పాపిడి తీసి సింధూరం పెట్టుకోవాలి. అలా కాదని పక్క పాపిడి తీసి అక్కడ సింధూరం పెడితే, భార్యా భర్తలు మద్య గొడవలు ఎక్కువగా అవుతాయి. అంతే కాకుండా, కొందరు అసలు పాపిడి తీయకుండా, సింధూరం పెడతారు. అలా పెట్టడం వలన భర్తకు ఏ దారి దొరక్క నానా కష్టాలు పడతారు. సింధూరం సరిగ్గా పెట్టుకోకపోతే, భర్త అనేక ఆర్ధిక ఇబ్బందులు కూడా చవి చూస్తాడు. అందుకని మద్య పాపిడి తీసి, చక్కగా సింధూరం పెట్టుకుని... సౌభాగ్యంగా వర్ధిల్లండి.



Click it and Unblock the Notifications