మీ ముఖం పై ఉన్న పుట్టు మచ్చలు మీ వ్యకిత్వం గురించి ఏమి చెబుతాయో తెలుసా ?

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ముఖం పై ఉన్న వివిధ ప్రాంతంలో ఉన్న పుట్టుమచ్చలు విభిన్న రకాల అర్ధాలను మరియు జోస్యాన్ని చెబుతాయి. విభిన్న రకాల ప్రాంతాల్లో ఉన్న పుట్టుమచ్చలకు, విభిన్న రకాల అర్ధాలు ఉంటాయి.

ప్రతి పుట్టుమచ్చ వెనుక ఒక దాగి ఉన్న అర్ధం ఉంటుంది. ఇప్పుడు మనం ముఖం పై ఉన్న పుట్టుమచ్చల యొక్క విశిష్టత గురించి, అవి పంచే జ్ఞానం మరియు అవి తెలిపే నిగూడ అర్ధాల గురించి తెలుసుకోబోతున్నాం.

ముఖం పై 25 విభిన్న ప్రాంతాలను ఎంచుకొని అక్కడ గనుక పుట్టు మచ్చలు ఉంటే అసలు అర్ధం ఏమిటి అనే విషయం వివరించడం జరిగింది.

Face Moles Reveal A Lot About Your Personality

మీ ముఖం పై వివిధ ప్రాంతాల్లో పుట్టుమచ్చలు గనుక ఉంటే, అవి ఏమి తెలియజేస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

1 నుండి 3 స్థానాల మధ్య పుట్టుమచ్చలు ఉంటే, అప్పుడు :

1 నుండి 3 స్థానాల మధ్య పుట్టుమచ్చలు ఉంటే, అప్పుడు :

ఈ ప్రాంతంలో గనుక పుట్టుమచ్చలు ఉంటే, మీరు తిరుగుబాటు దారులుగా ఉంటారు మరియు ప్రశాంతమైన మనస్సుని కలిగి ఉంటారు. వీరు ఎంతో సృజనాత్మకంగా వ్యవహరిస్తారు మరియు వారిని వదిలేస్తేనే వారు చేసే పనుల్లో ఉత్తమైన ప్రదర్శనను కనపరుస్తారు. వీరు వీరికే యజమానిగా ఉండటానికి ఇష్టపడతారు మరియు మీ అదృష్టం ప్రకారం ఎన్నో అవకాశాలు మీకు మీరే యజమిగా ఉండటానికి సహకరిస్తాయి.

పుట్టుమచ్చ గనుక 4 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 4 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఒక వ్యక్తిగా మీరు ప్రేరణ ఇచ్చే విధంగా ఉండి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మరో వైపు మీ యొక్క అభిప్రాయాన్ని ఇతరులు గనుక అర్ధం చేసుకోకపోతే, వాదించే స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ, మీరు ఎప్పుడు గాని ఇతరుల పై ద్వేషాన్ని, పగలని పెంచుకోరు. ఇవే కాకుండా ఈ పుట్టుమచ్చ వల్ల మీలో విపరీతమైన ఉప్పెనలా కోపం పొంగే స్వభావం ఉంటుంది. కాబట్టి మీరు అన్ని విషయాల్లో మంచిగా సాగాలంటే ఆ కోపాన్ని మీ నుండి తీసివేయాలని నిశ్చయించుకోవాలి.

మీకు గనుక పుట్టుమచ్చ 5 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

మీకు గనుక పుట్టుమచ్చ 5 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

మీకు పుట్టుమచ్చ ఈ స్థానంలో గనుక ఉంటే, అటువంటి సమయంలో మీ జీవితంలోకి ధన అదృష్టం బాగా ఉంటుంది. కానీ, నిజం ఏమిటంటే అది మీరు సంపాదించాలంటే సాధారణ ప్రజల కంటే కూడా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మరో వైపు ఆర్ధిక సంబంధమైన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, చాలా మంది వ్యక్తులు మీ దగ్గర నుండి ఎదో ప్రయోజనం ఆశించి మీ డబ్బుకోసం మిమ్మల్ని అనుకూలంగా మార్చుకొని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పుట్టుమచ్చ 6 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ 6 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

మీకు గనుక పుట్టుమచ్చ ఈ స్థానంలో ఉంటే, ఒక కళాకారుడికి ఉండాల్సిన సృజనాత్మకత, నైపుణ్యాలు మరియు తెలివి మీలో ఉంటాయి. మీలో ఉన్న ఈ కళాత్మక రూపం, మీకు ఎంతో డబ్బుని విజాలని మరియు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తాయి. మరోవైపు మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో అటువంటి సమయంలోనే మీకు విజయాలు లభిస్తాయి.

పుట్టుమచ్చ గనుక 7 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 7 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక ఈ స్థానంలో ఉంటే, మీకు దురదృష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో లేదా దూరపు చుట్టాలతో విపరీతమైన వాదనల వల్ల మీకు దుఃఖం మరియు విచారం ఎక్కువ అవుతాయి. మీ యొక్క జీవన స్థితిగతులు మరియు చేసే పనిపై కూడా ఈ పుట్టుమచ్చ ప్రభావం చూపుతుంది.

పుట్టుమచ్చ గనుక 8 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 8 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఎలా అయితే 7 వ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే, అదృష్టం అంతగా కలిసిరాదో, అలాగే 8 వ స్థానంలో కూడా పుట్టుమచ్చ ఉంటే, ఇంచుమించు అలాంటి పరిస్థితులే తలెత్తుతాయి. ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్నవారికి ఎప్పుడూ ఆర్ధిక స్థితిగతుల వల్ల విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, వీరు ఎక్కువగా ఖర్చు పెట్టేవారై ఉంటారు. మరోవైపు ఈ స్థానంలో పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు, లింగభేదం లేకుండా అటు స్త్రీలు, ఇటు పురుషులిద్దరితో సరసమాడటానికి ఆసక్తిని చూపిస్తారు.

పుట్టుమచ్చ గనుక 9 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 9 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్నవారికి ముఖ్యంగా శృంగారపరమైన జీవితంలో విపరీతమైన దురదృష్టం ఉంటుంది. ఈ స్థానం లో పుట్టుమచ్చ ఉన్నవారు వీలైనంత త్వరగా ఆ పుట్టుమచ్చను తీసివేయడం మంచిది. ఎందుకంటే, ఇది విపరీతమైన దురదృష్టాన్ని మరియు సమస్యలను తెచ్చిపెడుతుంది.

పుట్టుమచ్చ గనుక 10 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 10 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్నవారికి అద్భుతమైన వారసత్వ అదృష్టం కలుగుతుంది. మీకు ఎప్పుడూ మీ కుటుంబం యొక్క ఆశీస్సులు ఉంటాయి మరియు మీకు ఎంతోమంది పిల్లలు మరియు ముని మనవళ్ళు ఉంటారు.

పుట్టుమచ్చ గనుక 11 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 11 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్నవారు తరచూ అనారోగ్యం భారిన పడుతుంటారు. కాబట్టి వీలైనంత త్వరగా ఆ పుట్టుమచ్చను తీసివేయండి. ఎందుకంటే, అది మీకు దురదృష్టాన్ని కలిగిస్తుంది.

పుట్టుమచ్చ గనుక 12 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 12 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే, అటువంటి వారు ఎన్నో విజయాలను సాధిస్తారు మరియు వ్యక్తిగతంగా సమతుల్యమైన జీవితాన్ని గడుపుతారు. ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఎంతో విజయవంతులుగా ఎన్నో విజయాలను సాధించడమే కాకుండా, జీవితంలో ఎంతో ప్రసిద్ధి చెందుతారు, కీర్తిని గడిస్తారు.

పుట్టుమచ్చ గనుక 13 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 13 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉండి మీకు గనుక పిల్లలు గనుక ఉంటే, దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ పుట్టుమచ్చ వల్ల మీలో సహన గుణం అంతగా ఉండదు. అందుచేత మీరు చేయాల్సింది ఏమిటంటే, మీలో సహనాన్ని బాగా పెంచుకోవాల్సి ఉంది.

పుట్టుమచ్చ గనుక 14 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 14 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్న వారు తిండి వైపు విపరీతమైన ఆకర్షణ కలిగి ఉంటారు మరియు అది మీకు హానికరంగా మారవచ్చు. దీనివల్ల వీరికి వీరి జీవితంలో పెద్ద సమస్యలు ఎదురుకావచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల ఆహారాలు వీరికి అస్సలు పడకుండా పోతాయి.

పుట్టుమచ్చ గనుక 15 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 15 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టుమచ్చ గనుక ఉంటే, మీకు కొత్త విషయాలు తెలుసుకోవడానికి మరియు కొత్త పరిసరాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఒంటరిగా ఉండటాన్ని విపరీతంగా ద్వేషిస్తారు మరియు ప్రయాణించడాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు.

పుట్టుమచ్చ గనుక 16 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 16 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్నవారు, శృంగారాన్ని మరియు ప్రేమని ఎక్కువగా ఇష్టపడతారు మరియు ఆనందిస్తారు. కొన్ని సందర్భాల్లో ఒకరితో కంటే, ఎక్కువమందితో చేయడానికి ఇష్టపడతారు. మీకు గనుక బరువుకు సంబంధించిన సమస్య ఉంటే, తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు.

పుట్టుమచ్చ గనుక 17 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 17 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్నవారు, సామజిక అంశాల్లో ఎంతో ఉత్సహంగా పాలుపంచుకుంటారు మరియు ఒక వ్యక్తిగా అద్భుతమైన మాటకారితనాన్ని ప్రదర్శిస్తారు. మరోవైపు మీరు సాధించిన విజయాలు మీకు తలపొగరుని పెంచుతాయి. అది మీ పతనానికి దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి !

పుట్టుమచ్చ గనుక 18 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 18 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్నవారు, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, మీరు ఆరోగ్యం మరియు డబ్బుకు సంబంధించిన లాభాలు గురించి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, మీరు వీటి వల్ల సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి.

పుట్టుమచ్చ గనుక 19 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 19 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే, మీకు ధన అదృష్టం అధికంగా ఉంటుంది మరియు మంచి స్నేహితులను పొందగలరు. ఇది ఒక అదృష్ట ఆకర్షణగా మీకు ఉపయోగపడుతుంది. మరో వైపు, మీ యొక్క వ్యతిరేక లింగం వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు బలహీనం అయిపోతుంటారు.

పుట్టుమచ్చ గనుక 20 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 20 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో గనుక పుట్టుమచ్చ ఉంటే, అటువంటివారికి అదృష్టం లేదా దురదృష్టం రావొచ్చు. ఇటువంటి వ్యక్తులకు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది లేదా అపకీర్తిని మూటగట్టుకుంటారు. మీలో ఉన్న నైపుణ్యం మీకు అదృష్టం లేదా దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఎంతో సృజనాత్మకంగా మరియు విభిన్నంగా ఆలోచించగలరు మరియు అత్యన్నత మేధస్సు కలిగి తెలివి గలవారై ఉంటారు.

 పుట్టుమచ్చ గనుక 21 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 21 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో గనుక పుట్టుమచ్చ ఉంటే, మీకు మంచి ఆరోగ్యం మరియు అదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా, ఈ పుట్టుమచ్చ మీకు పేరు ప్రఖ్యాతలు మరియు గుర్తింపుని తీసుకువస్తుంది.

పుట్టుమచ్చ గనుక 22వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 22వ స్థానంలో ఉంటే, అప్పుడు :

కనుబొమ్మల చివర గనుక పుట్టుమచ్చలు ఉంటే, అటువంటి వ్యక్తులు అధికారం మరియు శక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. వ్యాపారరంగంలో వీరు ఎంతో ఉన్నత స్థితికి చేరుతారు. మరో వైపు జీవితం కూడా ఎంతో ఆనందమయంగా ఉంటుంది మరియు పనులు అన్ని వీరు అనుకున్నట్లే చాలా సజావుగా జరుగుతుంటాయి.

పుట్టుమచ్చ గనుక 23 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 23 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో గనుక పుట్టుమచ్చ ఉంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనుగడ సాగించే స్వభావం విపరీతంగా వృద్ధి చెంది ఉంటుంది మరియు అర్ధవంతమైన జీవితాన్ని దీర్ఘకాలం పాటు గడుపుతారు. మరోవైపు మరీ ముసలి వయస్సు వచ్చేవరకు కూడా మీరు ఎంతో ఉత్సాహంగా ఉంటారు.

పుట్టుమచ్చ గనుక 24 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 24 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే, అటువంటి వారికీ పేరు ప్రఖ్యాతలు మరియు అదృష్టం కలసి వస్తాయి. ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్నవారికి ముసలి వయస్సులో జీవితం కొద్దిగా కష్టతరంగా మారుతుంది.

పుట్టుమచ్చ గనుక 25 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

పుట్టుమచ్చ గనుక 25 వ స్థానంలో ఉంటే, అప్పుడు :

ఈ స్థానంలో పుట్టమచ్చ ఉంటే, అటువంటి వారు మంచి అదృష్టాన్ని మరియు శ్రేయస్సుని పొందుతారు. కానీ, అదే సమయంలో వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ యొక్క వైఖరిని సంప్రదాయబద్ధంగా ఉండేలా చేసుకున్నట్లైతే అది మీ జీవితానికి ఉత్తమంగా ఉంటుంది.

English summary

Face Moles Reveal A Lot About Your Personality

Do you know that moles on different parts of your face reveal a lot about your personality? Reading moles on the face is an old science. Moles on different parts of the face reveal whether you are lucky or unlucky. A mole on your chin will bring in good prosperity and good luck, while a mole below your right nostril can reveal about the food allergies that you have!
Story first published: Wednesday, February 28, 2018, 14:00 [IST]