For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేకువజామున 3 గంటల సమయం, దెయ్యాల సమయంగా ఎందుకు భావిస్తున్నారో తెలుసుకుందామా..!

|

వేకువజామున 3 గంటల సమయం, దెయ్యాల సమయంగా భావిస్తుంటారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? నరకాన్ని నడిపించే దుష్ట శక్తులు, మరియు ఆత్మలు ఈ సమయంలో అత్యంత చురుకుగా ఉంటాయని విశ్వసిస్తుంటారు.

ఇక్కడ ఈ వ్యాసంలో, వేకువ జామున 3 గంటల వ్యవధిని, ఎందుకు డెవిల్స్ అవర్(దెయ్యాల సమయం) గా పిలుస్తున్నారో తెలియజేసే విషయాల గురించిన అవగాహన కోసం ఈవివరాలను తెలియజేస్తున్నాము.

 Is 3 am Dream The Devil’s Hour?
 టైమింగ్!

టైమింగ్!

ఉదయం 3 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు దెయ్యాలు క్రియాశీలంగా ఉంటాయని, మరియు ముఖ్యంగా 3 గంటల సమయంలో వాటి కార్యకలాపాలు అత్యధికంగా ఉంటాయని విశ్వసిస్తుంటారు.

ఇది కొన్ని మత విశ్వాసాల ప్రకారం, ఒక దురదృష్టకరమైన సమయంగా కూడా పరిగణించబడుతుంది

అసలు వేకువజామున 3 గంటల సమయం, దెయ్యాల సమయంగా ఎందుకు భావిస్తున్నారో తెలుసుకుందామా..!

అసలు వేకువజామున 3 గంటల సమయం, దెయ్యాల సమయంగా ఎందుకు భావిస్తున్నారో తెలుసుకుందామా..!

క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం, వేకువజామున ఉదయం 3 గంటలకు యేసు క్రీస్తు శిలువ వేయబడ్డాడని నమ్ముతారు. క్రమంగా దేవుని సమయంగా కూడా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, రాత్రి 12 గంటల తర్వాత, ముఖ్యంగా ఉదయం 3 గంటలకు, దెయ్యాల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని నమ్ముతారు. ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం రాక్షసులు మద్యాహ్నం 3 గంటలకు బలహీనమైనవారిగా ఉంటారు, మరియు వేకువజామున 3గంటలకు తిరిగి బలంగా ఉంటారని భావిస్తారు.

ఆచారాలు:

ఆచారాలు:

నిర్దిష్టమైన కొన్ని మత విశ్వాసాల ప్రకారం, ఉదయం 3 గంటలకు కొన్ని దైవ మార్గాలను పాటించడానికి మరియు త్యాగాల సమమయంగా నమ్మబడింది. మిగిలిన అన్ని సమయాలకన్నా శక్తివంతమైన సమయంగా ఉన్నది

సినిమాలే సగం భయాన్ని పెంచుతున్నాయి:

సినిమాలే సగం భయాన్ని పెంచుతున్నాయి:

ఈమధ్య వస్తున్న అనేక హారర్ సినిమాల్లో కూడా వేకువజామున 3 సమయం అత్యంత కీలకంగా చూపించడం జరుగుతూ ఉంది. 'ది కంజూరింగ్', లేదా 'ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్' వంటి సినిమాలలో, వేకువజామున ఉదయం 3గంటలకు గడియారాన్ని ప్రదర్శించడం లేదా ప్రతి రోజు 3గంటలకు ఎమిలీ, ఒక వింతైన వాసనను అనుసరిస్తూ నిద్ర లేచేలా ప్రదర్శిoచబడుతుంది కూడా.

ఏదేమైనా, అసలైన వాస్తవం ఇదే:

ఏదేమైనా, అసలైన వాస్తవం ఇదే:

అయితే, వాస్తవిక జీవితంలో, పైన తెలిపిన వాదనలకు మద్దతునివ్వడానికి ఎటువంటి శాస్త్రీయ సిద్ధాంతం లేదు.

విజ్ఞాన శాస్త్రం ప్రకారం, ఈ రాత్రి సమయంలో అనేకమంది ఆర్.ఈ.ఎం (రాపిడ్ ఐ మూవ్మెంట్) చక్రంలో ఉంటారు. శాస్త్రీయంగా, మన శరీరంలో హృదయ స్పందనలు, ఒత్తిడి లేదా పల్స్ రేటుకు సంబంధించిన అంశాలు తాత్కాలిక విశ్రాంతికి లోనవుతూ ఉంటాయి. క్రమంగా కొన్ని జీవక్రియలకు ఆటంకం ఏర్పడి, ఆక్సిజన్ స్థాయిలు సరిగ్గా లేక పీడకలలు రావడం. ఆ సమయంలో హఠాత్తుగా నిద్ర నుండి లేచిన ఎడల, కొంచెం గందరగోళానికి గురవడం జరుగుతుంది.

ఒక్కోసారి అర్ధరాత్రి సమయాల్లో కొందరు చెత్తను తగలేయడం, లేదా చలి కాచుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించడం చేస్తుంటారు, ఈ మద్య ఎటు తిరిగీ రోజంతా తగలేసే డంపింగ్ యార్డులు ప్రతి ఊరులోనూ ఉంటున్నాయి. క్రమంగా ఈ అంశాలన్నీ శ్వాస సంబంధిత సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారుతున్నాయి, ముఖ్యంగా రాత్రి వేళల్లో 3-4 మద్య సమయాల్లో జీవక్రియలు కొన్ని నెమ్మదించడం మూలంగా మరియు కాలుష్యం మూలంగా కానీ, శ్వాస సరిగ్గా ఆడక ఊపిరి సలపని పీడకలలకు లోనవడం జరుగుతుంటుంది(మా దృష్టికి వచ్చిన ఒక విషయం ప్రకారం). అవి ఆత్మల కారణంగా అనడం తెలివితక్కువతనమే అవుతుంది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి, ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Is 3 am Dream The Devil’s Hour?

We all often tend to wake up in the night and we feel all confused, sweaty and jittery. The odd thing about the whole situation is about the timing. If the schedule is around 3 am, it can send our mind into a tizzy! However, do you know that 3 am is also known as the Devil's hour?
Story first published: Wednesday, July 18, 2018, 18:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more