ఆ తొమ్మిది చోట్ల కలి పురుషుడు ఉంటాడు.. వాటిపై మోజు పడితే కలి జీవితం నాశనం చేస్తాడు

Written By:
Subscribe to Boldsky

ఇప్పుడంతా కలియుగం.. అందుకే అలా జరిగింది.. అంటూ చాలా మంది నిట్టూర్చుతుంటారు. ప్రస్తుతం ఈర్ష్యాసూయలు, లంచగొండితనం, దుర్వ్యసనాలుఉన్నవాళ్లే మంచివాళ్లుగా గొప్పవాళ్లుగా పేరుపొందుతుంటారు. నమ్మకంగా ఉండి, ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు ఎవరూ కూడా ఈ సమాజంలో బతకలేరు. అలాంటి వారిని తొక్కి చంపేస్తారు ఈ జనం.

కుక్క చావు చస్తారు

కుక్క చావు చస్తారు

మనుషులు ముందు ఒకటి.. మనిషి పక్కకు వెళ్లగానే మరొకటి చెప్పే వాళ్లనే జనాలు ఎక్కువగా నమ్ముతారు. మనుషులు ముందు నటించగలిగే వారినే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే కలియుగంలో ఇలాంటి వారి ఆగడాలు కొనసాగిన వారి పాపం పండినప్పుడు కుక్క చావు చస్తారనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి.

మోసం చేసి పైకి ఎదిగే గుణం

మోసం చేసి పైకి ఎదిగే గుణం

నిజానికి మనిషి తన స్వభావ సిద్ధంగా ధర్మబద్ధంగా, ఎవరికీ హాని చేయకుండా నడవాలనే అనుకుంటాడు. కానీ మనం ఎలాంటి హాని చెయ్యకున్నా ఉన్నా పక్కన వ్యక్తి అదే పనిగా టార్చర్ చేస్తుంటే ఆ సమయంలో కోపానికి గురై వారు కొందరు ఉంటారు. కొందరు పుట్టకతోనే పక్కనోళ్లను మోసం చేసి పైకి ఎదిగే గుణంతో ఉంటారు.

కలి ప్రభావం

కలి ప్రభావం

ఇకొందరిపై కలి ప్రభావం పడుతుంది. మరి కలి ప్రభావం ఎలా ఉంటుంది. వీటన్నింటి వెనుక ఉన్న నేపథ్యం ఏమిటో తెలుసుకోండి. ఎంతటి ధర్మాత్ముడు అయినా కలి ప్రభావం పడితే కోలుకోలేడు. సర్వ నాశనం అవుతాడు.

అన్నాచెల్లెళ్లకు పుట్టిన వాడే కలి

అన్నాచెల్లెళ్లకు పుట్టిన వాడే కలి

ద్వాపరయుగాంత కాలంలో అన్నాచెల్లెళ్లకు పుట్టినవాడే కలి పురుషుడు. ఇక ద్వాపర యుగం అంతరించి కలి ప్రవేశించి, కలియుగం ఆరంభమవుతున్న దశ అది. పరీక్షిత్ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న కాలం అది.

గోమాత ఏడుపు

గోమాత ఏడుపు

ఓసారి పరీక్షిత్ మహారాజు గోమాత ఏడుపు వినిపించింది. గోమాత పక్కనే ఒంటి కాలితో ఉన్న ఎద్దు ఎందుకేడుస్తున్నావని ఊరడిస్తూ ఉంది. ఆ గోమాతే భూమి, ఎద్దు ధర్మదేవత. వారిద్దరి దగ్గరికి వెళ్లిన పరీక్షిత్ మహారాజు కూడా ఆ గోవును కారణమేమిటని అడిగాడు.

ఎవరికీ అపకారం చేయని నీకు..

ఎవరికీ అపకారం చేయని నీకు..

కలి ప్రవేశించబోతున్నాడు. కాలం మారడంతోనే ఈ ధర్మానికి మూడు కాళ్లు పోయి చివరికి ఒక్క కాలే మిగిలిందని ఏడుస్తున్నానంది. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఎద్దుతో, ఎవరికీ అవసరం లేని గడ్డి తిని, మనుషులు తాగలేని నీటిని తాగే నిన్ను ఎవరు హింసించారు. ఎవరికీ అపకారం చేయని నీ కాళ్లు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు.

కలిపురుషుడే విరగొట్టాడు

కలిపురుషుడే విరగొట్టాడు

ఎద్దు కాలు విరగొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు పరీక్షిత్ మహారాజు. కాలక్రోధావేశుడై, రాజులా కనిపించే కఠినాత్ముడు, కర్ర పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొడుతున్నాడు.. నా కాళ్లు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ రాజుకు తెలిసింది.

ఇది కలియుగం.. నేను తప్పక రావాలి

ఇది కలియుగం.. నేను తప్పక రావాలి

దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి.. నన్ను ఎందుకిలా చిత్ర హింసలకు గురి చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. ఇది కలియుగం కాబట్టి నేను కచ్చితంగా భూమిపైకి రావాల్సిందే అంటాడు. ఇది వదిలి నేనెక్కడుండాలి? నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు కలి.

ప్రజలు అక్కడికి వెళ్లరనే నమ్మకంతో

ప్రజలు అక్కడికి వెళ్లరనే నమ్మకంతో

సరే.. జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తానన్నాడు పరీక్షిత్తు. తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరనే గట్టి నమ్మకంతో అలా అనుగ్రహించాడాయన.

మరో స్థానాలను ఆక్రమిస్తాడు కలి

మరో స్థానాలను ఆక్రమిస్తాడు కలి

కాని రాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపం, క్రౌర్యం.. ఇలా మరో నాలుగు స్థానాలను కూడా కలి ఆక్రమించాడు.

బంగారం ఉన్న చోట కూడా కలి ఉంటాడు

బంగారం ఉన్న చోట కూడా కలి ఉంటాడు

ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలి పురుషుడు. మొత్తానికి తొమ్మిది స్థానాల్లో కలి ఉంటాడు.

వాటికి ఆకర్షితులైతే అంతే

వాటికి ఆకర్షితులైతే అంతే

ఇందులో ఏ ఒక్కదానికి మనిషి ఆకర్షితుడైనా వారిపై కలి ప్రభావం మొదలై అన్ని రకాలుగా భ్రష్టులవుతారు. అక్కడ సిరిసంపదలు గాని, భగవంతుడు గాని ఉండరు. దాంతో వాళ్లు పూర్తిగా కలి నియంత్రణలోకి వెళ్లి నశించిపోతారు. అందుకే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు దూరంగా ఉండాలని చెబుతారు పెద్దలు.

కలి.. చెలరేగిపోయాడు

కలి.. చెలరేగిపోయాడు

ధర్మబద్ధుడైన పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి, బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారు ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు. ఆ ప్రభావంతో క్రూరమృగాల బాధ తప్పించడానికి మాత్రమే వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది.

కలి ప్రభావం పెరిగింది

కలి ప్రభావం పెరిగింది

జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది. అప్పుడే దాహంతో శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్లడం, తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేస్తాడు పరీక్షిత్ మహారాజు. శమీక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు.

కలి ప్రభావానికి లోనై చనిపోతాడు

కలి ప్రభావానికి లోనై చనిపోతాడు

ఇంటికి వెళ్లి కిరీటం, ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది పరీక్షిత్ మహారాజుకు. అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్తు కూడా తానే అతడి ప్రభావానికి లోనై మరణాన్ని కొనితెచ్చుకుంటాడు పరీక్షిత్ మహారాజు

English summary

King Parikshit allowed Kali Yuga to destroy the world from these 5 places on Earth

King Parikshit allowed Kali Yuga to destroy the world from these 5 places on Earth
Story first published: Monday, March 5, 2018, 15:43 [IST]