For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నగ్నంగా నటించి పేరు కొట్టేసిన కుబ్రా సేత్, సేక్రెడ్ గేమ్స్ రాజీవ్ గాంధీనే రొచ్చులోకి దించేసింది

కుబ్రా సేత్, ఈమె ఒక నటి ప్లస్ యాంకర్. ఈమె గురించి చాలా మందికే తెలిసి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన సేక్రెడ్ గేమ్స్ టీవీ సిరీస్ లోఈమె నటిస్తోంది. దీనికి విమర్శలతోపాటు ప్రశంసలు కూడా వచ్చాయి.

|

నగ్నంగా నటించడం అంటే అంత మామాలు విషయం కాదు. అందులో ఆడవారు అలా నటించాలంటే కాస్త కష్టమే. ఎంత డబ్బు ఇచ్చినా... చిత్ర యూనిట్ ముందు అలా నటించాలంటే లోలోప మాత్రం సిగ్గుతో చచ్చిపోతుంటారు కొందరు. కానీ కొందరు మాత్రం తాము చేసే పని దైవంగా భావిస్తారు. వృత్తిలో భాగంగా తాము నటించే పాత్రకు ప్రాణం పోసేందుకు ఎన్ని ఇబ్బందులైనా సహిస్తారు. అలాంటి కోవకు చెందిన ఆమెనే కుబ్రా సేత్.

సేక్రెడ్ గేమ్స్ టీవీ సిరీస్

సేక్రెడ్ గేమ్స్ టీవీ సిరీస్

కుబ్రా సేత్, ఈమె ఒక నటి ప్లస్ యాంకర్. ఈమె గురించి చాలా మందికే తెలిసి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన సేక్రెడ్ గేమ్స్ టీవీ సిరీస్ లోఈమె నటిస్తోంది. దీనికి విమర్శలతోపాటు ప్రశంసలు కూడా వచ్చాయి. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఈ టీవీ సిరీస్ తెరకెక్కింది. సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ లీడ్ రోల్స్‌లో నటించారు.

సెక్స్ సీన్లపై విమర్శలు

సెక్స్ సీన్లపై విమర్శలు

అయితే ఇందులో ఉన్న సెక్స్ సీన్లపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇందులో ఓ ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ కూడా ఉంది. ఆ పాత్ర పేరు కుకూ. ఈ పాత్రలో నటించిన కుబ్రా సైత్‌పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.ఇందులో ఓ సీన్‌లో ఆమె పూర్తి నగ్నంగా కనిపిస్తుంది. అయితే ఈ సీన్ చేసినందుకు తానేమీ తప్పు చేసినట్లు ఫీలవడం లేదని ఆమె చెబుతోంది.

నగ్నంగా నటించాల్సిన సీన్

నగ్నంగా నటించాల్సిన సీన్

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను ఆడిషన్‌కు వెళ్లినపుడే ఇందులో ఓ నగ్నంగా నటించాల్సిన సీన్ ఉందని చెప్పారు. మీరు స్క్రీన్‌పై ఆ సీన్ చూసినపుడు ఎంత అందంగా దానిని చిత్రీకరించారో మీకు తెలుస్తుంది. మంచి టీమ్‌తో పని చేస్తున్నపుడు ఏ పొరపాటూ జరగదు అని కుబ్రా చెప్పింది.

అనురాగ్ కశ్యప్ ఏడు టేక్‌లు తీసుకున్నాడట

అనురాగ్ కశ్యప్ ఏడు టేక్‌లు తీసుకున్నాడట

ఆ సీన్ పక్కాగా రావడానికి డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఏడు టేక్‌లు తీసుకున్నాడట. అయితే ఆ ఒక్క సన్నివేశమే పదే పదే చిత్రీకరించడంతో కొంత ఇబ్బంది పడ్డానని.. ప్రతీసారీ ఆ సీన్ పూర్తయిన తర్వాత నేలమీద పడి ఏడ్చానని సేత్ వివరించారు. ఈ వెబ్ సిరీస్‌కు అనురాగ్ కశ్యప్ కో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సూచనల మేరకు, ఆ సన్నివేశంలో పర్‌ఫెక్షన్ వచ్చేంత వరకూ రీటేక్ చేయాల్సి వచ్చిందని సేత్ పేర్కొన్నారు.

నన్ను తిట్టుకోవద్దు

నన్ను తిట్టుకోవద్దు

తనకు కావాల్సిన సన్నివేశాన్ని నటీనటులతో రాబట్టుకోవడానికి అనురాగ్ కశ్యప్ చాలా తపన పడతారని వివరించారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో ప్రతిసారీ కశ్యప్ తనవద్దకు వచ్చి మరో టేక్ తీద్దామని అనేవారని చెప్పారు. ఆ సమయంలో ఇలా పదే పదే చేయిస్తున్నందుకు నన్ను తిట్టుకోవద్దని అనేవారు.

ఏడోసారి టేక్ ఓకే

ఏడోసారి టేక్ ఓకే

‘నాకు తెలుసు నాపై కోపం, ద్వేషం వస్తోంది. కానీ నన్ను తిట్టుకోవద్దు' అని కశ్యప్ చెప్పేవారని సేత్ అన్నారు. ఇలా ఆరుసార్లు జరిగాక ఏడోసారి టేక్ ఓకే అయిందని సేత్ వివరించారు. ఇంత కష్టపడి తీసిన ఆ సన్నివేశం అద్భుతంగా ఉందా.. లేక వల్గర్‌గా ఉందా అనేది ప్రేక్షకులే చెబుతారన్నారు.

విక్రమ్ చంద్ర రాసిన బుక్ ఆధారంగా

విక్రమ్ చంద్ర రాసిన బుక్ ఆధారంగా

సేక్రెడ్ గేమ్స్ టీవీ సిరీస్.. 2006లో వచ్చిన విక్రమ్ చంద్ర రాసిన బుక్ ఆధారంగా తెరకెక్కింది. 1980, 90ల్లో ముంబైలోని గ్యాంగ్‌స్టర్లు, పోలీసులు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లు.. వాళ్ల మధ్య సినిమా నటులు పడిన ఇబ్బందులను ఈ బుక్‌లో రాశారు. ఇందులో సైఫ్ అలీఖాన్, రాధికా ఆప్టే, నవాజుద్దీన్ సిద్ధిఖీ పోషించిన పాత్రలకి మంచి పేరొస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ

ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ

ఇటీవల ఇంగ్లీష్, హిందీ భాషల్లో విడుదలైన సాక్రిడ్ గేమ్స్‌ వెబ్ సిరీస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. హాలీవుడ్‌లో విజయవంతమైన వెబ్‌ సిరీస్‌ల బాటలో ఇటీవల టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ కొందరు దర్శకులు ప్రయత్నం చేసి సక్సెస్‌ అయ్యారు. ఈ క్రమంలో వచ్చిన బాలీవుడ్‌ వెబ్‌ సిరీసే సాక్రిడ్‌ గేమ్స్‌.

నెట్ ఫ్లిక్స్ రూపొందించిన వెబ్ సిరీస్

నెట్ ఫ్లిక్స్ రూపొందించిన వెబ్ సిరీస్

ఇక సేక్రెడ్ గేమ్స్ గురించి ఇంకొన్ని విషయాలు కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నారు. ఇదిరెగ్యులర్ మూవీ కాదు.. కేవలం ‘నెట్ ఫ్లిక్స్' కోసం రూపొందించిన వెబ్ సిరీస్. కానీ.. అటు హిందీ ఇండస్ట్రీలోనూ, ఇటు ఇండియన్ పాలిటిక్స్‌లోనూ రచ్చ షురూ చేసింది. వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నప్పటికీ.. ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ మాత్రం ఆగలేదు. ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతోంది కూడా.

రాజీవ్ గాంధీనే రొచ్చులోకి దించేసింది

రాజీవ్ గాంధీనే రొచ్చులోకి దించేసింది

ఏకంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీనే రొచ్చులోకి దించేసిందిది. ఇందులో కీలక పాత్ర పోషించిన నవాజుద్దీన్ సిద్ధికి రాజీవ్ గాంధీనుద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నది కాంగ్రెస్ పార్టీ అభియోగం. వెంటనే ఈ ఎపిసోడ్ ప్రసారాన్ని నిలిపేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది కూడా. అంతకుముందు బెంగాల్ కాంగ్రెస్ నేత రాజీవ్ సిన్హా.. ‘సేక్రెడ్ గేమ్స్' మేకర్స్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజీవ్ గాంధీ హయాంలోని కొన్ని వాస్తవాల్ని ఈ వెబ్ సిరీస్ వక్రీకరించి చూపుతోందని ఆరోపించారాయన.

అశ్లీలతను బాగా పెంచేసింది

అశ్లీలతను బాగా పెంచేసింది

అటు.. కంటెంట్ విషయంలో కూడా కాంట్రవర్సియల్‌గా మారింది ‘సేక్రెడ్ గేమ్స్'. సయీఫ్ ఆలీ ఖాన్, రాధికా ఆప్టే, నవాజుద్దీన్ సిద్ధికితో పాటు.. కుబ్రా సేత్ అనే గ్లామర్ గాళ్ ఇందులో మరో కీ రోల్ చేస్తోంది. లింగమార్పిడి చేయించుకున్న మహిళగా ఆమె చేసిన పాత్ర.. సినిమాలో అశ్లీలతను బాగా పెంచేసింది. పురుషుల జననాంగాల్ని ధరిస్తూ ఆమె చేసిన కొన్ని విన్యాసాలు కాస్త ఎబ్బెట్టుగానే ఉంటాయి.

కుబ్రా ఇప్పుడు నేషనల్ ఫిగరైంది

కుబ్రా ఇప్పుడు నేషనల్ ఫిగరైంది

ఇక కుబ్రా అంటూ నెట్లో వెతుకులాటలు కూడా మొదలయ్యాయి. బిగ్ బజార్ కమర్షియల్ యాడ్‌లో నటించడం, సల్మాన్ ఖాన్ ‘రెడీ' మూవీలో ఒక కేమియోలో చేయడం తప్పిస్తే ఈమెకంటూ గొప్ప బ్యాక్‌గ్రౌండ్ అంటూ ఏమీ లేదు. ‘సేక్రెడ్ గేమ్స్' పుణ్యమా అని కుబ్రా ఇప్పుడు నేషనల్ ఫిగరై కూర్చుంది. ట్రాన్స్‌జెండర్' పాత్రలో ఈ అమ్మడు జీవించేస్తోంది. ఈమె నగ్నంగా నటించిన విషయం తెలిసిందే.

English summary

kubbra sait aka kukkoo shares how she shot the scene involving frontal nudity in sacred games

kubbra sait aka kukkoo shares how she shot the scene involving frontal nudity in sacred games
Story first published:Thursday, July 12, 2018, 13:18 [IST]
Desktop Bottom Promotion