For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రెడ్లాక్స్ లేని తండ్రిని మొదటిసారిగా చూసిన పాప స్పందన ఎలా ఉందో చూడండి.

|

డ్రెడ్లాక్స్ అనేది ఒక హెయిర్ స్టైల్ రకం. జడలు జడలుగా జుట్టును స్టైల్ చేసుకోవడం దీనిలో ప్రధానంగా ఉంటుంది. అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఆఫ్రికా ట్రైబల్ ప్రాంతాలలో సర్వసాధారణంగా ఉంటుంది. మరియు ఇప్పుడు ఫాషన్ ప్రపంచంలో అదొక ట్రెండ్ కూడా.

మనం తరచూ చూస్తున్న వ్యక్తి పూర్తిగా మారిపోయి కనిపిస్తే గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి సందర్భాలలో సంవత్సరాల వ్యవధి తర్వాత చూడడం, మేకప్, టాటూ, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ మొదైలైన అంశాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఒక్కోసారి మనిషి ఎవరో అర్ధంకాక, ఒక రెండు నిమిషాలు అలా నిశ్చేష్టులైపోయి చూడడం కూడా పరిపాటి.

Little Girl Sees Dad For The First Time Without His Dreadlocks

ఉదాహరణకు ఎప్పుడూ జుట్టుతో, మీసాలతో కనిపించే వ్యక్తులు, పూర్తిగా వాటిని తీసివేసి పిల్లల ముందు కనిపించినప్పుడు, ఆశ్చర్యానికి లోనవడం, భయపడి అమ్మ చాటున దాక్కుని “భూ” అంటూ భయపడడం వంటివి కూడా చూస్తుంటాం. అటువంటి సందర్భానికి ఈ వీడియో ఉదాహరణగా ఉంటుంది.

ఈ వీడియోలో ఒక తండ్రి, తన సాధారణమైన డ్రెడ్లాక్స్ హెయిర్ స్టైల్ లో కనిపించినా కూడా, ఒక్కసారిగా ఆ జుట్టు పడిపోవడంతో ఆ అమ్మాయి చూపిన సహజసిద్ద ఆశ్చర్యం, ఆనందం ఇప్పుడొక వైరల్ గా ఉంది. తండ్రులెప్పుడూ బిడ్డల సంతోషం కోసం అనేక పాట్లు పడుతుంటారు. ఈ మద్యనే మనం బోల్డ్స్కీ పేజీలో చూసిన అనేక వీడియోలలో, అనేక ఉదాహరణలను మీరు గమనించే ఉంటారు. కూతురిని సర్ప్రైజ్ చేయాలని భావించిన ఈ తండ్రి, జుట్టుని తొలగించుకుని కూడా, అలాగే తల మీద ఉంచుకుని పాప ముందు నిలబడి మాట్లాడుతున్నాడు, ఒక్కసారిగా ఆ డ్రెడ్లాక్స్ జుట్టు కింద పడిపోవడంతో ఆ పాప ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి.

డ్రెడ్లాక్స్ గురించిన కొన్ని వివరాలు మీకోసం:

పురాతన గ్రీకు సంప్రదాయం, అజ్టేక్, సెనిగలేస్, బుద్దిజం మరియు రాస్టఫారి సాంప్రదాయాలు ఎక్కువగా పాటించే ఈ డ్రెడ్లాక్స్ హెయిర్ స్టైల్ అనేక ట్రైబల్ తెగలలో కూడా తరచూ చూస్తుంటాము.

ఎక్కువగా ఆఫ్రికా తెగలలో చూసే ఈ హెయిర్ స్టైల్, నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది లింగబేధంలేకుండా అనుసరిస్తున్నారు. కేవలం డ్రెడ్లాక్స్ హెయిర్ స్టైల్స్ కోసం ప్రత్యేకించబడిన సెలూన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అంటే ఆశ్చర్యం కలుగక మానదు,

ఈ వీడియోలోని తండ్రి, తన కూతురు హావభావాలను గుర్తులుగా ఉంచాలని భావించాడు, క్రమంగా తీసిన ఈవీడియో, నేడు ఇంటర్నెట్లో ఒక వైరల్ గా తిరుగుతూ ఉంది.

ముందుగా ప్లన్ చేసిన ప్రకారం, డ్రెడ్లాక్స్ తన తల మీద ఉంచుకుని పాప ముందు నిలబడగా, ఏదో తేడా ఉందని పసిగట్టిన పాప తీక్షణంగా చూస్తున్న సమయంలో డ్రెడ్లాక్స్ హెయిర్ తన చేతుల్లోపడడం, క్రమంగా కూతురు షాక్ చెంది, ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు.

వీడియో చూడండి.

నీకన్నా నాజుట్టే పొడవుగా ఉంది అన్నట్లుగా తండ్రి నిలబడడం, కూతురుకి తండ్రి హెయిర్ స్టైల్ మీద అనుమానం కలగడం , జుట్టు కిందపడి చివరికి కూతురు గెలవడం (తండ్రే గెలిపించాడులే), నిజంగా ఆద్యంతం హాస్యపూరితంగా కనిపిస్తుంది.

పిల్లలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే తల్లిదండ్రులు, వారి సంతోషాలలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఏస్వార్ధం లేకుండా, నిరంతరం పిల్లల సంరక్షణకోసం ప్రాకులాడే నిస్వార్ధ జీవులు తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులను స్పురించేదిగా ఈ వీడియో ఉంటుంది.

ఈ వీడియో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? హౌ క్యూట్ అనుకుంటున్నారు కదా? మీకు కూడా ఇటువంటి కొన్ని మధురస్మృతులు తలంపుకు వస్తున్నాయా ? అయితే మీ భావాలను మాతో పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Little Girl Sees Dad For The First Time Without His Dreadlocks

In this video, a little girl stood frozen on the spot shocked as she couldn't stop staring at her dad as she saw him without his dreadlocks for the first time. She started laughing and still trying to get used to her dad's new look and luckily her reaction is captured on video. This video shows the bond the father-daughter share.
Story first published: Monday, August 6, 2018, 21:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more