శరీరం పై ఉన్న పుట్టుమచ్చలు ఖచ్చితంగా ఏమి తెలియజేస్తాయో మీకు తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మన శరీరం పై వివిధ ప్రాంతాల్లో సహజంగానే పుట్టు మచ్చలు ఉంటాయి. ఈ పుట్టు మచ్చలు వేటికవి ప్రత్యేకం. ఇవి మీ యొక్క ధనం గురించి, అదృష్టం గురించి మరియు జీవితంలోని ఇతర విషయాల గురించి ఎంతో చెబుతాయి అనే విషయం మీకు తెలుసా ?

ఒక వ్యక్తికి శరీరంలోని వివిధ ప్రాంతాల్లో పుట్టు మచ్చలు గనుక ఉంటే, ఆ వ్యక్తి ఎంత ధనవంతుడు ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది.

ఈ పుట్టుమచ్చలు ఆ వ్యక్తికి ఎంత అదృష్టాన్ని కలిగిస్తాయి. అతడు ఏంత్త అదృష్టవంతుడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. వీటన్నింటి గురించి తెలుసుకోవాలని సహజంగానే అందరికి ఆత్రంగా ఉంటుంది. మీ గురించి మీకు తెలుసుకోవాలని కూడా ఉంటుంది.

కాబట్టి పుట్టు మచ్చలు ఎందుకు ప్రత్యేకమైనవి అవి ఏమి తెలియజేస్తాయి. శరీరం పై పుట్టుమచ్చలు వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పుడు, వాటికి వ్యక్తి యొక్క సంపదకు ఉన్న సంబంధం ఏమిటి ? వీటన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పుట్టుమచ్చ కాలు పై ఉన్నప్పుడు :

పుట్టుమచ్చ కాలు పై ఉన్నప్పుడు :

ఒక వ్యక్తికి పుట్టు మచ్చ గనుక అతని కాలిపై ఉంటే, ఆ వ్యక్తి కొద్దిగా అయోమయ మనస్తత్వాన్ని కలిగి ఉంటాడని భావించాలి. వీరు ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు. కానీ, ఆ శక్తిని అంతా సరైన దిశలో ఉపయోగించడంలో విఫలమవుతారు. ఇలా చేయడం వల్ల వారి యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది.

ఎడమ బుజం పై పుట్టు మచ్చ ఉన్నప్పుడు :

ఎడమ బుజం పై పుట్టు మచ్చ ఉన్నప్పుడు :

ఎప్పుడైతే ఒక వ్యక్తికి పుట్టుమచ్చ అతని ఎడమ బుజం పై ఉంటుందో, అటువంటి వ్యక్తి ఎప్పుడూ ఆర్ధిక సమస్యలతో సతమతమవుతుంటాడట. ఒక వ్యక్తికి పుట్టుమచ్చ కుడి వైపు గనుక ఉంటే, అటువంటి వ్యక్తులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అర్ధం.

పుట్టుమచ్చ గనుక ఛాతి భాగం లో ఎడమ వైపు ఉంటే :

పుట్టుమచ్చ గనుక ఛాతి భాగం లో ఎడమ వైపు ఉంటే :

వ్యక్తులకు ఎవరికైతే పుట్టుమచ్చలు ఈ భాగంలో ఉంటాయో, అటువంటి వారు, వారు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారట. అంతే కాకుండా ఇటువంటి వ్యక్తులు మంచి హాస్యంతో హాస్యచతురతను ప్రదర్శిస్తారు.

పుట్టుమచ్చ గనుక ఛాతి భాగం మధ్యలో ఉంటే :

పుట్టుమచ్చ గనుక ఛాతి భాగం మధ్యలో ఉంటే :

ఏ వ్యక్తులకు అయితే పుట్టుమచ్చ ఛాతి భాగం మధ్యలో ఉంటుందో అటువంటి వ్యక్తులకు వంశపారంపర్యంగా వచ్చే అదృష్టం అస్సలు వీరికి వరించదు. వీరు వ్యక్తిగతంగా, ముఖ్యంగా ప్రేమ జీవితంలో విపరీతంగా పోరాటం చేయవలసి వస్తుంది.

పుట్టుమచ్చ గనుక ఛాతి భాగం కుడి వైపు ఉంటే :

పుట్టుమచ్చ గనుక ఛాతి భాగం కుడి వైపు ఉంటే :

ఈ ప్రాంతంలో గనుకా ఎవరికైనా పుట్టుమచ్చ ఉంటే, ఆ వ్యక్తికి అదృష్టం విపరీతంగా ఉంటుంది మరియు ధనం కూడా విపరీతంగా లభిస్తుంది. వీరు అదృష్టవంతులు మరియు వీరితో పాటు ఉన్నవారు కూడా అదృష్టవంతులే.

పుట్టుమచ్చ గనుక కుడి చేతి భుజం పై ఉంటే :

పుట్టుమచ్చ గనుక కుడి చేతి భుజం పై ఉంటే :

ఏ వ్యక్తులకు అయితే, పుట్టు మచ్చ ఇలాంటి స్థానంలో ఉంటుందో ఇటువంటి వ్యక్తులు చాలా సమయాన్ని ఇంట్లోనే గడుపుతారు. కుటుంబ అవసరాల దృష్ట్యా అలా వ్యవహరిస్తారు. ముఖ్యంగా పిల్లలను చూసుకోవడానికి ఎక్కువ సమయం గడుపుతారు. అంతే కాకుండా వీరు ఎంతో క్రమశిక్షణతో వ్యవహరిస్తారు.

పుట్టుమచ్చ గనుక చేయి లేదా వేలి పై ఉంటే :

పుట్టుమచ్చ గనుక చేయి లేదా వేలి పై ఉంటే :

వ్యక్తులకు ఎవరికైతే పుట్టు మచ్చ ఈ ప్రాంతంలో ఉంటుందో, అటువంటి వ్యక్తులు ఎంతో అత్యాశతో వ్యవహరిస్తారు మరియు వ్యక్తిగతంగా ఆలోచించడానికి ఇష్టపడతారు మరియు వారి మనస్సు ఎలా చెబుతుందో అలా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఇతరులు వీరికి అనుకూలంగా వ్యవహరించడానికి కూడా అస్సలు ఒప్పుకోరు.

పొట్ట పై పుట్టు మచ్చ ఉండటం :

పొట్ట పై పుట్టు మచ్చ ఉండటం :

ఒక వ్యక్తికి ఎప్పుడైతే పొట్ట పై పుట్టుమచ్చ ఉంటుందో, అటువంటి వ్యక్తి సాధారణంగానే ఎక్కువ అత్యాశతో వ్యవహరిస్తారు మరియు వీరు ప్రేమించే వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు స్వార్ధపూరితంగా వ్యవహరిస్తారు. తమకు తాము వీరు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చుకుంటారు. ఇది చూసిన ఇతర వ్యక్తులు, వీరు దురహంకారం కలవారని భావిస్తారు.

ముక్కు పై పుట్టుమచ్చ ఉండటం :

ముక్కు పై పుట్టుమచ్చ ఉండటం :

వ్యక్తులు ఎవరికైతే ముక్కు పై పుట్టుమచ్చ ఉంటుందో, అటువంటి వ్యక్తులు ఎంతో సృజనాత్మకతను కలిగి ఉంటారు మరియు స్వభావ రిత్యా కళాత్మకతను ప్రదర్శిస్తారు. ఇటువంటి వ్యక్తులు కళకు సంబంధించిన విషయాల పై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు మరియు వీరిలో సృజనాత్మకత అలా సులభంగానే ప్రవహిస్తూ ఉంటుంది. వీరు అన్ని విషయాలను సరదాగా తీసుకుంటారు మరియు నిగ్రహాన్ని త్వరగా కోల్పోరు. అందుచేత వీరు జీవితంలో మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు.

దవడ భాగంలో పుట్టుమచ్చ ఉండటం :

దవడ భాగంలో పుట్టుమచ్చ ఉండటం :

ఈ భాగంలో పుట్టు మచ్చ ఉన్న వ్యక్తులు దురదృష్టవంతులని భావిస్తారు. ఎందుకంటే, వీరు తరచూ అనారోగ్యం భారినపడుతుంటారు మరియు వీరిని జీవితాంతం ఎదో ఒక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. దీని వల్ల వీరు వింత వ్యక్తిత్వంతో ప్రవర్తిస్తుంటారు. అంతేకాకుండా వీరు నిగ్రహాన్ని చాలా త్వరగా కోల్పోతారు.

ఎడమ బుగ్గ పై పుట్టుమచ్చ ఉండటం :

ఎడమ బుగ్గ పై పుట్టుమచ్చ ఉండటం :

ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు మరియు వీరు చాలా త్వరగా ఒత్తిడిలో కూరుకుపోతారు. మరోవైపు వ్యక్థకి పుట్టు మచ్చ కుడి వైపు గనుక ఉంటే, వీరు ఎంతో అభిరుచితో వ్యవహరిస్తారని అర్ధం.

పాదాలపై పుట్టుమచ్చలు ఉండటం :

పాదాలపై పుట్టుమచ్చలు ఉండటం :

ఏ వ్యక్తుల కైతే పుట్టుమచ్చలు పాదాల పై ఉంటాయో, అటువంటివారు ప్రయాణాలకు ఎక్కువగా మొగ్గు చూపుతారు మరియు సహజంగానే సాహసోపేత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు పుట్టిన ఊరు నుండి దూరంగా ఉండే ఉద్యోగాలను ఎంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

గడ్డం పై పుట్టుమచ్చ ఉండటం :

గడ్డం పై పుట్టుమచ్చ ఉండటం :

ఏ వ్యక్తులకైతే పుట్టుమచ్చ ఈ ప్రాంతంలో ఉంటుందో, అటువంటివారు స్వభావ రీత్యా నిగ్రహాన్ని చాలా త్వరగా కోల్పోతారు మరియు కోపాన్ని చాలా త్వరగా ప్రదర్శిస్తారు మరియు వీరికి ఉన్న బలహీనతల దృష్ట్యా ఆర్ధికంగా ఎక్కువగా నష్టపోతారు. అంతేకాకుండా ఇతరుల యొక్క మోసపూరిత వ్యూహాల్లో త్వరగా చిక్కుకుంటారు. దీనివల్ల వీరి యొక్క జీవితం ఎంతో కష్టదాయకంగా మారుతుంది.

English summary

Moles On Different Parts Of Body Reveal How Wealthy You Would Get

Moles On Different Parts Of Body Reveal How Wealthy You Would Get, Moles on different parts of the body signify the wealth aspect of a person and how much of it he would possess in his life.
Story first published: Thursday, February 8, 2018, 10:00 [IST]
Subscribe Newsletter