For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్షకదళంలో ఉన్న తొమ్మిది మంది ప్రముఖ సెలబ్రెటీలు

|

ఈరోజుల్లో యువత సాధారణంగా రక్షక దళంలో చేరుటకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇది హర్షించనీయదగిన పరిణామం. నివేదికల ప్రకారం పది నుండి పదకొండు వేల మంది ఆఫీసర్లు అవసరమైన రక్షకదళంలో తొమ్మిది వేల మంది మాత్రమే సగటుగా ఉంటున్నారు. దీనికి కారణం, రక్షకదళము నాణ్యతాపరమైన విషయములలో కంప్రమైజ్ కాకపోవడమే.

ఇలాంటి సందర్బములలో రక్షక దళము, తమలో చేర్చుకొనుటకు యువతను ఆకర్షించడానికి కొత్త ఆలోచనతో అడుగు వేసింది. తద్వారా ప్రింట్ మరియు డిజిటల్ మీడియా యువతను ఆకర్షించటానికి మరియు వారిలో దేశభక్తి పెంపొందించుటకు ప్రత్యకమైన కార్యక్రమములు చేస్తుండగా, మరో పక్క దేశములో పేరెన్నిక గల ప్రముఖులు రక్షక దళంలో చేరుతూ యువతకు ఆదర్శoగా నిలుస్తున్నారు.

Nine Celebrities Who Are In Armed Forces!

నివేదికల ప్రకారం ఇతర వృత్తులతో పోలిస్తే స్పొర్ట్స్ , మిలటరీకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ అనేకమంది ప్రముఖులు మిలిటరీ ఫామిలికీ చెందినవారు అయినప్పటికీ స్పొర్ట్స్ లో రాణిస్తూ కూడా రక్షకదళంలో ప్రత్యకముగా చేరుతూ యువతకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.

మహేంద్ర సింగ్ ధోని :

మహేంద్ర సింగ్ ధోని :

కెప్టెన్ కూల్ గా క్రికెట్ లో తన హెలికాఫ్టర్ షాట్స్ తో ప్రజల మనసు గెలుచుకున్న మహేంద్ర సింగ్ ధోని గౌరవప్రదమైన లుటెనెంట్ కల్నల్ గా రక్షకదళంలో అధికారిగా స్థానం సంపాదించుకున్నారు . దీనికోసం ఆగ్రా లో 2017 సంవత్సరం మద్యలో రెండు వారాల పాటు పారాచ్యూట్ గ్లైడింగ్ లో శిక్షణ పొంది తనకంటూ ఒక ర్యాంక్ సంపాదించుకొని తద్వారా ఈ గౌరవ ప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అందిన నివేదికల ప్రకారం ప్యారా రెజిమెంట్ లో శిక్షణ పొందిన తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఐదు మార్లు పారా గ్లైడింగ్ చేసిన పిదప ఈ స్థానం సంపాదించగలిగారు.

అభినవ్ బింద్రా :

అభినవ్ బింద్రా :

షూటింగ్ విభాగంలో మనదేశానికి ఒలింపిక్ పతకాన్ని కానుకగా తెచ్చిన ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా 2011 లో రక్షక దళమునందు ACE- షూటర్ గా గౌరవ ప్రధమైన స్థానాన్ని పొందారు. మరియు భారతదేశ మిలటరీ విభాగానికి గౌరవప్రద లెఫ్టినెంట్ కల్నల్ గా కూడా భాద్యతలు చేపట్టినాడు. దీనికై ధోని పారా- రేజిమెంట్ లో భాద్యతలు తీసుకున్నట్లుగానే, TA battalion of Sikh regiment లో అభినవ్ బింద్రా భాద్యతలు తీసుకున్నాడు. ఈమద్యనే కామన్వెల్త్ 2014 లో 10m రైఫిల్ షాట్ లో భారత దేశానికి బంగారుపతకాన్ని సాధించాడు .

సచిన్ టెండూల్కర్:

సచిన్ టెండూల్కర్:

భారత దేశంలో ప్రతి పౌరుని మనసులో మాస్టర్ బ్లాస్టర్ గా, క్రికెట్ దేవునిగా స్థానం సంపాదించుకున్న ఘనత సచిన్ టెండూల్కర్ కే దక్కింది అనడంలో అతిశయోక్తి లేదు.

భారత మిలటరీ విభాగానికి సమానమైన భారత వైమానిక దళానికి గ్రూప్ కెప్టెన్ గా భాద్యతలు స్వీకరించాడు. ఎటువంటి వైమానిక శిక్షణ లేకుండా, ఈ సంస్థకు సంబంధించి ఎటువంటి బాక్గ్రౌండ్ లేని వ్యక్తిగా ఈ గౌరవప్రదమైన భాద్యతలు చేపట్టడం దేశంలో మొదటి సారిగా సచిన్ కే దక్కింది. ఈమద్యనే జరిగిన 83 వ భారత దేశ వైమానిక దళ ఉత్సవాలలో పాల్గొన్నారు కూడా.

కపిల్ దేవ్:

కపిల్ దేవ్:

ప్రతి తరానికి కనీసం ఒక క్రికెట్ దిగ్గజం ఉంటారు, అలాంటి దిగ్గజాలలో కపిల్ ఒకడు. భారతదేశానికి ప్రపంచ కప్ రుచి చూపించిన ఘనుడు కపిల్ దేవ్. 2008 లో లుటెనెంట్ కల్నల్ గా భారతదేశ రక్షక దళంలో గౌరవప్రదమైన భాద్యతలను స్వీకరించారు. ఈ భాద్యతల స్వీకరణ సమయంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ TA , కపిల్ దేవ్ ని TA బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. తద్వారా యువతలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారాయన.

మోహన్ లాల్ విశ్వనాధన్ నాయర్:

మోహన్ లాల్ విశ్వనాధన్ నాయర్:

దక్షిణ భారతదేశంలో ప్రముఖ హీరో మోహన్ లాల్ భారతదేశపు రక్షణ దళం లుటెనెంట్ కల్నల్ గా 2009 లో రాంక్ ను సంపాదించారు. దీనికై తీసుకోబోవు ట్రైనింగ్ గురించిన ముందస్తు ప్రకటన కూడా విడుదలచేశారు అప్పట్లో. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క సినీ దిగ్గజంగా మోహన్ లాల్ పేరు గడించారు. తద్వారా 2010లో కాన్పూర్ లోని 122 infantry battalions of the Territorial Army లో భాద్యతలు తీసుకున్నారు.

సచిన్ పైలట్:

సచిన్ పైలట్:

లుటెనెంట్ కల్నల్ గా భారత మిలటరీ రక్షణ విభాగం లో భాద్యతలు చేపట్టిన మొదటి యూనియన్ మినిస్టర్ గా సచిన్ పైలట్ పేరు సంపాదించారు. 2012లో TA battalion of Sikh regiment లో భాద్యతను తీసుకున్నారు. సచిన్ పైలట్ తండ్రి కూడా భారత వైమానిక దళం లో పైలట్ గా పనిచేయగా, తాతగారు మిలటరీలో NCO గా భాద్యతలు నిర్వహించారు.

వీరేకాకుండా కొందరు మిలటరీ విభాగానికే చెందిన వారు కూడా తమ సేవలతో ప్రముఖుల జాబితాలోకి చేరినారు.

మిల్కా సింగ్:

మిల్కా సింగ్:

మిల్కా సింగ్ ని ఫ్లయింగ్ సిఖ్ గా వ్యవహరిస్తుంటారు కూడా, భారత మిలటరీ రక్షణ దళం లో పని చేసి తర్వాత, పరుగు మీద ప్రేమతో స్పొర్ట్స్ లో రాణించిన ఈ దిగ్గజం పేరున భాగ్ మిల్కా భాగ్ అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా, మిల్కా మరియు అతని కూతురిచే రచింపబడ్డ “ ది రేస్ ఆఫ్ మై లైఫ్ “ అనే పుస్తకం ఆధారంగా తీయబడింది. మిల్కా సింగ్ ఆర్మీలో ఉన్నప్పుడూ సిపాయ్ నుండి JCO గా కూడా స్థానాన్ని సంపాదించుకున్నారు.

రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ :

రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ :

భారత మిలటరీ విభాగానికి లుటెనెంట్ కల్నల్ గా భాద్యతలు చేపట్టిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2004 ఒలింపిక్స్ లో దేశానికి షూటింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. దేశానికి 1900(భారత దేశం మొదటి సారిగా సమ్మర్ ఒలింపిక్స్ లో పాల్గొన్న సంవత్సరం) నుండి జరిగిన ఒలింపిక్స్ లో మొదటి సిల్వర్ మెడల్ తెచ్చిన ఘనత ఈయన సొంతం.

విజయ్ కుమార్:

విజయ్ కుమార్:

భారత మిలటరీరక్షక దళంలో సుబేదార్ మేజర్ గా భాద్యతలు నడుపుతున్న విజయ్ కుమార్ 2012 లో జరిగిన ఒలింపిక్స్ లో 25 mtr రాపిడ్ పిస్టల్ ఈవెంట్ లో భారతదేశానికి సిల్వర్ మెడల్ తీసుకుని వచ్చారు.

All Images source :Google

English summary

Nine Celebrities Who Are In Armed Forces!

Nine Celebrities Who Are In Armed Forces, Nine Indian Celebrities Who Are In Holds Honorary Ranks in Indian Military Wings!
Desktop Bottom Promotion