For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ రాశి చక్రం ప్రకారంగా మీలో మీ భాగస్వామికి నచ్చే అంశాలు ఇవే

  |

  మీ రాశిచక్రం ఇతర రాశిచక్రాలతో పోల్చి చూసినప్పుడు ఒక ప్రత్యేక గుణాన్ని కలిగి ఉండడం గమనించారా. ఈ 12 రాశిచక్రాలు వాటి వాటి ఉన్నత స్వభావాలతో, ఇతర రాశిచక్రాలతో పోల్చినప్పుడు ఉత్తమంగా కనిపిస్తుంటాయి. తద్వారా రాశిచక్రం ప్రకారం మీలోని ఉత్తమ గుణాలను అంచనా వేయవచ్చు కూడా.

  ఇక్కడ మీ రాశిచక్రాలకు సంబంధించిన కొన్ని ఉత్తమ గుణాలను పొందుపరుస్తున్నాము. మీ రాశిచక్రాలకు అనుగుణంగా మీకు ఆపాదించే ఆ లక్షణాల గురించి తెలుసుకోండి మరి. క్రమంగా మీ ప్రియమైన వారి ఆలోచనా విధానాలు మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంది.

  మేషం: మార్చి 21- ఏప్రిల్ 19

  మేషం: మార్చి 21- ఏప్రిల్ 19

  మీ ఆలోచనా తీరు, ఇతరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. మీరు ఏ విషయo గురించైనా తీవ్రమైన ఆలోచనలు చేస్తుంటారు. మీ చివరి లక్ష్యం సమస్యలకు పరిష్కారం ఇచ్చి తీరాల్సిoదే అన్న తీరును ప్రదర్శిస్తుంటారు. ఇది మీలోని పట్టుదల , క్రమశిక్షణ మరియు ఆలోచనా దృక్పధాన్ని కనపరుస్తుంది. తద్వారా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఇతరులు మిమ్ములను అర్ధం చేసుకోవడంలో ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటారు.

  వృషభo: ఏప్రిల్ 20 – మే 20

  వృషభo: ఏప్రిల్ 20 – మే 20

  మీ నిబద్దత, నలుగురికీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీరు చూసేందుకు కోపం కలవారిగా కనిపించినా సంబంధాల యందు సున్నిత మనస్కులుగా ఉంటారు. ఏ విషయమునందైనా ఎంత వీలైతే అంత గొప్ప పనితనాన్ని ప్రదర్శిస్తుంటారు . ఉదాహరణకు వీరిని ఏదైనా ఒక వస్తువు తెమ్మని పురమాయిస్తే, ఉన్నతమైన దానికోసం గాలించి తెచ్చే స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరిలో ఇలాంటి లక్షణం కనపడదు. మీరు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతని ఇస్తుంటారు. మీ ప్రియమైన వారికి చిన్ని గాయమైనా మీరు తట్టుకోలేరు. ఇలాంటి లక్షణాలు నచ్చని భాగస్వామి ఉంటారా ఎక్కడైనా.

  మిధునం: ఏప్రిల్ 21- జూన్ 20

  మిధునం: ఏప్రిల్ 21- జూన్ 20

  మీలోని అచంచల శక్తి మీ భాగస్వామిని విస్మయానికి గురిచేస్తుంది. మీరు సహృదయులుగా ఉంటారు. మీ ఆలోచన విధానాన్ని, తెలివిని నలుగురితో పంచుకోవాలన్న ఆలోచన చేస్తుంటారు. మీరు ఎక్కువగా సంబంధాల పట్ల ఆసక్తిని కనపరుస్తారు. మీ ప్రియమైన వారికి ఏ సమస్య వచ్చినా మీరు అడ్డుగా నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. ఎవ్వరికీ అర్ధం కాని ఉన్నత వ్యక్తిత్వం మీది. కష్టకాలంలోనే మీరెలాంటి వారో అందరికీ తెలుస్తుంది.

  కర్కాటక రాశి: జూన్ 21- జూలై 22

  కర్కాటక రాశి: జూన్ 21- జూలై 22

  మీ కష్టం ఎన్నటికీ వృధా కాదు. మీ విజయం నలుగురిలో ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. మీ ప్రియమైన వారిపట్ల అత్యంత జాగరూతులై ప్రవర్తిస్తుంటారు. మీతో రోజును గడపడం అంటే ఎవరికైనా అది మరచిపోలేని రోజుగానే ఉంటుంది. ఎటువంటి కష్టసమయాల్లో అయినా మీలో భాధను కనపడనీయకుండా ప్రవర్తించి ఇతరుల భాధను తొలగించే ప్రయత్నం చేస్తుంటారు. మీతో ఉంటే సురక్షితమన్న భావన మీ భాగస్వామి కళ్ళలో స్పష్టంగా చూడగలరు. .

  సింహం: జూలై 23– ఆగస్ట్ 23

  సింహం: జూలై 23– ఆగస్ట్ 23

  మీ నీతినిజాయితీలు, నిబద్దత మీ భాగస్వామి గుండెలను కరిగిస్తుంది. మీరు ప్రేమించే విధానం ఇతరులకన్నా భిన్నంగా ఉంటుంది. మీ హృదయసమానంగా వారిని భావిస్తారు. కానీ అందరిలో ఉన్నతంగా కనపడాలనే మీ ఆలోచనా విధానం కొన్ని సందర్భాలలో భాధను మిగులుస్తుంటుంది. కానీ మీ వ్యక్తిత్వం నలుగురిలో మిమ్ములను ప్రత్యేకంగా కనపడేలా చేస్తుంది.

  కన్య: ఆగస్ట్ 24– సెప్టెంబర్ 23

  కన్య: ఆగస్ట్ 24– సెప్టెంబర్ 23

  మీ జాగ్రత్త మీభాగస్వామిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు ఏవిషయం నందైనా ప్రణాళికా బద్దంగా వ్యవహరించాలన్న తీరును కనపరుస్తూ ఉంటారు. మీ వ్యక్తిత్వం, కష్టపడే తీరు మీ లక్ష్య సాధనలో పట్టుదలను ప్రస్పుటంగా కనపడేలా చేస్తుంది. తద్వారా మిమ్ములను చూసి అసూయ పడే కళ్లే ఎక్కువగా ఉంటాయి.

  తుల : సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

  తుల : సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

  మీరు జీవితంలో ప్రతి ఒక్క అంశాన్ని తీవ్రంగానే ఆలోచిస్తుంటారు, తద్వారా ఇతరులకు కోపం కలిగిన వారిలా కనిపిస్తుంటారు. కానీ ప్రతి విషయము నందు, ఉత్తమమైన ఫలితాలను పొందాలనే వీరి ఆలోచన చాలా గొప్పది. తులారాశి వారిని ఒక స్థానంలో చూచుటకు ఈ తత్వమే కారణము. కానీ వీరు ఈ ఫలితాల సాధనకై అనేక ఆటుపోటులను సైతం ఎదుర్కొనవలసి వస్తుంది. మీ భాగస్వామి పట్ల మీరు చూపే ప్రేమ, వర్ణనాతీతం. మీ ప్రేమకు మీ భాగస్వామి బానిసలు అవుతారు అనడంలో ఆశ్చర్యమే లేదు.

  వృశ్చికం: అక్టోబర్ 24 – నవంబర్ 22

  వృశ్చికం: అక్టోబర్ 24 – నవంబర్ 22

  మీలోని ఆద్యాత్మిక చింతన మరియు అభిరుచులు మీ భాగస్వామికి నచ్చేవిలా ఉంటాయి. మీరు మీకు నచ్చని విషయాలకు దూరంగా ఉండే ఆలోచనలు చేస్తుంటారు. తద్వారా సంబంధాలలో కూడా కొన్ని గొడవలు సహజంగానే ఉంటాయి. మీ లక్ష్య సాధనలో ఆటంకాలను ఎన్నటికీ సహించలేరు. కానీ మీ కోపానికి అర్ధం ఉంటుంది. మీరు వేసే ప్రతి అడుగు కుటుంబ భవిష్యత్తు కోసమే ఉంటుంది అనడంలో ఆశ్చర్యంలేదు.

  ధనుస్సు: నవంబర్ 23 – డిసెంబర్ 22

  ధనుస్సు: నవంబర్ 23 – డిసెంబర్ 22

  మీ ఆశావాద దృక్పదం, ఆలోచనా విధానం ఎప్పుడూ సరైనవిగానే ఉంటాయి. మీరు ఎక్కువగా ఉత్సాహభరితoగా ప్రవర్తిస్తుంటారు. తద్వారా మీ చుట్టూ మీ ప్రియమైనవారి సమూహం ఉంటుంది. ప్రతి విషయమునందు మంచిని చూసేలా ఉండే మీ ఆలోచన ఉత్తమంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామి మాటలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చేవారిలా ఉంటారు. తద్వారా వారి మనసుకు దగ్గరవుతుంటారు.

  మకరం: డిసెంబర్ 23 – జనవరి 20

  మకరం: డిసెంబర్ 23 – జనవరి 20

  మీలోని ఆత్మ స్థైర్యం మీభాగస్వామిని ఆశ్చర్యగొలిపేలా ఉంటుంది. ముఖ్యంగా మీ సంబంధాలయందు ముఖ్యంగా మీ భాగస్వామి విషయములయందు ఉత్తమమైన ఫలితాలనే పొందే విధంగా ఉంటారు. తద్వారా మీ సంబంధానికి పునాదిరాయిగా ఉంటూ, ఎల్లప్పుడూ భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా అడుగులు వేసేవారై ఉంటారు.

  కుంభం: జనవరి 21 – ఫిబ్రవరి 18

  కుంభం: జనవరి 21 – ఫిబ్రవరి 18

  మీ నిజాయితీ, నిబద్దత మీ భాగస్వామిని ఆకర్షించేవిలా ఉంటాయి. సున్నితమైన మనసు కలిగిన వారై, భావోద్వేగాలతో నిండి ఉంటారు. భావోద్వేగాల ప్రదర్శనలో మిమ్ములను మించిన రాశి చక్రం మరొకటి లేదు. మీరు ప్రతి ఒక్క విషయము నందు పారదర్శక స్వభావాన్ని కలిగి ఉంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, నీతి నిజాయితీలకు ఎక్కువ విలువివ్వడం మీ లక్షణాల్లో ఉత్తమమైనవి.

  మీనం : ఫిబ్రవరి 19 – మార్చి 20

  మీనం : ఫిబ్రవరి 19 – మార్చి 20

  మీ భావప్రకటనా విధానం, సున్నితంగా ఉండే మనస్థితి వలన ఎటువంటి వ్యక్తి అయినా మీ పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. మీ ఆలోచనా విధానానికి ఎటువంటి సరిహద్దులూ ఉండకూడదన్న మీ వ్యక్తిత్వం అన్నిటా ఉత్తమ ఫలితాలనే కోరుకుంటుంది. తద్వారా ప్రణాళికలు వేయడంలో ముందు ఉంటారు. తద్వారా సమాజంలో కూడా మంచి గుర్తింపు ఉంటుంది.

  English summary

  Qualities Of Your Personality Which Can Attract Your Love Based On Your Zodiac

  Each of us have the best thing in us and what better way than understanding it with the help of our zodiac sign? Each zodiac sign has its own charm that attracts their soulmate to them. For example, if your zodiac sign is Capricorn, your stability is what drives your partner crazy. Find out what your zodiac sign has to reveal about your charming side
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more