వారంతా చనుబాలను ఏం చేస్తున్నారో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

ప్రతి తల్లి తన బిడ్డకు తన చనుబాలు ఇవ్వాలనుకుంటుంది. అయితే కొందరు తల్లులు మాత్రం తమ బిడ్డలతో పాటు తమ దగ్గర ఉన్న చనుబాలను తల్లిపాలకు నోచుకోని పసి బిడ్డలకు అందించాలనుకుంటారు. ఆ మాతృమూర్తులందరికీ వందనాలు. అమెరికాలోని ఒరెగాన్‌ రాష్ట్రం బేవెర్టన్‌కు చెందిన 30 ఏళ్ల అండర్సన్‌ సెయిర్రా ఇలా తల్లిపాలను చాలా ఎక్కువగా దానం చేసి అప్పట్లో ప్రపంచం అంతటా వార్తల్లో నిలిచారు.

వెండి క్రజ్-చాన్

వెండి క్రజ్-చాన్

అలాగే వెండి క్రజ్-చాన్ అనే మహిళ కూడా ఆ మధ్య తన పుట్టిన బిడ్డ మరణించినా కూడా తన తల్లిపాలను మరో ఆరుగురు శిశువులకు దానంగా ఇచ్చి అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఈ విషయాన్ని వెండి క్రజ్-చాన్ అనే మహిళ అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

వేల మంది తల్లులు

వేల మంది తల్లులు

అండర్సన్‌ సెయిర్రా, వెండి క్రజ్-చాన్ లాంటి విదేశీ మహిళలే కాదు మనదేశంలో కూడా కొన్ని వేల మంది తల్లులు బిడ్డలకు చనుబాలను దానం చేస్తున్నారు.

చనుబాలు చాలా మంచివి

చనుబాలు చాలా మంచివి

పసి పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ ఏర్పడే వరకు చనుబాలు పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయి. అయితే దురదృష్టవశాత్తు చాలా మంది పిల్లలు తల్లిపాలకు నోచుకోలేరు. ఇలాంటి వారందరికీ హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ బాగా ఉపయోగపడుతున్నాయి.

పాలు ఎక్కువగా పడతాయి

పాలు ఎక్కువగా పడతాయి

కొందరు తల్లులకు పాలు ఎక్కువగా పడతాయి. వాటిని ఆ తల్లులు పాలు పడని ఇతరుల పిల్లలకు దానం ఇస్తున్నారు. బ్రెస్ట్‌ పంప్‌ ద్వారా చనుబాలను సేకరిస్తారు.

హైదరాబాద్‌లో

హైదరాబాద్‌లో

హైదరాబాద్‌లో కూడా మదర్ మిల్క్ బ్యాంక్ ఉంది. బాలల హక్కుల సంఘం ఈ బ్యాంకును ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకులో సభ్యురాళ్ళుగా చేరే మహిళలు తల్లిలేని పిల్లలకు కొంతకాలం పాలు అందిస్తారు.

ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్

ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్

అలాగే హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలోని ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ కూడా ఉంది. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తెలంగాణ ఆరోగ్య శాఖ దీన్ని ఏర్పాటుచేసింది. ఈ మిల్క్ బ్యాంక్ కూడా చాలా మందికి బాగా ఉపయోగపడుతుంది.

బెంగళూరులో

బెంగళూరులో

ఇక బెంగళూరులో బ్రెస్ట్‌ మిల్క్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో

ఫోర్టిస్‌ లా ఫెమ్మె సంస్థతో కలిసి తల్లిపాల బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో మొదట తల్లిపాల బ్యాంకును అమారా సంస్థ ఏర్పాటు చేసింది. తర్వాత బెంగళూరులో ఏర్పాటు చేసింది.

ఒక ప్రక్రియ

ఒక ప్రక్రియ

అయితే ఈ తల్లిపాల బ్యాంకుల్లో సేకరించి చనుబాలను ఒక ప్రక్రియ కూడా ఉంటుంది. వాటిని పాశ్చురైజేషన్‌ ద్వారా శుద్ధి చేస్తారు. తల్లిపాలు ఇచ్చే తల్లులకు వివిధ పరీక్షలు నిర్వహించి ఎలాంటి రోగాలు లేకుంటేనే వారి నుంచి చనుబాలు తీసుకుంటారు.

ఈపాలను బిడ్డకు పట్టే ముందు

ఈపాలను బిడ్డకు పట్టే ముందు

అలాగే తల్లుల నుంచి సేకరించిన పాలను 64 డిగ్రీల టెంపరేచర్ వద్ద అరగంటపాటు పాశ్చురైజ్‌ చేస్తారు. తర్వా ప్యాక్‌ చేస్తారు. తర్వా 20 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నిల్వ చేస్తారు. ఈపాలను బిడ్డకు పట్టేముందు సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకు వచ్చి అందిస్తారు. ఈ పాలను డీప్‌ ఫ్రిజ్‌లో మూడు నెలలపాటు నిల్వ ఉంచుకోవొచ్చు.

ఇద్దరు పిల్లలకు

ఇద్దరు పిల్లలకు

అయితే తల్లిపాల బ్యాంకుకు చనుబాలను దానం చేయడం వల్ల తల్లులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాస్త ఆరోగ్యంగా ఉండే తల్లి తన బిడ్డతో మరో ఇద్దరు పిల్లలకు తన చనుబాలను ఇవ్వొచ్చు.

రోజూ చనుబాలను దానంగా

రోజూ చనుబాలను దానంగా

ఇక రాజస్థాన్‌ చాలా వరకు హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకులున్నాయి. వీటికి చాలా మంది తల్లులు రోజూ చనుబాలను దానంగా ఇస్తుంటారు. విదేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ విధానం మనదేశంలో మాత్రం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.

యోగా గురు దేవేంద్ర అగర్వాల్‌

యోగా గురు దేవేంద్ర అగర్వాల్‌

రాజస్థాన్ లో ప్రతీ సంవత్సరం అక్కడ జన్మిస్తున్న శిశువుల్లో దాదాపు 47 శాతం మంది సరైన పోషకాహారం అందక మరణిస్తున్నారు. ప్రముఖ యోగా గురు దేవేంద్ర అగర్వాల్‌ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ రాజస్థాన్‌లో ప్రారంభించిన తల్లిపాల బ్యాంకు బాగా విస్తరించింది. రాజస్థాన్‌లో ఇప్పటివరకు కొన్ని వేల మంది తల్లులు..కొన్ని లక్షల మిల్లీలీటర్ల పాలను దానం రికార్డ్ నెలకొల్పారు.

జీవన్‌ ధార పథకం

జీవన్‌ ధార పథకం

రాజస్థాన్‌ మాదిరిగా దేశంలోని మిగతా ప్రాంతాల్లో మదర్స్‌ మిల్క్‌ బ్యాంకులు అంతగా ఏర్పాటు కాలేదు. జైపూర్‌లోని మహిళా చికిత్సాలయంలో తల్లిపాల బ్యాంకు నార్వేకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో రాజస్థాన్‌ ప్రభుత్వం జీవన్‌ ధార పథకం పేరిట నిర్వహిస్తోంది. ఇది కూడా చాలా బాగా పని చేస్తోంది.

పుదుచ్చేరిలో

పుదుచ్చేరిలో

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ యూనివర్సిటీ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్ మర్) ఆసుపత్రిలో కూడా తల్లిపాల బ్యాంకును ఏర్పాటు చేశారు. దేశం మొత్తం కూడా ఇలా మదర్ మిల్క్ బ్యాంకులు ఏర్పాటు చేస్తే వాటికి చనుబాలు దానంగా ఇవ్వడానికి లక్షలాది మంది తల్లులు రెడీ ఉన్నారు.

English summary

rajasthan has emerged as a leading state in mother milk banking

rajasthan has emerged as a leading state in mother milk banking
Story first published: Wednesday, March 14, 2018, 16:00 [IST]