For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిజ జీవిత గాధలు: ఈ పిల్లలు “ఘోస్ట్ బాయ్స్” : కానీ నిజానికి ఎవరు ఘోస్ట్స్?

|

ఈ మద్య కాలంలో మీరు తెలుసుకున్న వింతైన కథ ఏమిటి? చాలానే ఉండుంటాయి. ఇప్పుడు ఈ కథ గురించి తెలుసుకుందాం. జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి, జీవితానికే అర్ధం తెచ్చేలా. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, కొన్ని చిన్నిచిన్ని అనుభవాలను పొందగలిగిన అద్భుత అవకాశాన్ని మనకు జీవితం ప్రసాదించింది అని.

ఈవ్యాసం భారతదేశంలోని 'ఘోస్ట్ బాయ్స్' గా పిలువబడిన ఇద్దరు పిల్లల గురించినది. ఒక ఎన్.జీ.ఓ వారిపట్ల సరైన పాత్ర పోషించకపోయి ఉంటే, ఈ బాలురు వారి చుట్టూ ఉన్న ప్రపంచం నుండి దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా వచ్చేవి.

స్పష్టంగా, ఇద్దరు అబ్బాయిలను 'ఘోస్ట్ బాయ్స్' అని పిలిచేవారు. దీనికి కారణం వారు రాక్షస దంతాలను మరియు భయంగొలిపే జుట్టును కలిగి ఉండడమే. కానీ ఎన్.జీ.ఓ పుణ్యమా అని, చివరికి వారు వారి గ్రామాలలో నివసించుటకు అర్హత సాధించారు.

Real Life Story Of The ‘Ghost Boys Of India

అసలు ఏంటీ “ఘోస్ట్ బాయ్స్” కథ :

తలుపుల వెనుకనే 11 సంవత్సరాలు గడిపిన దీనుల వ్యధ ఈ “ఘోస్ట్ బాయ్స్”

అష్ఫాక్ మరియు ముస్తాక్ ఖాన్ ఇద్దరు పిల్లలు, 11 మరియు 8 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. వారి వైద్య పరిస్థితి కారణంగా బయటకు రాలేని పరిస్థితుల్లో ఆ పిల్లలు గోడల వెనుకనే తమ జీవితాన్ని దాచిపెట్టేవారు. వారు ఇతరుల సూటిపోటి మాటలకు, చీత్కారాలకు భయపడే ఇలా దాక్కోవలసిన పరిస్థితి ఉండేది. ప్రపంచంలో ఎక్కడ కూడా, తమ లోపాలను కప్పి పుచ్చే ప్రయత్నంలో భాగంగా ఇతరులను హీనంగా చూడడం అనేక మందికి ఉన్న అలవాటు. కానీ ఆ అలవాటు మితిమీరి ఇతరుల అవయవ లోపాలను సైతం కించ పరుస్తూ పైశాచిక ఆనందాన్ని పొందే మనుషులు కూడా లేకపోలేదు. దారుణం ఏంటి అంటే వాళ్ళే ఎక్కువగా గెలుస్తున్నారు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో నెలకొన్న రోజున, ఎన్.జి.ఓ ల అవసరం కూడా ఉండదు.

ఈ పిల్లలకు అరుదైన జన్యు సంబంధిత వ్యాధి ఉంది :

ఈ పిల్లలు హైపోహైడ్రోటిక్ ఎక్టోడెర్మల్ డైస్ప్లాసియా (హెచ్.ఈ.డి) అని పిలవబడే అరుదైన జన్యుపరమైన వ్యాధిని కలిగి ఉన్నందుకు జనాలు పెట్టిన పేరు "ఘోస్ట్ బాయ్స్". ఎంత హీనమైన చర్యనో చూడండి.

వారి పరిస్థితి గురించి:

ఈ పరిస్థితిలో మానవ శరీరానికి చెమట పుట్టే సామర్థ్యాన్ని కోల్పోతుంది, మరియు అదుపు తప్పిన దంతశ్రేణి కలిగి ఉంటుంది. ఈ పరిస్థితిలో బాధపడుతున్న వ్యక్తులు జుట్టును కూడా కోల్పోతారు.

ఈ పరిస్థితిని గురించిన మరికొన్ని వివరాలు:

ఈ అరుదైన పరిస్థితి కారణంగా, చమట పట్టని తత్వం కారణంగా, పిల్లల శరీరం త్వరగానే వేడికి గురవుతూ ఉంటుంది; అందువల్ల, వీరు సేద తీరడానికి అరగంటకి ఒకసారైనా వీరిని నీళ్ళలో తడపవలసి ఉంటుంది.

గ్రామస్తులు వెలివేశారు :

వీరు జన్యు పరమైన లోపాలతో భాధపడుతున్నా, ధైర్యవంతులు. వీరు దంత శ్రేణి సరిగ్గా లేని కారణంగా మరియు మరికొన్ని ఇతర కారణాల చేత, వీరిని కొన్ని ప్రాంతాలలో కులాలను వేలివేసినట్లు, వీళ్ళను కూడా వెలివేశారు. మనిషిని మనిషిగా చూడలేని సమాజం ఎక్కడో లేదని ఇలాంటివి దృష్టికి వచ్చినప్పుడే తెలుస్తుంది. నిధుల కొరత కారణంగా ఈ పిల్లలకు చికిత్స చేయలేకపోయారు.

కుటుంబాలు పేద నేపథ్యం నుండి వచ్చినందున, ఇలాంటి పరిస్థితులకు చికిత్స చేయటం అనేది ఒక కలే. ఎందుకంటే కుటుంబానికి ప్రైవేట్ చికిత్స కోసం వెచ్చించేoత స్థోమత లేదు. వైద్య సౌకర్యాలు కూడా కనీసం లేని మధ్యప్రదేశ్లోని మారుమూల గ్రామంలో నివసిస్తున్న వీరికి, వారి వైద్యుడు ముకేష్, వారి పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించాడు కూడా.

వారి తల్లి ఏదైనా అద్భుతం జరగకపోతుందా అని ఎదురు చూడసాగింది:

ఏదో సినిమాలో చెప్పినట్లు దాహమేస్తే ఆకాశం వంక, ఆకలేస్తే భూమి వంక చూసే కుటుంబాలు ఎక్కువగా ఉన్న మన దేశంలో, అద్భుతాలకోసం ఎదురు చూసే అభాగ్యులే ఎక్కువ. కాదంటారా? . అలాగే వారి తల్లి, అబిలా వారి పిల్లల కోసం అలాంటి ఆలోచనలే చేసేది. వారి వైద్య ఖర్చులు భరించలేని ఆకుటుంబం, దాతల ఆర్ధిక సహాయానికై ఎదురు చూడసాగింది.

వారి ఆశలకు, ఊతమిచ్చిన ఎన్.జి.ఓ :

చివరగా, ఒక స్థానిక ఎన్.జి.ఓ జోక్యం చేసుకుని, వారి పరిస్థితి గురించి గ్రామస్తులకు తెలియజేసింది. తద్వారా ఆ బాలురు స్వేచ్చగా ఊపిరి తీసుకోగలిగారు. స్పష్టంగా, NGO స్థానిక ప్రజలలో వారిగురించి అవగాహనా చర్యలు చేపట్టి, వారి పరిస్థితి దృష్ట్యా ఆర్ధిక సహాయానికై విరాళాలు సేకరించగలిగింది.

ఇప్పుడు అందరూ వారిని ఆదరిస్తున్నారు:

మనదేశంలో అంగవైకల్యంతో పుట్టిన వారిని దేవుళ్ళవలె, దెయ్యాల వలె భావించి పూజలు చెయ్యడమో లేక వెలివేయడమో ఇంకా వీలయితే చంపివేయడమో సాధారణంగా శతాబ్దాల కాలంగా వస్తూ ఉంది. కొన్ని మూడనమ్మకాలు ఇంతటి స్థితికి కారణం అవుతున్నాయి. కానీ వీటి గురించి పూర్తి అవగాహన వచ్చాక, కొందరు తెలివిగా ఆలోచించి వాస్తవిక పరిస్థితులను అర్ధం చేసుకుని మారగలుగుతున్నారు. అలా గ్రామస్తుల ఆలోచనలను మార్చడంలో ఈ ఎన్.జి.ఓ విజయవంతమైంది. తద్వారా వీరిని మరలా ఆ గ్రామస్తులు దగ్గరికి తీశారు.

ఒక అరుదైన పరిస్థితి నుండి సోదరులు బాధపడుతున్నారని గ్రామస్తులకు ఎన్.జీ.ఓ వెల్లడించిన వెంటనే, ప్రజలు బాలురను ఆదరించడం ప్రారంభించారు తద్వారా వారు తరగతులకు వెళ్ళడం కూడా ప్రారంభించారు. ఇంతకు ముందు వారిని అవహేళన చేసిన వారు, పరిస్థితిని అవగాహన చేసుకున్నాక ఆదరించడం, ఆ పిల్లలను మాటల్లో చెప్పలేని అనుభూతికి గురిచేసింది.

వారిప్పటికీ అలాగే ఉన్నారు, కానీ వారి పరిస్థితికి భాద పడడం లేదు :

ఆ పిల్లలు ఇప్పటికీ ఈపరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ, వారు తమకు ప్రసాదించిన జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉన్నారు. వారు కొందరు స్నేహితులను కలిగి ఉన్నారు, తెలిసో తెలియకో కొన్ని అధ్యయనాలకు సమాజంలో మార్పులకు, వారిలో చైతన్యం తీసుకువచ్చే దిశగా ముందుకు కదులుతున్నారు.

English summary

Real Life Story Of The ‘Ghost Boys' Of India

Two young siblings have been suffering from a disease which can cause missing teeth and flat noses. Until the recent times, the brothers, aged 11 and 8, have been treated as outcasts for a long time. But when a local NGO intervened, and explained to the locals about their condition, they now understand their condition and accept them.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more