Latest Updates
-
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా?
ఆన్లైన్ డేటింగ్ వికృత రూపo : రక్తంలో స్నానం చేస్తానంటున్న మహిళ
ఆన్లైన్ డేటింగ్ వికృత రూపo : రక్తంలో స్నానం చేస్తానంటున్న మహిళ
నీ రక్తంలో స్నానం చేస్తానంటున్న మహిళ, ఆన్లైన్ డేటింగ్ వికృత రూపాలకు ప్రధాన సాక్ష్యం ఈ కథనం.
ఎప్ప్పుడైనా ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్లలో ఊహించని అనుభూతిని లేదా పరిస్థితిని ఎదుర్కొన్నారా ? చెడు ఆలోచనల నుండి, బాడ్ డేట్ వరకు ఎన్నో ఈ ఆన్లైన్ డేటింగ్ లో ఎదురయ్యే పరిస్థితులుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే సందర్భంలో అన్ని పరిమితులను దాటి మరో కొత్త కోణం కనిపిస్తూ ఉంది!

ఇది 65,000 సందేశాలు పంపి, ఒక వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసిన ఒక చిత్త చాపల్యం కలిగిన ఒక మహిళ యొక్క కథనం. మరియు ఈ మెసేజుల్లో తనని పట్టించుకోకుండా వదిలేసిన పక్షంలో అదేదో హాలీవుడ్ సినిమాలో చూపినట్లు అతని రక్తంలో స్నానం చేస్తానని బెదిరించిoది.
ప్రేమించిన వ్యక్తి రక్తంలో స్నానం చేస్తానని 65 వేల మెసేజులు పంపి అతన్ని భయభ్రాంతులకు గురిచేసిన మహిళ గురించిన మరింత సమాచారం తెలుసుకోండి :

నివేదిక ప్రకారం,
నివేదిక ప్రకారం, ఒక ఆన్లైన్ డేటింగ్ సైట్ లో ఈమహిళ ఆ వ్యక్తిని కలుకుంది. తర్వాత ఇద్దరిమద్య అనేక పోలికలు, అలవాట్లు, సారూప్యతలు ఉన్నట్లుగా గమనించింది. పుట్టిన రోజు కూడా ఒకటే కావడం, ఇద్దరూ శాకాహారులు కావడం కూడా విశేషంగా తోచింది. తద్వారా అతని పట్ల ఆసక్తిని పెంచుకుంది. అదే ఇంతటి పరిస్థితికి కారణమవుతుందని, ఇంత తీవ్ర రూపాన్ని దాలుస్తుందని అనుకోలేదని అతను వాపోతున్నాడు.

తన ప్రేమను కనుగొన్నానని ఆమె భావన :
ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం, తనను తాను "ప్రేమను కనుగొన్న" వ్యక్తిగా పేర్కొంది. అన్ని సరిపోయే విధంగా ఉన్న వ్యక్తిని కనుగొనడం మాత్రమే ప్రేమను కనుగొనడం కాదు, ప్రేమ అనేది ఒక ప్రయాణం అని చెప్తుంది. తాను అనుభూతికి లోనైనంతగా ఈ ప్రపంచంలో మరెవరూ అనుభూతికి లోను కాలేరని, ఇలా అంటున్నందుకు తనను మిగిలిన ప్రజలందరూ క్షమించాలని చెప్తుంది కూడా.

అసలు ఆమె మెసేజెస్ లో ఏం రాసింది :
ఆ 65,000 మెసేజుల్లో భాగంగా "నీ రక్తంతో నేనేం చేయగలను! ... నాకు నీ రక్తంలో స్నానం చేయాలని ఉంది." అంటూ మెసేజ్ పెట్టింది. దీనికి కారణం అతను మాట్లాడక పోవడం, ఆన్లైన్ కాంటాక్ట్ కు దూరంగా ఉండడమే. అతను దూరమవడం సహించలేని ఈ మహిళ అత్యంత మానసిక ప్రభావానికి క్రమంగా మనోవైకల్యానికి లోనై అతనికి మెసేజులు చేయడం ప్రారంభించింది. అతను కనీసం స్పందించకపోవడం వలన, మెసేజులు తీవ్ర రూపం దాల్చాయి. ఇలాంటి పరిస్థితులు తరచుగా అనేకమంది ఎదుర్కుంటూనే ఉంటారు. ఒక్కోసారి అవి తీవ్ర రూపాన్ని దాలుస్తుంటాయి కూడా.

నేను తక్కువ సందేశాలను పంపాను :
ఎందుకు అతనికి అన్ని సందేశాలను పంపారని ప్రశ్నించినప్పుడు, అతను నన్ను వదిలి వెళ్ళడం నేను తట్టుకోలేను, అతన్ని అంత ఘాడంగా ప్రేమించాను. అందుకే మెసేజెస్ పంపాను అని సమాధానం ఇచ్చింది. మరియు అన్ని మెసేజులు తాను పంపలేదని కూడా చెప్తుంది.

ఆమె అతనితో పీకల్లోతు ప్రేమలో ఉంది!
అతని పట్ల ఉన్న ప్రేమతో, అతను ఇంట్లో లేనప్పుడు అతని ఇంటికే వెళ్లి, బాత్ టబ్లో స్నానమాచరిస్తూ దొరికింది. ఆ తర్వాత పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల నివేదిక ప్రకారం, ఒక పెద్ద కసాయి వాని కత్తి లాంటి ఆయుధాన్ని ఆమె కార్లో పాసెంజర్ సీట్లో కనుగొన్నారు. అనుమానాలు బలపడడంతో ఆవిడని అరెస్ట్ చేయక తప్పలేదు.

తనకే తప్పు తెలియదoటుంది :
ప్రస్తుతానికి పోలీసు కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్న ఆ మహిళ, ప్రేమించడం తప్ప తనకే తప్పూ తెలియదని, ఎందుకిలా నిందలు వేసి తనను వేధిస్తున్నారని వాపోతూ ఉంది.
ముక్కూమొహం తెలీని వ్యక్తులతో పరిచయం, కొత్త ప్రమాదాలకు దారితీస్తుంది అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి. తప్పొప్పులు ఎవరివో తేలనప్పటికీ రెండు జీవితాలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డాయి. కావున అపరిచిత వ్యక్తులతో స్నేహాలు సావాసాలు అంత మంచివి కాదని తెలుసుకోండి.
ఈ కథనం గురించిన మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications