రూపాలి చిరుతనే వేటాడి సెల్ఫీ తీసుకుంది.. అందుకే ఇప్పటికీ వైరల్

Written By:
Subscribe to Boldsky

అమ్మాయిలు సాధారణంగా బుంగమూతి పెట్టి సెల్ఫీలు దిగుతుంటారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందిస్తుంటారు. కానీ కొందరు అమ్మాయిలు మాత్రం సాహసాలు చేసి సెల్ఫీలు దిగుతారు. అలాంటి అమ్మాయే ఈమె. ఆమె పేరు రూపాలి మేష్రామ్‌.. వయస్సు 23. కానీ గుండెలో మాత్రం టన్నుల కొద్దీ ధైర్యం ఉంది.

మేకలు పెంచుకుంటోంది

మేకలు పెంచుకుంటోంది

మహారాష్ట్రలోని సాకోలి తాలుకా పరిధిలోని ఉస్ గావ్‌లో జీజాబాయి మేకలు పెంచుకుంటోంది. ఆమె కుమార్తనే రూపాలీ.కొన్ని రోజుల క్రితం మేకలను కట్టేసిన ప్రాంతంలో అలజడి రేగింది. మేకలు మొత్తం అరుస్తూ అల్లాడిపోతున్నాయి. దీంతో రూపాలి మేకలు ఉన్న దగ్గరకు వెళ్లింది.

చంపి తింటూ కూర్చొంది

చంపి తింటూ కూర్చొంది

మేకలపై చిరుతపులి దాడి చేసి అన్నింటినీ గాయాలపాలు చేసింది. ఒక మేకను చంపి తింటూ కూర్చొంది చిరుత. రూపాలి వెంటనే కర్ర తీసుకుని చిరుతపై దాడి చేసింది. రూపాలి గట్టిగా కేకలు వేయడంతో రూపాలి తల్లి జీజాబాయిని బయటకు వచ్చితంది.

కర్ర తీసుకుని కొట్టింది

కర్ర తీసుకుని కొట్టింది

తర్వాత చిరుత జీజాబాయిపై దాడి చేయడంతో తల్లిని నుంచి రక్షించుకునేందుకు ప్రాణాలకు సైతం తెగించి పోరాడింది రూపాలి. చిరుతను కర్ర తీసుకుని కొట్టింది. రూపాలి దాదాపు 15 నిమిషాల పాటు పోరాటం చేసింది.

రక్తంతో ఎర్రబడిపోయింది

రక్తంతో ఎర్రబడిపోయింది

ఈ క్రమంలో చిరుత రూపాలిపై దాడి చేసింది. ఆమెకు గాయాలయ్యాయి. ముఖం అంతా రక్తంతో ఎర్రబడిపోయింది. అయినా భయపడకుండా పోరాడి తన తల్లిని రక్షించుకుంది. తర్వాత నెమ్మదిగా జీజాబాయ్, రూపాలి ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకుని గడియపెట్టకున్నారు.

చిరుత వెనుదిరిగింది

చిరుత వెనుదిరిగింది

వారు ఇంట్లోకి వెళ్లిన కూడా చిరుత చాలా సేపు అక్కడే ఉంది. గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులంతా రూపాలి ఇంటి దగ్గరకు రావడంతో చిరుత వెనుదిరిగి వెళ్లిపోయింది.

ఆస్పత్రికి తీసుకెళ్లారు

ఆస్పత్రికి తీసుకెళ్లారు

తీవ్రంగా గాయపడిన రూపాలిని, ఆమె తల్లిని స్థానికులు ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగ్ పూర్ లోని ఆస్పత్రికి రూపాలిని తరలించారు.

అందరూ మెచ్చుకున్నారు

అందరూ మెచ్చుకున్నారు

ఆస్పత్రి నుంచి రూపాలి డిశ్చార్జ్ కావడంతో ఈ విషయ వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లికోసం చిరుతతో పోరాడిన రూపాలి ధైర్య సాహసాలను ఇప్పుడు అందరూ మెచ్చుకున్నారు.

విజయం గర్వం

విజయం గర్వం

ఇక తీవ్రంగా గాయపడిన సమయంలోనేరూపాలీ తన తల్లితో కలిసి ఒక సెల్ఫీ దిగింది. చిరుత నుంచి తన తల్లిని కాపాడాననే విజయం గర్వం.. చిరుతపై దాడి చేశాననే భావనతో ఈమె సోషల్ మీడియాలో పెట్టిన ఈ ఫొటో చాలా రోజుల నుంచి వైరల్ అవుతూనే ఉంది.

Image Credit

English summary

rupali meshram young woman fights off tiger with a stick after it attacked her goat

rupali meshram young woman fights off tiger with a stick after it attacked her goat
Story first published: Monday, April 9, 2018, 9:48 [IST]