ఆ విషయం తెలిస్తే తేలు విషాన్ని మీరు అస్సలు వదలరు

Written By:
Subscribe to Boldsky

తేలు కుడితే ఒక నిమిషంలో దాని విషం ఒళ్లంతా పాకి ఎంతటి మనిషినైనా సతమతం చేస్తుందనే విషయం అందిరికీ తెలిసిందే. ఇక తేలుకాటు ప్రాణానికి కూడా ప్రమాదకరం. కొన్ని తేళ్ల విషాలు నాడుల్ని దెబ్బతీసి నాలుగు గంటల్లో మనిషిని చంపేయగల శక్తి కలిగి ఉంటాయి. కానీ తేలు విషంతోనూ కొన్ని లాభాలున్నాయి.

కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులు

చాలామంది కీళ్ల నొప్పుల సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. అడుగుతీసి అడుగు వేయాలంటే చాలా కష్టపడుతుంటారు. ఇలాంటివారికి ఇప్పుడొక శుభవార్త.

తేలు విషం

తేలు విషం

తేలు విషం రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుందట. పైగా ఎటువంటి దుష్ఫలితాలు కూడా ఉండవట.

రుమటాయిడ్ ఆర్థరైటిస్

రుమటాయిడ్ ఆర్థరైటిస్

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని ఆటోఇమ్యూన్ డిసీజ్‌గా అని కూడా అంటారు. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థలో ఏర్పడిన లోపాల కారణంగా శరీరంలోని కణాల మీద నిరంతరాయంగా దాడి చేస్తుంటుంది. అందువల్ల రకరకాల అనారోగ్యాలు కలుగుతాయి. వాటిలో ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్.

వంశపారంపర్యంగా

వంశపారంపర్యంగా

ఈ సమస్య ఒక్కోసారి వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. జ్వరం, ఆకలి మందగించడం, నోరు ఎండిపోయినట్టు అనిపించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. జ్వరం వస్తుంటుంది. తీరని అలసటగా ఉంటుంది.

కీళ్లు బిగుసుకోవడం

కీళ్లు బిగుసుకోవడం

మొదట్లో కాళ్లు, చేతుల వేళ్ల వంటి చిన్నకీళ్లు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతాయి. కీళ్లు బిగుసుకోవడం వల్ల ఉదయం వేళల్లో బాధ ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో రోజంతా కూడా ఉండొచ్చు. కొంత కాలానికి కీళ్ల రూపం మారిపోయి వికృతంగా మారుతాయి.

కీళ్లవాతం

కీళ్లవాతం

అలాగే కీళ్లలో ఉండే ఫైబ్రోబ్లాస్ట్‌ లైక్‌ నైనోవియోసైట్స్‌ కణాలు, రోగనిరోధక కణాలను ఆకర్షించి నొప్పులకు గురిచేస్తాయి. దాంతో కీళ్లవాతం వస్తుంది. దాన్ని తగ్గించేందుకు తేలు విషంలో ఉండే ఐబెరియోటాక్సిన్‌ అనే సమ్మేళనం బాగా దోహదపడుతుందట.

సత్ఫలితాలనిచ్చాయి

సత్ఫలితాలనిచ్చాయి

ఇప్పటికే జంతువులపై చేసిన పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయని అమెరికాలోని బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు.

వ్యాధి ఎక్కువగా కావడానికి

వ్యాధి ఎక్కువగా కావడానికి

ఫైబ్రోబ్లాస్ట్‌ లైక్‌ సినోవైయోసైట్స్‌(ఎఫ్‌ఎల్‌ఎస్‌) కణాలు ఈ వ్యాధి ఎక్కువగా కావడానికి దోహదం చేస్తాయి.

కీళ్లు దెబ్బతింటాయి

కీళ్లు దెబ్బతింటాయి

ఈ కణాలు పెరిగి.. ఒకచోటు నుంచి మరోచోటుకు కదిలినప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఈ కణాల కారణంగానే కొన్నిసార్లు కీళ్లు దెబ్బతింటాయి.

పొటాషియం కంపోనెంట్‌

పొటాషియం కంపోనెంట్‌

ఈ కణాలు రోగనిరోధక శక్తి కలిగించే కణాలను కూడా ఆకర్షించి, నాశనం చేస్తాయి. అయితే తేలు విషయంలో ఉండే పొటాషియం కంపోనెంట్‌ ఎఫ్‌ఎల్‌ఎస్‌ కణాలను నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా ఇతర కణాలకు ఎటువంటి హాని కలగకుండానే వ్యాధి నయమవుతుంది.

1.3 మిలియన్ మందికి..

1.3 మిలియన్ మందికి..

డాక్టర్ క్రిస్టిన్ బీటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్టడీలో 1.3 మిలియన్ మందికి తేలు విషంతో వృద్ధాప్య కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్) సమస్య తీరిందట. కీళ్లవాతం అనుబంధ వ్యాధులను సైతం తగ్గించేందుకు అనువుగా ఈ విషాన్ని ఔషదంగా మార్చుకోవచ్చు అట.

కీళ్లవాతం తగ్గించే ఔషధాలు

కీళ్లవాతం తగ్గించే ఔషధాలు

అలాగే తేలు విషంలో ఉన్న ఐబెరియోటాక్సిన్ అనే కాంపోనెంట్ కీళ్లవాతానికి కారణమయ్యే కణాలను నియంత్రిస్తుంది అట. ఇక రానున్న రోజుల్లో తేలు విషంతో కీళ్లవాతం తగ్గించే ఔషధాలు మార్కెట్లోకి వస్తాయి.

చంపకండి

చంపకండి

అందువల్ల ఇప్పటి నుంచి తేళ్లు కనపడితే చంపకండి. వాటి వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయి కాబట్టి వాటిని కాపాడండి.

English summary

scorpion venom component may boost treatment for rheumatoid arthritis

scorpion venom component may boost treatment for rheumatoid arthritis
Story first published: Friday, March 2, 2018, 15:30 [IST]