For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పెన్షన్ కు కక్కుర్తి పడి.. చనిపోయిన అమ్మ పాలు తాగుతుందని చెప్పిన నీచపు కుమారులు

  |

  అమ్మ అంటే ఈ అవనిలో ప్రతి ఒక్కరికీ ఇష్టమే. అయితే అమ్మలేదని కొందరికి బాధ. అమ్మ ఉందని మరికొందరికి వ్యధ. ఎంతటి వ్యత్యాసం.. ఎంతటి దౌర్భాగ్యం. అమ్మలేని కొందరి జీవితాలను పరిశీలిస్తే కళ్లలో నీళ్లు ఘనీభవించి కళ్లు మసకబారిపోతాయి. అమ్మ వున్న కొందరి ఉన్మాదుల జీవితాలను చూస్తే గుండె రగిలిపోతుంది. ఇంతటి ఘోరాతి ఘోరమా అని రక్తం ఉడికిపోతుంది.

  సంవత్సరానికి 70 లక్షల రూపాయలు

  సంవత్సరానికి 70 లక్షల రూపాయలు

  రెండేళ్ల క్రితం అమెరికాలో అమ్మ సేవలకు గంటల ప్రకారం లెక్కలు కట్టారు. ఆమె సేవలకు కట్టిన విలువ ఎంతో తెలుసా? సంవత్సరానికి అక్షరాలా 70 లక్షల రూపాయలు అని తేల్చారు. అంటే నెలకు ఐదు లక్షలన్నమాట. కాని బిడ్డకు పెన్నిధి లాంటి అమ్మ ప్రేమకు వెలకట్టడం హరిహర బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు.

  అమ్మ ప్రేమ లభిస్తే..

  అమ్మ ప్రేమ లభిస్తే..

  అమ్మతో మంచి అనుబంధం ఉన్న పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. మెదడులో వుండే హిప్నోకాంపస్ అనే భాగం మన జ్ఞాపకశక్తికీ, తెలివితేటలకూ, ఒత్తిడిని తట్టుకునే శక్తికీ ఆధారభూతమైంది. అమ్మ ప్రేమ లభించేవారిలో అది దాదాపు పదిశాతం

  పెద్దదిగా ఉన్నట్లు తేలింది.

  అమ్మ స్పర్శ గొప్పది

  అమ్మ స్పర్శ గొప్పది

  అక్కున చేర్చుకొని తల నిమురుతూ నుదుట ముద్దు పెట్టుకునే అమ్మ అద్భుతమైన స్పర్శ ఎంత గొప్పది. అంతటి అనుభూతిని భావవ్యక్తీకరణ చేయడానికి పదాలు దొరుకునా, అమ్మ గురించి రాయడానికి కలం కదులునా, అమ్మ యావత్ విశ్వమండలమంతా వెలిగే అఖండ ప్రేమ జ్యోతి అని తెలుపుటకు స్థాయి సరిపోవునా? వీచే చల్లని గాలిలో అమ్మ పలకరింపులు పున్నమినాటి చంద్రుని కాంతిలో అమ్మ దీవెనల వెలుగులు ఇలా అమ్మను వర్ణించుటకు భాష సరిపోవునా?

  అమ్మలేని జీవితం శూన్యమే

  అమ్మలేని జీవితం శూన్యమే

  అమ్మ ఉన్నంత కాలం తన విలువ తెలియదు. తను శాశ్వతంగా దూరమైతే తెలుస్తుంది నిజమైన ఒంటరితనం. ఆ ప్రభావం మనిషిని మనసుని ఏవిధంగా ఎంతలా దుఃఖించేలా చేస్తుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. నలుగురిలో ఎలా బతకాలో నేర్పిన అమ్మ పాఠాల మాటలు పిలుపే అందని దూరాలలో, వెతికినా దొరకక చూసిన కనపడక, తిరిగిరాని లోకాలకు అమ్మ ప్రయాణమైతే ఆ ఇల్లు దీపం వెలుగుతూ కనపడినా జీవ కళ లేని అంధ గృహమే కదా. భగవంతుడు లేని చీకటి దేవాలయమే కదా ఎంత బలం బలగం వున్నా ఏమి? అమ్మలేని జీవితం శూన్యమే కదా.

  దారం తెగిన పతంగివలె

  దారం తెగిన పతంగివలె

  దేవత లాంటి అమ్మను అందరికీ ఇచ్చిన భగవంతుడు కొందరు పిల్లలు ఎదిగి ప్రయోజకులయ్యే వయసులో అకారణంగా అమ్మను తన వద్దకు తీసుకొని వెళ్లిపోతుంటాడు, గతి తప్పిన గమ్యాలై గూడు చెదిరిన పక్షులవలె అందరు వున్నా అనాథలుగా మిగిలిపోతుంటారు. అమ్మను దూరం చేసి గమ్యమెరుగని ప్రయాణం చేయమంటే చిన్ని గుండెలు ఎలా తట్టుకొనగలవు. ఇది వారి నుదుట రాసిన కర్మ ఫలమా లేక విధి ఆడే వింత వినోద నాటకంలో పాత్రలమా, ఇలా ఎందరో మరెందరో అభాగ్యుల జీవితాలు అమ్మ ప్రేమ, అమ్మ తోడు లేక దారం తెగిన పతంగివలె చెట్టుకో పుట్టకో చిక్కి చెదిరిపోవాల్సిందేనా.

  అమ్మ చిరుకోపం మెరిసే మేఘం

  అమ్మ చిరుకోపం మెరిసే మేఘం

  అమ్మకు సరిసాటి రాగల వారెవరు. అమ్మ చూపే కల్మషమెరుగని ప్రేమను ఈ లోకంలో ఎవరు చూపగలరు.. అమ్మలేని ప్రతి ఒక్కరి హృదయంలో కలిగే ఆవేదనను ఎవరు ఓదార్చగలరు.. అమ్మ వదనం ప్రశాంత నందనవనం, అమ్మ హృదయం సూర్యచంద్రులు దాగిన నీలాకాశం, అమ్మ చిరుకోపం మెరిసే మేఘం, కురిసే వర్షం, అమ్మ లేని జీవితం నిశిరాత్రి చీకటి శ్మశానం.

  అమ్మకు పట్టెడు అన్నం పెడుతున్నారా?

  అమ్మకు పట్టెడు అన్నం పెడుతున్నారా?

  ఇక జన్మనిచ్చి పెంచిన అమ్మకు పట్టెడు అన్నం పెడుతున్నారా? అంటే చాలా మంది అమ్మను సరిగ్గా చూసుకోవడం లేదనే తెలుస్తోంది.

  నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని నీచమైన పదాలతో దుర్భాషలాడుతుంటారు కొందరు. మరికొందరు మానసికంగా హింసలు పెడుతూ వెట్టిచాకిరీ చేయిస్తూ ఆవేశంతో చేయి చేసుకుంటుంటారు. చివరికి తల్లిని మెడపట్టి గడప బయటకు తోసేస్తుంటారు.

  అంతస్తుల మీద నుంచి తోసేయడం

  అంతస్తుల మీద నుంచి తోసేయడం

  సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేలా దిగజారిపోతున్నారు ఏమి ఈ దౌర్భాగ్యం. వృద్ధులైన తల్లులకు సేవ చేయలేని దుర్మార్గులు అడవులలో వదలడం, అంతస్తుల మీద నుంచి తోసేయడం ఇలా కనపడకుండా హత్యలు చేస్తున్నారు. కొందరు వృద్ధాశ్రమంలో వదిలి దిక్కులేనివారిగా చేస్తున్నారు. అయినప్పటికీ సహన ధారిణి బహుపాత్ర రూపిణి అయిన అమ్మ ఎన్ని బాధలు, అవమానాలు పడినా తన చివరి శ్వాస వరకు కన్న బిడ్డలపై ఎనలేని మమకారం చూపుతూనే ఉంటుంది.

  కన్నతల్లి చనిపోతే

  కన్నతల్లి చనిపోతే

  కన్నతల్లి చనిపోతే కళ్లనిండా నీరుగారుస్తారు ఎవరైనా. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి కొడుకులుగా పుట్టినందుకు తమ రుణం తీర్చుకుంటారు. కానీ తల్లి చనిపోయినా ఆమెకు వచ్చే పింఛన్‌పై కన్నేసిన ఆ కసాయిలను చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ నలుగురు సుపుత్రులు అమ్మ మృతదేహాన్ని​ ఐదు నెలలపాటు ఇంట్లోనే పెట్టుకున్నారు. చివరికి విషయం బయటపడడంతో జైలు పాలయ్యారు.

  అమరావతి దేవి

  అమరావతి దేవి

  వారణాసిలోని కబీర్‌ నగర్‌కు చెందిన అమరావతి దేవి(70)కి ఐదుగురు కొడుకులు, ఒక కుమార్తె. ఆమె తన నలుగురు కుమారులు, కుమార్తెతో కలిసి ఒకే చోట నివాసం ఉండేంది. ఒక కొడుకు మాత్రం వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

  రూ.13000 పింఛన్‌

  రూ.13000 పింఛన్‌

  కొద్ది రోజుల క్రితం కస్టమ్స్‌ శాఖలో ఉద్యోగం చేస్తున్న అమరావతి భర్త చనిపోయాడు. దీంతో ఆమె నెలకు రూ.13000 పింఛన్‌ తీసుకుంటుంది. ఈ ఏడాది జనవరిలో అమరావతి దేవి ఆరోగ్యం క్షీణించడంతో నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. దీంతో జనవరి 13న అమరావతి కన్నుమూశారు.

  కోమాలోకి వెళ్లిందని అబద్దం చెప్పి

  కోమాలోకి వెళ్లిందని అబద్దం చెప్పి

  మొదట ఆమె మరణాన్ని కుటుంబ సభ్యులు ప్రకటించారు. కానీ అంతలోనే చిన్నకుమారుడు అమ్మ చేతులు కదులుతున్నాయని చెప్పి చనిపోలేదని కోమాలోకి వెళ్లిందని అబద్దం చెప్పారు. దీంతో ఆమె శవాన్ని ఇంట్లోనే ఉంచి వాసన రాకుండా రసాయనాలు చల్లారు. ఆమె పేరు చెప్పి ప్రతి నెల పింఛన్‌ డబ్బులు డ్రా చేసుకున్నారు.

  రోజూ పాలు తాగుతుంది

  రోజూ పాలు తాగుతుంది

  ఇదంతా గమనించిన ఓ వ్యక్తి పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఆ కొడుకులంతా కటకటాల పాలయ్యారు. బాగోతం అంతా బయటపడ్డాక కూడా

  తమ తల్లి కోమాలోకి వెళ్లిందని, రోజూ పాలు తాగుతుందని అమరావతి దేవి కొడుకొకరు చెప్పడం గమనార్హం.

  పెన్షన్ కు కక్కుర్తి పడ్డ కసాయి కొడుకుల్లారా

  పెన్షన్ కు కక్కుర్తి పడ్డ కసాయి కొడుకుల్లారా

  అమ్మకు ఐదు నెలల పాటు అంతిమసంస్కారాలు నిర్వహించకుండా... ఆమె పెన్షన్ కు కక్కుర్తి పడ్డ కసాయి కొడుకుల్లారా మీలాంటి వారిన ఏమనాలో ఎవరికీ తెలియడం లేదు. ఇక వీరిపై సోషల్ మీడియాలో కామెంట్స్ దారుణంగా వస్తున్నాయి. ఇలాంటి నీచపు కుమారులు ఏ అమ్మకు పుట్టుకూడదని అందరూ పేర్కొంటున్నారు.

  English summary

  sons preserve mothers body with chemicals for 5 months to draw pension

  sons preserve mothers body with chemicals for 5 months to draw pension
  Story first published: Friday, May 25, 2018, 13:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more