టాలీవుడ్ అయిపోనట్లుంది తమిళ హీరోలు, దర్శకులే శ్రీరెడ్డి టార్గెట్, రోజాపూలు హీరోపై దారుణంగా పోస్ట్

ఐదేళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు శ్రీకాంత్ (శ్రీరామ్)వచ్చాడని తన ఎఫ్బీలో పోస్ట్ పెట్టింది. టాలీవుడ్ అయిపోనట్లుంది తమిళ హీరోలు, దర్శకులే శ్రీరెడ్డి టార్గెట్, రోజాపూలు హీరో.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకులపై క్యాస్టింగ్ కౌచ్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించిన శ్రీరెడ్డి తాజాగా ఇప్పుడు తన టార్గెట్టును తమిళ ఇండస్ట్రీపైకి మళ్లించింది. కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై పోరాటం చేస్తూ అర్దనగ్న ప్రదర్శనకు దిగడం ద్వారా ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యపై నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ పడేలా చేసింది శ్రీరెడ్డి. ఆ తర్వాత హీరో నాని, పలువురు దర్శకులు, నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

ఏఆర్ మురుగదాస్ మీద సంచలన ఆరోపణలు

ఏఆర్ మురుగదాస్ మీద సంచలన ఆరోపణలు

తాజాగా శ్రీరెడ్డి ప్రముఖ తమిళ దర్శకుడు, సౌత్‌లో మహేష్ బాబు, విజయ్, సూర్య లాంటి పెద్ద హీరోలతో భారీ సినిమాలు తీసిన ఏఆర్ మురుగదాస్ మీద సంచలన ఆరోపణలు చేసింది. హాయ్‌ మురుగదాస్‌ అంటూ మొదలెట్టిన శ్రీరెడ్డి గ్రీన్‌ పార్క్‌ హోటల్‌ విషయం మీకు గుర్తుందా అంటూ బాంబు పేల్చారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ ద్వారా మనం కలిశామని, తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారని మురుగదాస్‌కు గుర్తుచేశారు. ఆ రోజు హోటల్‌లో మనం చాలా... అంటూ అసంపూర్తిగా వ్యాఖ్యాన్ని ముగించింది.

మీరు చాలా గొప్ప వ్యక్తి సార్‌

అయినా ఇప్పటి వరకూ మీరు ఎలాంటి ఆఫర్‌ ఇవ్వలేదు. మీరు చాలా గొప్ప వ్యక్తి సార్‌ అంటూ ముగించారు. అలా తాజాగా దర్శకుడు మురుగదాస్ పైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన శ్రీరెడ్డి మళ్లీ రోజాపూలు హీరో శ్రీకాంత్ పైన కామెంట్ చేస్తూ పోస్టు చేసింది.

నాతో ఎంజాయ్ చేశాడు

నాతో ఎంజాయ్ చేశాడు

ఐదేళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు శ్రీకాంత్ (శ్రీరామ్)వచ్చాడని తన ఎఫ్బీలో పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత తనతో అతడు ఎంజాయ్ చేశాడంటూ దారుణమైన పదజాలం వుపయోగించింది. నువ్వు నా........ అది తిన్న స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం చాలా నిర్లజ్జగా పోస్ట్ చేసింది.

అవకాశం ఇస్తానని చెప్పాడట

అవకాశం ఇస్తానని చెప్పాడట

తనతో డ్యాన్స్ చేస్తూ తనకు అవకాశం ఇస్తానని చెప్పాడని పేర్కొంది. పైగా తమిళ్ లీక్స్ అని ట్యాగ్ లైన్ కూడా జత చేసింది. మరి దీనిపై రోజాపూలు హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి. అలాగే మురుగదాస్ కూడా ఏమంటాడో వేచి చూడాల్సిందే.

ఎవరితోనైనా లింక్ వుందంటూ చెబుతుంది

ఇదిలావుంటే ఇప్పటికే తమిళ హీరో విశాల్ శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన సంగతి తెలిసిందే. ఆమె గబుక్కున ఎవరితోనైనా లింక్ వుందంటూ చెప్పేస్తుందేమోనని ఆందోళన కూడా వ్యక్తం చేశాడు. నాని విషయంలో శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై హీరో విశాల్ గతంలో స్పందించాడు. ‘అభిమన్యుడు' విజయోత్సవ యాత్రకు విచ్చేసిన విశాల్ ఈ విషయంపై మాట్లాడాడు.

ఆరోపణలు చాలా అవమానకరం

ఆరోపణలు చాలా అవమానకరం

నానిపై శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలపై విశాల్ స్పందిస్తూ.. ‘‘నాని చాలా మంచి వ్యక్తి. అతను నాకు మంచి మిత్రుడు. అందుకే అతనికి నేను మద్దతు తెలుపుతున్నా అనుకోవద్దు. నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు చాలా అవమానకరంగా ఉన్నాయి. స్త్రీలతో నాని ఎంత గౌరవంగా వ్యవహరిస్తాడో అందరికి తెలుసు'' అని అన్నాడు.

నా మీద కూడా ఆమె ఆరోప‌ణలు చేస్తుందేమో

నా మీద కూడా ఆమె ఆరోప‌ణలు చేస్తుందేమో

శ్రీరెడ్డి ఆధారాలుంటే చూపించు...: ‘‘శ్రీరెడ్డి.. వ్యక్తులపై ఆరోపణలు చేయకుండా తగిన ఆధారాలు బయటపెట్టాలి. ఇదంతా చూస్తుంటే ఒక‌రి త‌ర్వాత ఒక‌రిని ఆమె వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. తర్వాత నా మీద కూడా ఆమె ఆరోప‌ణలు చేస్తుందేమో'' అన్ని అన్నాడు. అయితే, సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందనేది వాస్తవమేనని తెలిపాడు. అలా విశాల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కానీ దీనిపై శ్రీరెడ్డి మాత్రం స్పందించలేదు.

Story first published: Thursday, July 12, 2018, 15:22 [IST]
Desktop Bottom Promotion