For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక హిందువును కాపాడే ప్రయత్నంలో, ఉపవాసదీక్షను పక్కనపెట్టిన ముస్లిం

ఒక హిందువును కాపాడే ప్రయత్నంలో, ఉపవాసదీక్షను పక్కనపెట్టిన ముస్లిం

|

ఒక హిందువును కాపాడే ప్రయత్నంలో, ఉపవాసదీక్షను పక్కనపెట్టిన ముస్లిం.

ఈవ్యాసంలో, భారతదేశం యొక్క లౌకికవాద విలువలను ప్రపంచానికి తెలిపేలా, మతపరమైన యుద్దాలు సృష్టిస్తున్న ముష్కరుల చెంపలు పగలగొట్టేలా, దేశంలో అన్ని మతాల ప్రజలు ఎలా సంఘటితంగా ఉన్నారో తెలిపే సంఘటన గురించి చెప్పబోతున్నాం.

ఉపవాసం కన్నా, రక్తదానంతో ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడమే అల్లాకు ప్రియమైనదని ఆరిఫ్ ఖాన్ అనే వ్యక్తి మానవత్వాన్ని చాటుకున్నాడు. రక్తదానం ఇవ్వడం ద్వారా ఉపవాసదీక్ష భగ్నమవుతుందని తెలిసినా ఒక ప్రాణం కాపాడే ప్రయత్నంలో భాగంగా అతను తీసుకున్న నిర్ణయానికి, దేశమంతా హర్షం వ్యక్తo చేసింది.

Story Of A Muslim Man Who Broke His Fast To Save Life Of A Hindu

ఉత్తమమైన కారణానికి తన ఉపవాసదీక్షను భగ్నం చేసిన ఈ వ్యక్తి స్పూర్తినిచ్చే కథ ఏమిటో తెలుసుకుందాం.

రోగి గురించి :

రోగి గురించి :

అజయ్ బిజ్లవాన్ అనే వ్యక్తి నగరoలోని ఆసుపత్రిలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో చేరారు. స్పష్టంగా, తన ప్లేట్లేట్ కౌంట్ పడిపోయింది మరియు నెమ్మదిగా కాలేయం సైతం ప్రభావానికి గురవడం ప్రారంభించింది. క్రమంగా అతని ప్లేట్లెట్ కౌంట్ వేగంగా పడిపోయి ప్రాణగండం ఏర్పడింది. తక్షణమే రక్తమార్పిడి చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని, వైద్యులు సూచించగా, వెంటనే అతని కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ప్రజలకు సందేశాలను పంపడం ప్రారంభించారు.

అతను వాట్సాప్ ద్వారా సమాచారం అందుకున్నాడు :

అతను వాట్సాప్ ద్వారా సమాచారం అందుకున్నాడు :

అజయ్ బిజ్లవాన్ గురించిన సమాచారాన్ని వాట్సాప్ లో ఆరిఫ్ ఖాన్ అందుకున్నాడు. ఆ సందేశంలో అతని కుటుంబము రక్తం యొక్క గ్రూపు వివరాలను వెల్లడించింది. మరియు అజయ్ తండ్రి యొక్క ఫోన్ నంబర్ కూడా తెలుసుకున్నాడు.

ఆ సందేశం నిజమని తెలిసింది, ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాడు :

ఆ సందేశం నిజమని తెలిసింది, ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాడు :

డెహ్రాడూన్ సహస్త్రధరలో నివాసముంటున్న, జాతీయ తల్లిదండ్రులు మరియు విద్యార్ధి హక్కుల సంఘం అధ్యక్షుడు అయిన ఆరిఫ్, ఆ సందేశము ప్రామాణికమైనది అని తెలుసుకున్న వెంటనే రక్తదానం చేయడానికి ఆసుపత్రికి తక్షణమే కదిలాడు.

అతనికి ఉన్న అడ్డంకి :

అతనికి ఉన్న అడ్డంకి :

రoజాన్ కొనసాగుతుండటంతో, ఆరిఫ్ ఉపవాసదీక్షలో ఉన్నారు. కానీ, వైద్యుల సూచన ప్రకారం రక్తదానానికి ముందు ఖచ్చితంగా ఏదో ఒకటి తినవలసిన పరిస్థితి నెలకొంది. తాను ఉపవాస దీక్షలో ఉన్నానని వైద్యులకు నివేదించినా, వైద్యులు నిస్సహాయతను వ్యక్తం చేయడంతో ఉపవాస దీక్ష విరమించడానికే మొగ్గు చూపాడు.

ఆరిఫ్ చెప్పిన కథనం ప్రకారం:

ఆరిఫ్ చెప్పిన కథనం ప్రకారం:

ఆరిఫ్ అతని చర్య గురించి ఇలా వెల్లడించాడు: "ఒక వ్యక్తి ప్రాణాలు, తాను ఉపవాస దీక్ష విరమించుట ద్వారానే నిలబడుతాయి అని అంటే, నేను మానవత్వానికే నా మొదటి ప్రాధాన్యత ఉంటుంది , పేదవారికి సహాయపడటం అనేది రoజాన్ యొక్క ముఖ్యమైన బోధన. మేము నిరాహార దీక్ష చేసినా కూడా ఒకరికి సాయం చేయని పక్షంలో అల్లాహ్ సంతోషంగా ఉండడు" అని అన్నాడు.

మానవత్వం పునరుద్ధరించబడింది!

మానవత్వం పునరుద్ధరించబడింది!

మానవత్వం ఇప్పటికీ ఉనికిలో ఉందని మరియు ఆరిఫ్ మానవత్వానికి నిజమైన ఉదాహరణ అని ఈ చర్య మనకు ఖచ్చితంగా తెలియచేస్తుంది. మతాల మద్య చిచ్చులు పెట్టే ఉన్మాదులు రాజ్యమేలుతూ, లౌకిక వాదానికి నిలువ నీడలేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్న ఈ కాలంలో, మాకు మతాల కన్నా మానవత్వం గొప్ప అని చాటి చెప్పే ఇలాంటి యువకులు ఎందరికో ఆదర్శప్రాయం అవుతారు అనడంలో ఆశ్చర్యమే లేదు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన దేశంలో అన్ని మతాలూ సంఘటితంగానే ఉన్నాయి. కానీ కొందరు ముష్కరుల పన్నాగాలకు, అన్నదమ్ముల వలె ఉండాల్సిన యువత మత చాందస వాదాలతో కొట్టుకుచస్తూ, సామాజిక మాధ్యమాలలో అనేక చర్చలకు తావిస్తూ మానవత్వపు చాయలే కనుమరుగవుతున్నాయన్న ఆలోచనకు ఈ సంఘటన చెంపపెట్టు లాంటిది. ఆరిఫ్ వంటి యువకులు ప్రతి పది మందిలో ఒక్కరున్నా, ఈ దేశoలో లౌకికవాదానికి అంతమనేదే ఉండదు. తన మతాన్ని, ఆచారాన్ని పక్కనపెట్టి మతాలతో కులాలతో సంబంధంలేకుండా ప్రాణాలు కాపాడాలన్న ఆలోచనతో ముందుకువచ్చిన ఆరిఫ్ అనేక మందికి స్పూర్తిదాయకంగా నిలిచాడు అని వేరే చెప్పనవసరం లేదు.

ఆరిఫ్ చేసిన ఈ చర్య నిజంగా స్పూర్తిదాయకంగా ఉంది కదూ ? మీ అభిప్రాయాలను క్రింది వాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.


English summary

Story Of A Muslim Man Who Broke His Fast To Save Life Of A Hindu

A man named Arif Khan from Dehradhun, India, is said to have vitiated his fast for the sake of donating blood for a person named Ajay Bijlawan who urgently needed blood. He set an example of being human and being an Indian matter equally the way religion plays a vital role in our democratic country India.
Desktop Bottom Promotion