For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

150 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన చంద్రగ్రహణం.. ప్రతి ఒక్కరాశిపై దీని ప్రభావం పడుతుంది

చంద్రుడు అరుణవర్ణంలోకి, ఎర్రని రంగులోకి మారడాన్ని అద్భుతంగా భావిస్తున్నా మనం మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రాశులవారిపై దీని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అందువల్ల గ్రహణ నియమ నిబంధనలుపాటించాలి.

|

31st January 2018 Witness The Super Moon, Blue Moon And Lunar Eclipse

మనం రోజూ రాత్రి ఆకాశంలో చూసే చంద్రుడు తెల్లని వర్ణంలో ఉంటాడు. అలాంటి చంద్రుడు ఒక్కసారిగా నీలం రంగులోకి మారనున్నాడు. ఆ జాబిలిని చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. సూపర్ బ్లూ బ్లడ్ మూన్ పేరుతో ఆకాశంలో చోటుచేసుకునే ఈ అపూరూప దృశ్యం అందరినీ కనువిందు చేయనుంది.

సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అంటూ ప్రపంచం మొత్తం దీన్ని అపురూపంగా చూడబోతున్నా మనకు మాత్రం ఇది చంద్రగ్రహనమే. చంద్రుడు అరుణవర్ణంలోకి, ఎర్రని రంగులోకి మారడాన్ని అద్భుతంగా భావిస్తున్నా మనం మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రాశులవారిపై దీని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.

జనవరి 31వ తేదీన సూపర్ బ్లూ బ్లడ్ మూన్

జనవరి 31వ తేదీన సూపర్ బ్లూ బ్లడ్ మూన్

ఈ నెల 31వ తేదీన చంద్రుడు నీలి రంగు చంద్రుడు ( సూపర్ బ్లూ మూన్ )ని అందరూ చూడనున్నారు. అదే రోజు మరో వింత కూడా ఆకాశంలో చోటుచేసుకోనుంది. బ్లూ మూన్‌తో పాటు చంద్ర గ్రహణం, సూపర్ మూన్, ‘బ్లడ్ మూన్' అదే రోజు రానున్నాయి.

152 ఏళ్ల తర్వాత

152 ఏళ్ల తర్వాత

1886లో కనిపించిన ఈ అద్భుతం దాదాపు 152 ఏళ్ల తర్వాత మళ్లీ ఆకాశంలో కనువిందు చేయనుంది. సాధారణంగా చంద్రగ్రహణం రోజున జరిగే మార్పుల వల్ల శ్వేతవర్ణంలోని చంద్రుడు కాస్త రంగు మారుతాడు. ఎర్రగా అందరికీ కనపడతాడు. దీన్ని ‘బ్లడ్ మూన్' అంటారు.

అందుకే నీలం రంగు

అందుకే నీలం రంగు

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్య మీదకు వచ్చినప్పుడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దీంతో చంద్రుడిపై పడే కిరణాలు భిన్న రంగుల్లో మారి నీలం రంగులో దర్శనమిస్తాయి. భారత కాలమానం ప్రకారం చంద్ర గ్రహణం జనవరి 31, సాయంత్రం 6.20 గంటలకు మొదలై 7.37 గంటల వరకు ఉంటుంది.

చాలా పెద్దదిగా.. కాంతివంతంగా

చాలా పెద్దదిగా.. కాంతివంతంగా

సూపర్ మూన్ రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. ఈ సందర్భంగా చంద్రుడు 14 శాతం పెద్దదిగా.. 30 శాతం కాంతివంతంగా కనిపిస్తాడు. దీనివల్ల చంద్రగ్రహణం, బ్లూమూన్.. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోని వారికి ఈ అద్భుతాన్ని స్పష్టంగా వీక్షించే అవకాశం కలుగుతుంది.

2037 లో మళ్లీ

2037 లో మళ్లీ

ఇలాంటి గ్రహణం మళ్లీ 2037లో ఏర్పడనుంది. అది కూడా జనవరి 31నే. గంటలకు పైగా చంద్రుడు అలా సుందరంగా కనువిందు చేయనున్నాడు. ఈ సమయంలో చంద్రుడిపై పడే భూమి దక్షిణ భాగపు నీడను స్పష్టంగా చూడొచ్చు.

వీళ్లు బాగా చూడొచ్చు

వీళ్లు బాగా చూడొచ్చు

ఆకాశంలో ఏర్పడే ఈ వింతను సెంట్రల్‌ అమెరికా, మధ్య ఆసియా, ఇండోనేషియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఐరోపా, అలాస్కా, కెనడా, ప్రాంతాల ప్రజలు బాగా చూడొచ్చు.

భారతీయులు చూడొచ్చు

భారతీయులు చూడొచ్చు

సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు పసిఫిక్‌ మహాసముద్రం మీద ప్రయాణిస్తాడు. జనవరి 31 ఏర్పడనున్న ఈ అరుదైన సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ను మనదేశంలోని కోట్లాది మంది చూడొచ్చు. జనవరి 31న సాయంత్రం 6.27 నుంచి 6.31 మధ్య ఈ అపురూప దృశ్యాన్ని మన చూడొచ్చు.

ఈ అపురూప దృశ్యానికి సంబంధించిన కొన్ని వివరాలు

ఈ అపురూప దృశ్యానికి సంబంధించిన కొన్ని వివరాలు

చంద్రుడిపై భూమి నీడ ప్రారంభం 31 జనవరి 16:21:13. అయితే ఇది మనకు కనపడదు.

పాక్షిక గ్రహణం ప్రారంభం 31 జనవరి 17:18:27. ఇది కూడా కనపడదు.

పూర్తి గ్రహణం ప్రారంభం 31 జనవరి 18:21:47. ఇది కనిపిస్తుంది.

గరిష్ట గ్రహణం 31 జనవరి 18:59:51. ఇది కనిపిస్తుంది

గ్రహణం పూర్తి 31 జనవరి 19:37:51. ఇది కనిపిస్తుంది

పాక్షిక గ్రహణం పూర్తి 31 జనవరి 20:41:11. ఇది కనిపిస్తుంది

చంద్రుడిపై భూమి నీడ పూర్తి 31 జనవరి 21:38:29. ఇది కనిపిస్తుంది.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం

జనవరి 31న చంద్రగ్రహణం ఈ నెల 31 తేది బుధవారం రోజున పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక,సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించనున్నది. భారత కాలమానం ప్రకారం సాయత్రం ప్రారంభం అవుతుంది.

చంద్రగ్రహణం వేళలు ఇవీ

చంద్రగ్రహణం వేళలు ఇవీ

సాయంత్రం. 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం. సా. 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణం. రాత్రి. 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుండి విడుపు దశ వైపు. రాత్రి. 8:41 గ్రహణ అంత్యకాలము ( గ్రహణ మోక్షం ). గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు. సంపూర్ణ సూర్య బింబ దర్షణ కాలం మొత్తం "76"నిమిషాలు.

ఈ రాశులపై ప్రభావం

ఈ రాశులపై ప్రభావం

ప్రపంచమంతా ఇప్పుడు పిలుస్తున్నా సూపర్ బ్లూ బ్లడ్ మూన్

కర్కాటకరాశిలో ఏర్పడనుంది. ఆ రాశి నుండి సప్తమ దృష్టి పరంగా మకరరాశి అవటం చేత ఈ రెండు రాశులవారిపై,పుష్యమి,ఆశ్లేష,మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది.కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుంది.

ఎవరికీ మేలు.. ఎవరికీ చెడు

ఎవరికీ మేలు.. ఎవరికీ చెడు

సూపర్ బ్లూ బ్లడ్ మూన్ వల్ల ఏ రాశికి మంచి జరుగుతుంది. ఏ రాశి వారికి చెడి జరుగుతుందో చూడండి. ధనస్సు, మేషం, కర్కాటక, సింహ రాశుల వారికి అధమ ఫలం ఉంటుంది. వృశ్చిక, మకర, మీన, మిధున రాశుల వారికి మధ్యఫలం ఉంటుది. కన్య, తుల, కుంభ, వృషభ రాశుల వారు ఎక్కువగా శుభఫలాలు పొందుతారు.

మనకు ఇది చంద్రగ్రహనమే

మనకు ఇది చంద్రగ్రహనమే

ప్రపంచం మొత్తం చంద్రుడు నీలం రంగులోకి మారడాన్ని అద్భుతంగా భావిస్తున్నా మనకు మాత్రం ఇది చంద్రగ్రహణమే.

కాబట్టి అన్ని రాశులవారు గ్రహణ నియమ నిబంధనలు పాటిస్తే మంచి జరుగుతుంది.

నిబంధనలు ఇవీ

నిబంధనలు ఇవీ

ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిని స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు,టివిలలో చూస్తే దోషం లేదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.గర్భినిలు కదలకుండా పడుకోవాలి అనే అవాస్తవాన్ని నమ్మకండి.ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును. ఇందులో ఎలాంటి సందేహాలు పడకూడదు. గ్రహణ సమయంలో మల,మూత్ర విసర్జనలు చేయకూడదు అనే అపోహలు పెట్టుకోకండి.

నిల్వ ఉంచిన పదార్థాలతో జాగ్రత్త

నిల్వ ఉంచిన పదార్థాలతో జాగ్రత్త

నిలువ ఉంచే పచ్చల్లు,పిండి వంటలపైన గరిక పోసలను వేయాలి. దీనివలన ఆహార పదార్ధాలపై గ్రహణ ప్రభావం పడదు. గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు,భోజనాలు పూర్తి చేసుకోవాలి. గ్రహణ సమయంలో నిలువఉన్న ఆహర పదార్థాలు విషస్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి తినకూడదు.

ఈ ఏడాది ఇదే తొలి సంపూర్ణ చంద్ర గ్రహణం

ఈ ఏడాది ఇదే తొలి సంపూర్ణ చంద్ర గ్రహణం

ఈ ఏడాది ఏర్పడే తొలి సంపూర్ణ చంద్ర గ్రహణం ఇదే. ఈ నెల 31న ఏర్పడే ఈ గ్రహణం పౌర్ణమినాడు ఏర్పడనుంది. ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు. బ్లూ మూన్‌నాడు సంపూర్ణ గ్రహణం ఏర్పడటం 150 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారి ఇలాంటి గ్రహణం మార్చి 31, 1866లో కనిపించింది.

ఉల్కప్రాంతాల ప్రయాణం

ఉల్కప్రాంతాల ప్రయాణం

జనవరి 31న సూపర్ బ్లూ బ్లడ్ మూన్‌ వల్ల ఉల్కాపాతాల ప్రయాణం పెద్దగా కనిపించకపోవచ్చని సైన్స్‌ పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఏడాది ఐదు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో మూడు పాక్షిక సూర్యగ్రహణాలు ఉండగా.. మిగతా రెండు చంద్ర గ్రహణాలు. ఫిబ్రవరి 15, జూలై 13, ఆగష్టు 11 తేదీల్లో ఏర్పడే సూర్య గ్రహణాలను మన దేశం నుంచి వీక్షించలేం. కానీ జనవరి 31 ఏర్పడనున్న అత్యంత అరుదైన చంద్ర గ్రహణం ఏర్పడనుంది. జనవరి 31న సాయంత్రం 6.27 నుంచి 6.31 మధ్య ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు.

మేషం

మేషం

చంద్రగ్రహణం ఈ రాశిపై కాస్త ప్రభావం చూపుతుంది. వీరు చేసే పనులు కాస్త నెమ్మదిగా సాగుతాయి. అయితే వీరు జనవరి పూర్తయిన తర్వాత వీరు చేపట్టబోయే పనులు సక్సెస్ అవుతాయి.

వృషభం

వృషభం

చంద్రగ్రహణం మీ రాశిలో నాలుగో స్థానంలో ఉంటుంది. గ్రహణం వల్ల ఈ రాశి వారి వ్యక్తిత్వంలో కాస్త మార్పు వస్తుంది. వీరు కాస్త తాత్వికంగా ఆలోచించే గుణాన్ని పొందనున్నారు.

మిథునం

మిథునం

మిథున రాశి వారు చంద్ర గ్రహణం సూపర్ బ్లూ బ్లడ్ మూన్ వల్ల వీరు కాస్త ఇబ్బందులుపడనున్నారు. వీరిపి జనవరి 31 న కొన్ని రకాల పుకార్లు వస్తాయి. మీరు ఆ విషయంలో ఎలాంటి ఇబ్బందులుపడకుండా ఉంటే చాలు. అదొక్క రోజు కాస్త ఓపికగా ఉండండి. ఎవరేమనుకున్నా కూడా పట్టించుకోకండి.

కర్కాటకం

కర్కాటకం

కర్కాటక రాశిలో చంద్ర గ్రహణం రెండో స్థానంలో ఉంటుంది. దీని వల్ల మీపై కాస్త ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మీ ఆదాయంపై ఇది ప్రభావం చూపనుంది. మీ వ్యక్తిగత ఆస్తుల విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండుంది. అందువల్ల మీరు ఇప్పటి నుంచే అప్రమత్తంకండి.

సింహరాశి

సింహరాశి

సింహరాశి వారిపై కూడా చంద్ర గ్రహణం సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ప్రభావం చూపనుంది. మీరు ఈ నెలలో కొన్ని రకాల భావోద్వేగాలకు గురవుతారు. మీరు ఎమోషన్స్ తట్టుకుని ముందుకెళ్లండి.

కన్యరాశి

కన్యరాశి

కన్యరాశి వారు చంద్ర గ్రహణం సూపర్ బ్లూ బ్లడ్ మూన్ వల్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే కాస్త ఆలోచించి ముందడుగు వెయ్యండి.

తులరాశి

తులరాశి

తులరాశి వారు చంద్ర గ్రహణం, సూపర్ బ్లూ బ్లడ్ మూన్ సమయంలో ఫ్రెండ్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ స్నేహితులకు ఏదో సాయం చెయ్యడానికి వెళ్తే మీరే ఇబ్బందులపడాల్సి వస్తుంది. అంతేకాకుండా మీకు కొత్త స్నేహ్నితులు కూడా పరిచయం అవుతారు. వారితోనూ జాగ్రత్తగా ఉండండి.

వృశ్చికం

వృశ్చికం

వృశ్చిక రాశి వారిపై కూడా చంద్ర గ్రహణం, సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ప్రభావం ఉంటుంది. ఈ రాశిలో చంద్రగ్రహణం పదోస్థానంలో ఉంటుంది. వీరి కెరీర్ కు సంభంధించిన అంశాల్లో కాస్త మార్పులు వస్తాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి.

ధనుస్సు

ధనుస్సు

ధనుస్సు రాశి వారిపై చంద్ర గ్రహణం, సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ప్రభావం కాస్త వేరుగా ఉంటుంది. గ్రహణం వల్ల వీరి జీవితం కాస్త మారుతుంది. వీరిలో కొత్త ఉత్సాహం వస్తుంది. మీరు ఈ నెలలో కొత్తకొత్త ప్రాంతాలను సందర్శించనున్నారు.

మకరం

మకరం

ఈ రాశిలో చంద్రగ్రహణ ఎనిమిదో స్థానంలో ఉంటుంది. వీరు కొన్ని రకాల వార్తలను వింటారు. వీరికి సంబంధించిన వారు మరణించడం లేదా పన్నులకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చంద్రగ్రహణం ఈ రాశిపై కాస్త ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అలాగే మీరు కొన్ని అప్పులు కూడా చేయాల్సి వస్తుంది.

కుంభం

కుంభం

కుంభరాశి వారిపై చంద్రగ్రహణం ప్రభావం అంతగా ఉండదు. మీరు మీ బంధువులు, స్నేహితులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. వారితో మరీ ఎక్కువ కలసిపోకండి. వారిని మరీ దూరం చేసుకోకండి. జనవరి 31 వరకు మీరు వారితో సమన్వయంగా ముందుకెళ్లండి.

మీనం

మీనం

చంద్ర గ్రహణం, సూపర్ బ్లూ బ్లడ్ మూన్ వల్ల మీన రాశి వారు వారి వ్యక్తిగత విషయాల్లో కాస్త డల్ అయిపోతారు. వీరు వ్యాయామం, రోజూ ఉదయమే లేచి ప్రారంభించే కొన్ని కార్యకళాపాలను పెండింగ్ లో ఉంచుతారు. వీరికి ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. గ్రహణం ప్రభావం వల్ల వీరు కొన్ని రోజులు అలా ప్రవర్తిస్తారు. అందువల్ల ఎక్కువగా దాని గురించి చింతించకండి. గ్రహణం పోయాక మళ్లీ మీరు యధామామూలుగానే అన్ని పనులపై ఆసక్తి చూపుతారు.

English summary

what does a super blue blood moon mean for your sign january 2018s second full moon is a doozy

what does a super blue blood moon mean for your sign january 2018s second full moon is a doozy
Desktop Bottom Promotion