For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీర్ బాటిళ్ల గుడి.. చూస్తే అదిరిపోతుంది.. బౌద్ధ సన్యాసులు అలా ఎందుకు నిర్మించారో తెలుసా?

బౌద్ధ సన్యాసులు నిర్మించిన బీర్ బాటిళ్ల గుడి చూశారా?ఆ బీర్ ఆలయమే... ఖూన్‌ హన్‌ జిల్లా సిసాకెట్‌ ప్రొవిన్స్‌లోని ‘వాట్‌ పా మహా చెది కయూ’ బుద్ధుడి ఆలయం. 1984లో సముద్ర ప్రాంతం వద్ద చెత్త సేకరణలో పాల్గొన

|

మనం గుడికెళ్తున్నప్పుడు ఎంతో నిష్టగా స్నానం చేసి వెళ్తాం. మద్యం తాగితే దాదాపు ఎవరూ కూడా గుడికి వెళ్లరు. దేవుడి విషయంలో మనం ఇంత నిష్ట పాటిస్తాం. ఇక భవనాలను, ఆలయాలను కట్టడానికి వేటిని ఉపయోగిస్తాం? ఎక్కడైనా ఇటుకల్నే ఉపయోగిస్తారు.. కొన్ని చోట్ల చెక్కలతో కడతారని అంటారా?

ఉపయోగించని సీసాలను మాకివ్వండి

ఉపయోగించని సీసాలను మాకివ్వండి

అయితే ఒకచోట ఏకంగా బీర్‌ బాటిళ్లతోనే గుడి కట్టారు. ఈ బీర్ టెంపుల్ థాయ్‌లాండ్‌ లో ఉంది. బీర్‌ బాటిళ్లతో బుద్ధుడి ఆలయాన్ని నిర్మించగా, బౌద్ధ సన్యాసులే స్వయంగా ఈ నిర్మాణంలో పాలుపంచుకోవటం గమనార్హం. "ఉపయోగించని సీసాలను మాకివ్వండి.. మేం మరిన్ని నిర్మాణాల్ని చేపడతాం" అనే నినాదంతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు.

వాట్‌ పా మహా చెది కయూ

వాట్‌ పా మహా చెది కయూ

ఆ బీర్ ఆలయమే... ఖూన్‌ హన్‌ జిల్లా సిసాకెట్‌ ప్రొవిన్స్‌లోని ‘వాట్‌ పా మహా చెది కయూ' బుద్ధుడి ఆలయం. 1984లో సముద్ర ప్రాంతం వద్ద చెత్త సేకరణలో పాల్గొన్న కొందరు బౌద్ధ సన్యాసులు కుప్పులు కుప్పలుగా పడి ఉన్న బీర్‌ బాటిళ్లను గమనించారు. వెంటనే వారికి ఓ ఆలోచన తట్టింది.

అందంగా గుడిని నిర్మిస్తే

అందంగా గుడిని నిర్మిస్తే

ఇటుకలకు బదులుగా బీర్‌ బాటిళ్లతో అందంగా ఒక గుడిని రూపొందిస్తే బాగుంటుందనుకున్నారు. వెంటనే సుమారు 10 లక్షలకు పైగానే ఖాళీ బీర్‌ సీసాలను ఉపయోగించి గుడి నిర్మించారు. ఆలయ ప్రాంగణంతోపాటు, మెట్లు, నేల, వాష్‌రూమ్‌లు, విశ్రాంతి గది ఇలా అన్నీ బీర్‌ సీసాలతో నిర్మించినవే.

రీ సైక్లింగ్‌ చేసి

రీ సైక్లింగ్‌ చేసి

ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే ఆలయంలోని అనేక చిత్రవర్ణాలను, సీసాల బిరడాలతో ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బుద్ధుడి చిత్రాన్ని కూడా బీర్‌ బాటిళ్ల మూతలను రీ సైక్లింగ్‌ చేసి తయారు చేయటం విశేషం. ఈ బీర్ టెంపుల్ కు ఉపయోగించిన సీసాల్లో హైనకెన్‌, ఛాంగ్‌ అనే రెండు బీర్‌ కంపెనీలకు చెందినవే ఉన్నాయంట. ఈ బీర్‌ టెంపుల్‌ ద్వారా సిసాకెట్‌ పర్యాటక ప్రాంతంగా విరజిల్లుతోంది.

మిలియన్‌ బాటిల్‌ టెంపుల్‌

మిలియన్‌ బాటిల్‌ టెంపుల్‌

1984వ సంవత్సరంలో ‘వాట్‌ పా మహా చెడి కేవ్‌' అనే ఈ ఆలయానికి శ్రీకారం చుట్టారు. థాయ్‌లాండ్‌లోని సిరెనె సరస్సు తీరంలో ఈ ఆలయం ఉంది. దీన్నె ‘ మిలియన్‌ బాటిల్‌ టెంపుల్‌' అని వ్యవహరిస్తారు. ఇది కంబోడియా బార్డర్‌లో ఉంటుంది.

స్వచ్ఛందంగా సీసాలను తీసుకువచ్చి

స్వచ్ఛందంగా సీసాలను తీసుకువచ్చి

ఖున్‌ హాన్‌ జిల్లాలోని ప్రజలందరు కూడా స్వచ్ఛందంగా సీసాలను తీసుకువచ్చి ఆలయంలో అందజేస్తారు. ఆలయంలోని భిక్షువులు ఆ సీసాలతో మరిన్ని నిర్మాణాలను చేపడతారు. భిక్షువులు సేద తీరే విశ్రాంతి గదుల నుంచి వాష్‌ రూం వరకు, కొలను ప్రహరీ నుంచి నీళ్ల ట్యాంకు వరకు అన్నీ సీసాలతోనే నిర్మించారు. చివరికి శవదహనశాలను కూడా సీసాలతోనే కట్టారు.

సీసాలతో విగ్రహాలు

సీసాలతో విగ్రహాలు

ఆలయం లోపల సీసాలతో విగ్రహాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆకుపచ్చ, లేడి వన్నె రంగుల సీసాలను అక్కడక్కడ ఉపయోగిస్తూ, మధ్యలో ఎరుపు వర్ణపు రెడ్‌ బుల్‌ సీసాలను పేర్చి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సూర్యుడు అస్తమించే సమయంలో ఆలయం ధగధగ మెరిసిపోతుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద బీర్‌ సీసాలను ఉపయోగించి 5 మీటర్ల ఎత్తుతో బౌద్ధ విగ్రహ నిర్మాణం చేపట్టారు.

వీలుంటే వెళ్లండి

వీలుంటే వెళ్లండి

మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే థాయ్ లాండ్ లోని

ఖూన్‌ హన్‌ జిల్లా సిసాకెట్‌ ప్రొవిన్స్‌లో ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించండి. ఒక్కసారిగా అన్ని బీర్ బాటిల్స్ ను చూస్తే మీరు షాక్ తింటారు. ఒకవేళ మీరు రోజూ బీర్ తాగి బాటిల్ పడేస్తుంటే ఈ టెంపుల్ చూశాకా మీకు అర్థం అవుతుంది.. ఖాళీ బాటిల్స్ తో కూడా ఇంత అందంగా నిర్మాణం చేపట్టవచ్చా అని.

పర్యావరణానికి ముప్పు

పర్యావరణానికి ముప్పు

బీర్ బాటిల్స్ తాగి ఎక్కడంటే అక్కడ పాడేయడం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతూ ఉంటుంది. అందుకే బౌద్ద సన్యాసులు ఈ విధంగా ఆలయం నిర్మించి పర్యావరణానికి కాసింత మేలు చేశారు.

English summary

this buddhist temple in thailand is made completely out of beer bottles

this buddhist temple in thailand is made completely out of beer bottles
Story first published:Wednesday, May 30, 2018, 11:22 [IST]
Desktop Bottom Promotion