మీరు పుట్టిన తేదీ ఆధారంగా మీ యొక్క ఆధ్యాత్మిక జంతువు ఏమిటో తెలుసుకోవచ్చు!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీ యొక్క ఆధ్యాత్మిక జంతువు ఏది అనే విషయం మీకు తెలుసా ? జ్యోతిష్యం ప్రకారం నాలుగు విభిన్న రకాల జంతువులు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని వివిధ రకాలుగా విపులీకరిస్తాయి.

నెలలో ఉండే వివిధ రకాల తేదీలను ఆధారంగా చేసుకొని నాలుగు విభిన్న రకాల జంతువులను, అందుకు అనుగుణంగా ఆయా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని వివరించడానికి ఎన్నుకోవడం జరిగింది. ఎవరైనా సరే వారి పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని, వారికి స్వతహాగా ఏ ఆధ్యాత్మిక జంతువు సరిగ్గా సరిపోతుంది, వారి వ్యక్తిత్వాన్ని ఏది ఉత్తమంగా తెలియజేస్తుంది అనే విషయాన్ని ఎవరికి వారు తెలుసుకోవచ్చు.

This Is Your Spiritual Animal Based On Your Birth Date

ఆయా తేదీల ఆధారంగా, ఈ జంతువులు వ్యక్తుల యొక్క గుణగణాలను లక్షణాలను తెలియజేస్తాయి. కాబట్టి ఆధ్యాత్మిక జంతువు మీ పుట్టిన తేదీ ఆధారంగా ఏమి చెప్పబోతోంది అనే విషయం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

మీరు 1 నుండి 7 వ తేదీ మధ్యలో పుట్టి ఉంటే - ఎలుగుబంటి :

మీరు 1 నుండి 7 వ తేదీ మధ్యలో పుట్టి ఉంటే - ఎలుగుబంటి :

మీ పుట్టిన తేదీ గానుక నెలలోని మొదటి వారంలో గనుక ఉంటే, అటువంటి సమయంలో మీ యొక్క ఆధ్యాత్మికమైన జంతువు శక్తివంతమైన ఎలుగుబంటి. మీరు అప్పుడప్పుడు అత్యంత శక్తివంతులుగా కనిపిస్తారు మరియు అప్పుడప్పుడు అత్యంత బలహీనంగా కనిపిస్తారు. ఇవే కాకుండా, వీటితో పాటు శక్తిని వృద్ధి చేసుకుంటారు మరియు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. అంతేకాకుండా ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని నేర్చుకుంటారు మరియు సమయమం గడిచే కొద్దీ మంచి నాయకత్వ లక్షణాలను అలవరుచుకుంటారు.

మీరు 8 నుండి 14 వ తేదీ మధ్యలో పుట్టి ఉంటే - గుర్రం :

మీరు 8 నుండి 14 వ తేదీ మధ్యలో పుట్టి ఉంటే - గుర్రం :

మీ పుట్టిన రోజు గనుక నెలలో రెండవ వారంలో గనుక ఉంటే, అటువంటి సమయంలో మీ యొక్క ఆధ్యాత్మికమైన జంతువు మర్యాదపూర్వక గుర్రం. ఈ వ్యక్తులు శక్తివంతంగా, వ్యక్తిగతంగా ఎదో సాధించాలని అనుకుంటారు మరియు అందుకు తగ్గ అభిరుచితో పాటు సాధించాలనే ఆశ కోరిక వీరిలో ఎక్కువగా ఉంటాయి. శక్తివంతంగా ఉండటం ద్వారా జీవితంలో ఎప్పుడూ స్ఫూర్తిని పొందుతూ ఉంటారు. అచ్చం గుర్రంలాగానే, స్వభావానికి మరియు తర్కంగా ఎదురయ్యే సందర్భాల మధ్య సమతుల్యతను పాటిస్తూ ఉంటారు.

మీరు 15 నుండి 21 వ తేదీ మధ్యలో పుట్టి ఉంటే - డేగ :

మీరు 15 నుండి 21 వ తేదీ మధ్యలో పుట్టి ఉంటే - డేగ :

మీ పుట్టిన రోజు గనుక నెలలో మూడవ వారంలో గనుక ఉంటే, అటువంటి సమయంలో మీ యొక్క ఆధ్యాత్మికమైన జంతువు డేగ. ఒక వ్యక్తిగా మీరు దూరదృష్టితో ఆలోచించగలరు మరియు ఊహాజనితంగా కూడా వ్యవహరించగలరు. మీరు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టాలని అనుకోరు. మీ యొక్క దృష్టి నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది అనే విషయం అందరికి తెలిసినప్పటికీ, మీరు దృష్టిని కేంద్రీకరించడం పై మరింత జాగ్రత్త వహించి, మీ పనులను పూర్తి చేసుకోవడం మంచిది.

మీరు 22 నుండి 31 వ తేదీ మధ్యలో పుట్టి ఉంటే - జింక :

మీరు 22 నుండి 31 వ తేదీ మధ్యలో పుట్టి ఉంటే - జింక :

మీ పుట్టిన రోజు గనుక నెలలో నాల్గవ వారంలో గనుక ఉంటే, అటువంటి సమయంలో మీ యొక్క ఆధ్యాత్మికమైన జంతువు సహజమైన జింక. దీనర్ధం మీరు ఎంతో సున్నిత మనస్కులు గా వ్యవహరిస్తారు , జాలి మనస్తత్వం కలిగి ఉంటారు మరియు విపరీతమైన సహజ స్వభావంతో మెలుగుతారు. మీకు ఎదురయ్యే సవాళ్ళను ఎంతో మర్యాదపూర్వకంగా స్వీకరించి విజయాన్ని చేరుకోవాలని భావిస్తారు మరియు మీకు ఎదురయ్యే ప్రతి విషయాన్ని సరైన విధంగా స్వీకరించి ఆత్మ విశ్వాసంతో ముందగుడు వేస్తారు.

పైన చెప్పినవి అన్ని చదివారు కదా. మీ యొక్క ఆధ్యాత్మిక జంతువు ఏది ? ఈ వ్యాసం చదివిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.

English summary

This Is Your Spiritual Animal Based On Your Birth Date

How many of us know our spiritual animal based on the date of our birth? There are 4 different animals that reveal the nature of the individuals based on their date of birth. From hawk, to a might bear, or even a powerful horse or an intuitive deer, there are spiritual animals based on one's DOB.
Story first published: Thursday, February 8, 2018, 7:00 [IST]
Subscribe Newsletter