Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సర్ప్రైజ్ బహుమతిగా కుక్కపిల్ల - భావోద్వేగాలను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న బాలుడు
సర్ప్రైజ్ బహుమతిగా కుక్కపిల్ల - భావోద్వేగాలను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న బాలుడు
ఒక్కోసారి చిన్న చిన్న సర్ప్రైజ్లు కూడా గొప్ప అనుభూతిని మిగులుస్తుంటాయి. సినిమాలు, గాడ్జెట్లు , డబ్బుతో ముడిపడిన ఇతర అంశాలలో సంతోషాన్ని వెతుక్కుంటున్న అనేకమందికి, అంతకు మించిన విషయాలు కూడా ఒక్కోసారి గుండెల నిండా సంతోషాలను నింపగలవని గుర్తుంచుకోవాలి.
ఇక్కడ ఒక కుక్కపిల్ల గురించి మాట్లాడుతున్నాం! కుక్కపిల్లలను బహుమతిగా పొందినవారు, లేదా వాటిని స్వయంగా కలిగి ఉన్నవారు ఎవరినైనా అడగండి, వాటితో వారికున్న అనుబంధం మరియు సంతోషాల గురించి. విశ్వాసం, ప్రేమ, ఆత్మీయతలకు నిదర్శనంగా ఉండే కుక్కపిల్లలను బహుమతిగా పొందుటకు ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి.

అతని కుటుంబం అతనిని ఒక కుక్కపిల్లకి బహుమతిగా ఇచ్చినపుడు, భావోద్వేగానికి లోనైన ఒక బాలుని కథనం గురించి తెలుసుకోబోతున్నాము. ఇతని ఆనందం అనిర్వచనీయం, అద్భుతం.
వీడియో చూడండి
కుక్క పిల్లను సర్ప్రైస్ బహుమతిగా పొంది ఎమోషనల్ అవుతున్న ఇతన్ని చూస్తుంటే, కళ్ళు చమర్చక మానదు
వేలన్ అనే ఈ పది సంవత్సరాల ఫ్లోరిడా బాలుడు, తన జీవితంలో ఇటువంటి రోజు వస్తుందని ఎన్నటికీ అనుకుని ఉండడు. ఎన్నో రోజులుగా కుక్కపిల్ల కోసం అడుగుతూనే ఉన్న ఈ బాలుడికి, తన పేరెంట్స్ సర్ప్రైజ్ ప్లాన్ చేయడం, కానీ ఆ బహుమతి ఒక పప్పీ అన్న విషయం బాలునికి తెలీకపోవడం., క్రమంగా విషయం తెలిసిన పిదప, ఆ బాలుడు సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వడం ఎంతో హృద్యంగా కనిపిస్తుంది ఈ వీడియోలో.
కాంప్ నుండి వచ్చిన వెంటనే ఒక లెటర్ చదవమని ఆ పిల్లవాని చేతికిచ్చారు. ఆ లెటర్ చదువుతున్న పిల్లవాడి ముఖంలోని సంతోషాలను కాప్చర్ చేయాలని నిర్ణయించుకున్న ఆ తల్లికి జీవితంలో మరచిపోలేని భావోద్వేగాలను పదిలపరచుకునే అవకాశo దక్కింది.
ఇక ఆ లెటర్లో “ నీకోసం ఒక స్పెషల్ బహుమతిని ఇస్తున్నాము, చాలాకాలంగా నువ్వు ఎదురుచూస్తున్న బహుమతి అది. ఎప్పుడూ అడుగుతూ, ఏరోజుకైనా పొందాలన్న ఆశతో ఎదురుచూస్తున్న బహుమతి అది. నాకోసం ఆ బహుమతిని ఇస్తారా అని అడిగేవాడివి. నువ్వు ఆ బహుమతిని ప్రతిరోజూ నీతోనే కలిగి ఉండాలని కోరుకుంటున్నావు. ఆ బహుమతితో నువ్వు చక్కగా మసలుకోవాలి, నీకొక ఉత్తమ స్నేహితుడు కాగలదు కూడా. ఎల్లప్పుడూ నీ వెంటనే ఉంటూ, నీ పిలుపుకు అందేంత దూరంలో నీకోసం, నీతో తోడుగా ఉండే ఆ స్నేహితుడు, ఈ కుక్కపిల్ల. తన పేరు లిబర్టీ, చాలా బాగుంది కదూ ?
ఇటువంటి సర్ప్రైజులతో మిమ్ములను లేదా మీకు తెలిసిన వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన సందర్భాలు ఉంటే మాతో పంచుకోండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీఅభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications