For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుమారస్వామి పర్సనల్ లైఫ్ : రెండో భార్య రాధికతో పాటు సినిమాలంటే ఇష్టం.. రాజకీయాల్లోకి అలా వచ్చాడు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారు స్వామి భార్య రాధిక కుమారస్వామి గురించి కూడా చాలా మందికి తెలియదు. ఆయన మొదటి భార్య అనిత గురించే ఎక్కువగా తెలుగు. కన్నడ హీరోయిన్ రాధిక కుమారస్వామి రెండో భార్య.

|

కర్ణాటక తాజా ముఖ్యమంత్రి జేడీఎస్‌ నేత కుమారస్వామి గురించి చాలా విషయాలు ప్రజలకు తెలియకపోవొచ్చు. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య తాజాగా సీఎం పీఠంపై కూర్చొన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి జీవితం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది.

కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. 2006లో తొలిసారిగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే అప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటవడం గమనార్హం. 2006లో భాజపాతో పొత్తు పెట్టుకుని సీఎం అయ్యారు.

అయితే కేవలం 20 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికార బదిలీకి ఆ పార్టీతో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించటంతో 2007 నవంబరు 2న భాజపా మద్దతు కోల్పోయారు. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

హరదనహళ్లి దేవెగౌడ కుమారస్వామి

హరదనహళ్లి దేవెగౌడ కుమారస్వామి

ఈయన పూర్తి పేరు హరదనహళ్లి దేవెగౌడ కుమారస్వామి. అయితే ఈయన ఎంతో అదృష్టవంతుడు. మొత్తం రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి, అహోరాత్రులు శ్రమించిన నాయకులు ముఖ్యమంత్రులు కావడం కష్టమవుతున్న రోజుల్లో ఆయన ఆ పదవిని సునాయసంగా అందుకున్నాడు.

పదవి నడుచుకుంటూ వచ్చింది

పదవి నడుచుకుంటూ వచ్చింది

పెద్దగా ప్రజాబలం లేనప్పటికీ, పరిమితమైన శాసనసభ్యుల మద్దతు ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రాబల్యంతో సీఎం పదవి ఆయన వద్దకు నడుచుకుంటూ వచ్చింది. దేవెగౌడ, చెన్నమ్మ దంపతులకు కుమారస్వామి హాసన్‌ జిల్లా హొళెనరసిపుర తాలూక హరదన హళ్లిలో 1959 డిసెంబరు 16న జన్మించారు. బీఎస్సీ పట్టభద్రుడు. 1986లో చింతామణికి చెందిన అనితతో వివాహమైంది. ఆమె కూడా విధానసభకు ఒకమారు ఎన్నికయ్యారు. తనయుడు నిఖిల్‌ వర్ధమాన సినీనటుడు.

సినీ నిర్మాతగా, పంపిణీదారుడిగా

సినీ నిర్మాతగా, పంపిణీదారుడిగా

కుమారస్వామి స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. సినీ నిర్మాతగా, పంపిణీదారుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తొలుత ‘చంద్రకారి' అనే చిత్రాన్ని నిర్మించారు. కుమారస్వామి కన్నడ కంఠీరవగా పేరొందిన సినీనటుడు రాజ్ కుమార్ కు ఆయన వీరాభిమాని. విద్యార్థి దశలో రాజ్ కుమార్ చిత్రాలు ఉన్న చొక్కాలను ధరించడం ఇందుకు నిదర్శనం.

చిత్రాలను నిర్మించారు

చిత్రాలను నిర్మించారు

సూర్యవంశ, గలాటి ఆళి మంత్రి వంటి చిత్రాలను నిర్మించారు. అనంతరం కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. కుమారస్వామి కుటుంబం కూడా పెద్దదే. హెచ్.డీ రేవణ్ణ, హెచ్.డీ రమేశ్, హెచ్.డీబాలకృష్ణ ఆయన సోదరులు. హెచ్.డీ అనసూయ, హెచ్.డీ శైలజ సోదరీమణులు. ప్రముఖ వైద్యుడు, జయదేవ్ వైద్యశాల డైరెక్టర్ డాక్టర్ మంజునాథ్ ఆయన సొంత బావ.

సున్నిత మనస్కుడు

సున్నిత మనస్కుడు

ఇక మానసికంగా కుమారస్వామి సున్నిత మనస్కుడు. కుమారస్వామికి మొదటినుంచీ రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు. తండ్రి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో సైతం ఆయన రాజకీయాలపై అంత ఆసక్తి చూపలేదు. జనతాదళ్(ఎస్) అధ్యక్షుడు మొరాజుద్దిన్ పటేల్ 1996లో చనిపోవడంతో కుమారస్వామి ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న అప్పటి పార్టీ నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కుమారస్వామి ఇద్దరూ పోటీపడ్డారు.

సిద్ధరామయ్య పార్టీని వీడారు

సిద్ధరామయ్య పార్టీని వీడారు

చివరికి దేవెగౌడ కుమారస్వామి వైపే మొగ్గుచూపడంతో సిద్ధరామయ్య పార్టీని వీడారు. అనంతరం 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కనకపుర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరవాతకాలంలో రాజకీయంగా ఎదురుదెబ్బలు తిన్నారు. 1998లో జరిగిన లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయారు. 1999 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయనను ప్రజలు తిరస్కరించారు. 2004లో రామనగర నుంచి మళ్లీ అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు.

రాధికా కుమారస్వామి

రాధికా కుమారస్వామి

ఇక సీఎం కుమారస్వామి భార్య రాధికా కుమారస్వామి ప్రస్తుతం గూగుల్‌లో ట్రెండ్ అవుతున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో రాధిక అందరికీ తెలుసు. ఆమె నటిగా చాలా సినిమాల్లో నటించారు. అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆమె 2006లో ఆమె కుమారస్వామిని పెళ్లాడారు. వీరికి ఓ కూతురు ఉంది. ఆమె పేరు షమిక కే స్వామి.

నీల మేఘ శ్యామతో...

నీల మేఘ శ్యామతో...

రాధికా కుమారస్వామి 2002లో నీల మేఘ శ్యామతో కన్నడ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. అయితే ఆమె హీరోయిన్‌గా చేసిన తొలి చిత్రం ‘భద్రాద్రి రాముడు'. ఇందులో హీరో నందమూరి తారక రత్న. ఇక రాధిక తొమ్మిదో తరగతి చదవగానే సినిమా ఫీల్డులోకి వచ్చింది. 31 ఏళ్ల రాధిక ఇస్సటికి 30కి పైగా సినిమాలలో నటించారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

2010లో తెలిసింది

2010లో తెలిసింది

2005లో రాధికా, కుమారస్వామిలకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నా కూడా వెంటనే వాళ్ల పెళ్లి గురించి బయటపెట్టలేదు. 2010లో అందరికీ వివాహం గురించి బయటకు తెలిసింది. ఇక కుమారస్వామికి 58 ఏళ్లు. అతని భార్య రాధికా కుమారస్వామికి 31 ఏళ్లు. ఇద్దరిదీ రెండో వివాహమే.

రాధిక మొదటి భర్త చనిపోయాడు

రాధిక మొదటి భర్త చనిపోయాడు

రాధిక 2000 సంవత్సరంలో రతన్ కుమార్‌ను పెళ్లాడారు. అప్పటికి ఆమె వయస్సు పద్నాలుగు. రెండేళ్లకు రతన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. అతను 2002లో కన్నుమూశాడు. దీంతో తర్వాత కుమారస్వామితో పరిచయం ఏర్పడి అతన్ని పెళ్లి చేసుకుంది.

రాధిక పేరు మారిమోగిపోతుంది

రాధిక పేరు మారిమోగిపోతుంది

గూగుల్ ట్రెండ్స్‌లో ప్రస్తుతం టాప్ స్థానంలో రాధిక కుమారస్వామి పేరు మారుమోగిపోతోంది.‘రాధిక కుమారస్వామి' అనే పదం భారత్‌లో సెర్చింజన్‌లకు సంబంధించిన 100 పాయింట్స్‌ ఇస్తే.. అది అత్యున్నతమైన సెర్చ్‌ పదం అని అర్థం. ఖతర్‌లో అనూహ్యంగా 36 పాయింట్లు, యూఏఈలో 22, శ్రీలంకలో 19, కువైత్‌లో 18 పాయింట్లు రావడం విశేషం.

సినిమాల్లో బిజీ

సినిమాల్లో బిజీ

2002 నుంచి 2006 వరకు ఆమె సినిమాల్లో బిజీ తారగా కొనసాగారు. కన్నడలో నటించిన నీలిమేఘశ్యామ, తావరిగె బాతంగి( పుట్టింటికి రాచెల్లీ ), నినరాగి, ప్రేమఖైదీ, రోమియో జూలియట్ చిత్రాల్లో నటించి శాండల్‌వుడ్‌ను ఒక ఊపు ఊపారు.

రమ్య వల్ల తెలిసింది

రమ్య వల్ల తెలిసింది

2010లో.. దక్షిణ భారత తార, కాంగ్రెస్‌ నాయకురాలు రమ్య, కుమారస్వామిలకు మధ్య ఓ దశలో ఏర్పడ్డ వాగ్యుద్ధంతో.. రాధికకు, కుమారస్వామికి వివాహమైన విషయం వెలుగులోకి వచ్చింది. కుమారస్వామి దాన్ని బహిరంగంగా అంగీకరించారు.

నిర్మాతగా కూడా

నిర్మాతగా కూడా

కన్నడలో కొన్ని ఫ్లాపులు రావడంతో తమిళంలో కూడా ఐదు సినిమాల్లో నటించింది రాధిక. కన్నడలో తాయీ ఇల్లడ తబ్బాలీ సినిమాలో కర్ణాటక రాష్ట్ర సినిమా పురస్కారం(ఉత్తమనటి) అందుకున్నది. ఐదారు సినిమాలకు షమిక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో నిర్మాణ బాధ్యతలు చూసుకున్నది.

మొదటి భార్య అనిత

మొదటి భార్య అనిత

ఇక కుమారస్వామికి మొదటి పెళ్లి 1986లో అయ్యింది. ఆయన మొదటి భార్య పేరు అనిత. వీరికి నిఖిల్ గౌడ(జాగ్వార్ మూవీ హీరో) కుమారుడు ఉన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామి రామనగర సీటును వదులుకున్నారు.. చెన్నపట్టణ నియోజకవర్గం శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి.. రామనగర సీటును వదులుకున్నారు. అక్కడి నుంచి తన భార్య అనితను పోటీలోకి దించనున్నారు.

రెండో భార్యకు దూరంగా

రెండో భార్యకు దూరంగా

అయితే కుమారస్వామి వ్యక్తిగత జీవితం అనేక మలుపులు తిరిగింది. కొన్నేళ్లుగా రెండో భార్యకు దూరంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పేరుకు రాధిక కుమారస్వామి భార్య అయినా పెత్తనం మొత్తం అనితదేట. కుమారస్వామి, రాధిక ఇద్దరూ వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

భార్యతోనే బర్త్ డే

భార్యతోనే బర్త్ డే

కుమారస్వామి 2012 డిసెంబర్ 16వ తేదీన 54వ పడిలో పడ్డప్పుడు పార్టీ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టి కేవలం తన రెండో భార్య రాధికతో కలిసి గడిపారు. రాధికా కుమారస్వామి, కూతురు షమికలతో కలిసి కేక్ కట్ ఆనందంగా గడిపారు. అలాగే పలుమార్లు పుట్టిన రోజు పార్టీలు రాధికతోనే నిర్వహించుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే కుమారస్వామికి రాధిక అంటే ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవొచ్చు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆమెకు దూరంగా ఉన్నట్లున్నాడు.

కాస్త ప్రశ్నార్థకమే

కాస్త ప్రశ్నార్థకమే

అయితే ఈ కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామికి ఈ పదవి కచ్చితంగా ముళ్ళకిరీటం వంటిది. కాంగ్రెస్ తో వ్యవహారం నడపడం కష్టమన్న సంగతి కొత్త విషయం ఏమీకాదు. పేరుకు ముఖ్యమంత్రి అయినప్పటికీ పెద్దన్నగా హస్తం పార్టీ తెరవెనక నుంచి చక్రం తిప్పడం ఖాయం. అది పెట్టే డిమాండ్లను, షరతులను ఆమోదించి ముఖ్యమంత్రి పదవిలో ఎంతకాలం కొనసాగగలరన్నది ప్రశ్నార్థకం.

English summary

Who is Radhika Kumaraswamy? Lesser known facts about wife of Karnataka's new chief minister

Who is Radhika Kumaraswamy? Lesser known facts about wife of Karnataka's new chief minister
Story first published:Wednesday, May 23, 2018, 17:28 [IST]
Desktop Bottom Promotion