For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎప్పుడైనా లైంగిక సంబంధం తర్వాత కొందరు ధూమపానానికి ఎందుకు మొగ్గు చూపుతారు అని ఆలోచించారా?

|

ఎప్పుడైనా లైంగిక సంబంధం తర్వాత కొందరు ధూమపానానికి ఎందుకు మొగ్గు చూపుతారు అని ఆలోచించారా?

లైంగిక సంబంధం తర్వాత జంటలు చేసే మొదటి పని ఏమిటి? కొందరు నిద్రకు ఉపక్రమిస్తారు దీనికి కారణం మెదడులోని డోపమైన్ ఉత్తెజితమవ్వడమే, కొందరు ఆకలి కారణంగా ఏదైనా తినడానికి మొగ్గుచూపుతుంటారు. అవునా ? కానీ భాదాకరంగా చాలామంది ధూమపానానికి కూడా మొగ్గుచూపుతుంటారు.

ఒక్కోసారి దంపతులిద్దరూ కూడా ధూమపానానికి పూనుకుంటారు, కానీ లైంగిక సంబంధం తర్వాత వెంటనే ధూమపానం చేయడం ఎంతవరకు సమంజసం ? ఎప్పుడైనా ఆలోచించారా.

Why Do People Smoke After Sex

ఎందుకు ఎక్కువ మంది ప్రజలు లైంగిక సంబంధం తర్వాత ధూమపానానికి మొగ్గుచూపుతారు ? అనే అంశం గురించిన వివరాలు తెలుసుకునేందుకు ఈ వ్యాసం దోహదపడుతుంది. ఇది ప్రజలు కావాలని చేసే, లేదా మనసు ధూమపానం మీదకు వెళ్ళడం వలన మాత్రమే కాదు, దానికి ఆశ్చర్యకరంగా ఒక చరిత్ర కూడా ఉంది ?

ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం.

1960 మరియు 70 లలో సినిమాల ద్వారా ఈ అలవాటు ప్రారంభమైంది, ఇక్కడ నిర్మాతలు, జంటల మధ్య సన్నిహిత సన్నివేశాలను చూపించలేని కారణంగా, అందులోని నటీనటులు సన్నిహితంగా ఉన్నారని ప్రజలను నమ్మించే పనిలో భాగంగా పురుషులు ధూమపానం చేస్తున్నట్లు, తద్వారా నటీనటుల మద్య ఒక సంబంధం జరిగింది అని భ్రమించేలా సృజనాత్మక ఆలోచనలు చేశారు. కానీ సినిమాల్లో హీరో చిరిగిన బట్టలు వేసుకున్నా, అదొక ట్రెండ్ లా భావించి ఫాలో అయ్యే కొందరు, లైంగిక సంబంధం తర్వాత ధూమపానo చేయడం ఒక పోష్ చర్యగా భావించడం వలెనే ఈ సమస్య ఒక వ్యాధిలా జనాలకు అంటుకుంది.

ధూమపానం సంబంధంలో భాగమైంది :

ధూమపానం సంబంధంలో భాగమైంది :

స్మోకింగ్ అనేది సంబంధంలో ఒక భాగంగా భావించడం మొదలుపెట్టారు జనాలు.

నటీనటులు మంచం మీద సంబంధంలో ఉన్నట్లు భ్రమను కల్పించడం కోసం ధూమపానాన్ని ఉపయోగిస్తే, అది ధూమపానం లేకుంటే సంబంధమే లేనట్లుగా జనాల్లో ముద్రని వేసింది. సినిమాల ప్రభావం పిల్లలమీద, యువత మీద పడుతుంది అని ఎన్నో స్వచ్చంద సంస్థలు గగ్గోలు పెడుతున్నా, రాబడిని దృష్టిలో ఉంచుకుని కొందరు చేసే ప్రయోగాలు ఇలాంటి వికృత చర్యలకు కారణంగా మారుతున్నాయి. పైగా అదేముందిలే అని లైట్ తీసుకునే వారే ఎక్కువ, తద్వారా ధూమపానం వంద్యత్వ సమస్యలకు, కాన్సర్, శ్వాసకోస , మూత్ర పిండాల, గుండె, మెదడు, రక్త పోటు మరియు కాలేయ సంబంధిత వ్యాధుల వంటి ప్రాణాంతక సమస్యలకు కారణమని తెలిసినా స్టైల్ కోసం మొదలెట్టిన సిగరెట్, ప్రాణాలను తీసే దాకా వీడని బానిసగా చేస్తుంది.

ధూమపానం ఆహ్లాదకరమైనదిగా పరిగణించబడుతుంది :

ధూమపానం ఆహ్లాదకరమైనదిగా పరిగణించబడుతుంది :

మీరెప్పుడైనా ధూమపానం చేసేవారిని, మీకెప్పుడు ధూమపానం చెయ్యాలనిపిస్తుంది అని అడిగితే, ఎక్కువ శాతం భోజనం తర్వాత అని సమాధానం ఇస్తుంటారు, అవునా ? భోజనం తర్వాత రెస్టారెంట్స్లో మనం తీసుకునే డిజర్ట్స్ ఒకరకమైన ఆహ్లాదాన్ని ఇస్తాయి. అదే అనుభూతిని వీరు భోజనం తర్వాత ధూమపానం ద్వారా పొందుతారు.

నికోటిన్ అవసరమైన పదార్ధమని వీరి భావన:

నికోటిన్ అవసరమైన పదార్ధమని వీరి భావన:

క్రమంతప్పకుండా నికోటిన్ తీసుకునే అవసరాన్ని అధికంగా భావిస్తారు అనేకులు. మరియు ముందు నికోటిన్ స్థాయిల కన్నా అధికంగా శరీరం కోరుకోవడం పరిపాటిగా మారుతుంది. నెమ్మదిగా శరీరాన్ని జీవచ్చవంలా చేసేస్తుంది. ఒక నమ్మక ద్రోహిని మనం స్నేహితుడు అనుకుంటే, వెన్నుపోటుకు గురైనప్పుడు, చేసిన తప్పు మనసుకు స్ఫురిస్తుంది. అవునా కాదా. అలాంటి నీచమైన స్నేహితుడే నికోటిన్.

ఇది ఒక మానసిక కార్యాచరణ:

ఇది ఒక మానసిక కార్యాచరణ:

లైంగిక సంబంధం శారీరక మరియు మానసిక చర్యగా పరిగణించబడుతుంది. దీనికి ఏకాగ్రత మరియు కృషి చాలా అవసరం మరియు అలసటతో ముగిసినాకూడా, సంతృప్తిని ఇస్తుంది, భాగస్వామితో ఉన్న అనుబంధం మూలంగా. నికోటిన్ స్థాయిలు ఈ సమయంలో గణనీయంగా తగ్గుముఖం పట్టడం వల్ల, శరీరం అనుకోకుండా నికోటిన్ పట్ల ఆసక్తిని చూపడం ప్రారంభిస్తుంది. తద్వారా లైంగిక సంబందం తర్వాత ధూమపానం చేయడం శరీరానికి అత్యంత సంతృప్తికర అంశంగా పరిగణించబడుతుంది.

సంబంధంలో మార్పులు :

సంబంధంలో మార్పులు :

లైంగిక సంబంధం తర్వాత జంటలు గడిపే కాస్త సమయం సాధారణంగా వారిమధ్య బంధం కోసం ఉద్దేశించబడింది. ఇద్దరు వ్యక్తులు ఒక్కోసారి సంతృప్తిగా ఉన్నా కొన్ని సమయాల్లో తీవ్రమైన భావోద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. కానీ భాగస్వాములు ఇద్దరూ ధూమపానం చేసే అలవాటుని కలిగి ఉంటే, వారిద్దరూ సంబంధం తర్వాత ధూమపానానికి మొగ్గుచూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరియు వారిద్దరూ ధూమపానాన్ని తమ సంబంధంలో ఒక భాగంగా భావిస్తూ ఉంటారు. వారి మద్య ఐక్యతకు దూమపానమే కారణమని వీరి భావనగా ఉంటుంది. కానీ నెమ్మదిగా వారి లైంగిక సంబంధంలో అనివార్య మార్పులు, వంధ్యత్వం, శీఘ్రస్ఖలన సమస్యలు, వ్యాధుల కారణంగా భవిష్యత్తులో సంబంధం అంటేనే భయపడే తీవ్ర స్థితికి చేరుకుంటారు.

మీరేమనుకుంటున్నారు? లైంగిక సంబంధం అనంతరం ధూమపానం తప్పనిసరా? లేదా మీరు ధూమపానం వలన కలిగే సమస్యల పట్ల అవగాహనని కలిగి ఉన్నారా? మీ వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

Why Do People Smoke After Sex

Have you ever imagined why people tend to smoke after having sex? During the 1960s, a lot of movies could not show the intimate scenes between couples and hence they were resorted to creative ideas to reflect that the actors had been intimate and showing the men smoking was the whole concept from where this idea came up.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more