2018లో మీ రాశి ప్రకారం మీరు చేపట్టే పనులు విజయం అవుతాయా? విఫలం అవుతాయా?

Written By:
Subscribe to Boldsky

2018లో మీరు చేపట్టేబోయే పనులు విజయవంతం అవుతాయో లేదోనని మీరు చాలా ఆందోళన చెందుతూ ఉండొచ్చు. అయితే మీ రాశి ప్రకారం మీకు గ్రహాలు అనుకూలంగా ఉంటే ఎన్ని ప్రతికూల శక్తులు అడ్డు వచ్చినా మీరు చేపట్టే పనులు విజయవంతం అవుతాయి.

మిథునం (మే 22 - జూన్ 21)

మిథునం (మే 22 - జూన్ 21)

ఈ ఏడాది మీరు అనుకున్న రంగాల్లో విజయం సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. మీకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతస్థానాలకు ఎదుగుతారు. మీరు చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది.

తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)

తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)

మీరు 2017లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. అయితే 2018లో మాత్రం మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి ఇబ్బందులున్నా కూడా నీతిగా నిజాయితీగా ఉండండి.

ధనస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)

ధనస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)

గతేడాది మీరు చేపట్టిన ప్రతి పనికి ఆటంకాలు ఎదురై ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం మీరు చేపట్టబోయే పనులు విజయవంతం అవుతాయి. మీకు ఎలాంటి ఆటంకాలు కలగవు.

సింహరాశి (జూలై 23 - ఆగస్టు 22)

సింహరాశి (జూలై 23 - ఆగస్టు 22)

2018లో మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మీరు చేపట్టబోయే ప్రతిపని విజయవతం అవుతుంది. మీరు ఎక్కువగా ఆవేశపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)

మీకు 2018 లో అన్నీ సంతోషాలే ఉంటాయి. మీరు గతేడాది ఏ పని చేపట్టినా ఏదైనా ఆటంకం వచ్చి మధ్యలోనే ఆగిపోయి ఉంటుంది. అయితే మీరు ఈసారి చేపట్టే ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.

కర్కాటకం (జూన్ 22 - జూలై 22)

కర్కాటకం (జూన్ 22 - జూలై 22)

కర్కాటకరాశి వారు ఈ ఏడాది ఏదైనా పనులు చేపట్టాలంటే వారి చుట్టు పక్కన ఉండే వారు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తేలా చేస్తారు. అందువల్ల వీరి పనులు అంతగా బాగా సాగవు. కొన్నింటిలో ఆటంకాలు వస్తాయి.

కన్య (ఆగస్టు 23 - సెప్టెంబర్ 22)

కన్య (ఆగస్టు 23 - సెప్టెంబర్ 22)

కన్యరాశి వారికి ఈ ఏడాది కొద్దిగా మంచే జరిగినా కొన్ని విషయాల్లో మాత్రం చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మీకు పోటీగా చాలామంది ప్రత్యర్థులు ఉంటారు. మీ వ్యాపారాన్ని లేదంటే మీ ఉద్యోగాన్ని దెబ్బతీసేందుకు వారు ప్రయత్నిస్తుంటారు. మీరు ఉండే రంగంలో ఎదగకుండా ఉండేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తారు. అందువల్ల మీరు కాస్త జాగ్రత్తగా ముందడుగు వెయ్యాలి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19)

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19)

గతేడాది మీరు చాలా కష్టాలు ఎదుర్కొని ఉంటారు. మీరు మీ దగ్గరివాళ్లు, మీ స్నేహితుల వల్ల కూడా చాలా ఇబ్బందులుపడి ఉంటారు. అయితే ఈ ఏడాది కూడా మీరు చేపట్టబోయే కొన్ని పనులకు అలాంటి ఆటంకాలు వస్తాయి. కానీ మీరు ఓపికతో ఉంటే కచ్చితంగా విజయం వరిస్తుంది.

మకరరాశి (డిసెంబర్ 22 - జనవరి 20)

మకరరాశి (డిసెంబర్ 22 - జనవరి 20)

ఈ ఏడాది మీకు అనుకూలంగానే ఉంటుంది. మీ రంగంలో మీరు చేపట్టేబోయే పనులు విజయవంతం అవుతాయి. అయితే మీరు సమయాన్ని వేస్ట్ చేయకుండా ముందుకెళ్తే చాలా మంచింది.

వృషభం (ఏప్రిల్ 21 - మే 21)

వృషభం (ఏప్రిల్ 21 - మే 21)

గతేడాది మీరు కొన్ని రకాల ఇబ్బందులుపడి ఉంటారు. అయితే ఈ సారి మీకు కాస్త అనుకూల పరిస్థితులుంటాయి. మీరు చేపట్టేబోయే పనిని ధైర్యంగా చేపట్టండి. దీంతో మీరు ఈజీగా మీ లక్ష్యాన్ని సాధించగలుగుతారు.మీరు చేపట్టే పనులు దాదాపుగా నెరవేరుతాయి. కొన్ని నేరవేరకపోయిన అధైర్యపడకండి.

వృశ్చికరాశి (అక్టోబర్ 23 - నవంబర్ 21)

వృశ్చికరాశి (అక్టోబర్ 23 - నవంబర్ 21)

మీరు మీ కష్టాలను ఎవరితో చెప్పకుండా మీలో మీరే కుమిలిపోతుంటారు. అయితే దీనివల్ల మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మీచుట్టు ఉన్నవారితో మీ సమస్యలను చెప్పుకోండి. 2018లో మీ కష్టాల్లో మీ సన్నిహితులు మీకు తోడుగా ఉంటారు. మీరు చేపట్టే పనులు దాదాపు విజయవంతం అవుతాయి.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20)

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20)

మీకు భావోద్వేగాలు ఎక్కువ. మీరు ప్రతి చిన్న విషయానికి మీలో మీరు బాధపడిపోతుంటారు. మిమ్మల్ని విమర్శించే వాళ్లని చంపేయాలనే కోపం మీకు వస్తుంది. అలా అని మీరు చెడ్డవారు. మీరు ఎవ్వరి జోలికి వెళ్లరు. మీ జోలికి ఎవరైనా వస్తే తట్టుకోలేరు. మీరు ఈ ఏడాది చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది.

English summary

Zodiac Ranking Of Who Will Be The Happiest In 2018

Zodiac Ranking Of Who Will Be The Happiest In 2018
Story first published: Thursday, January 4, 2018, 9:30 [IST]