For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎవరైనా టాబ్లెట్ మింగుతారు కానీ, టాబ్లెట్ షీట్ మింగుతారా ?

క్రమంగా నొప్పి ఎక్కువవడంతో, ఆసుపత్రికి వెళ్లి ఆహారంతీసుకునే సమయంలో తనకు గల అసౌకర్యం గురించి వైద్యులకు తరచుగా ఫిర్యాదు చేసేది. ఆసుపత్రిలోని ENT స్పెషలిస్ట్స్ ఆమె ద్రవాలను తీసుకోవడంలో ఇబ్బందిపడుతుందని,

|

ఒక్కోసారి గాడ నిద్రలో ఉన్నప్పుడు, లేదా మత్తులో ఉన్నప్పుడు, అనాలోచితంగా కొన్ని పనులు చేస్తుంటాము. కొన్ని సందర్భాలలో చిన్న చిన్న తప్పులే తీవ్రంగా మారి ప్రాణాల మీదకు తెస్తుంది. ఉదాహరణకు, కొందరు నిద్రలో వస్తువులను తన్ని, అవి మీద పడి గాయపడే సందర్భాలు కూడా తరచుగా వింటుంటాం. ఇక్కడ చెప్పబోయే కథనంలోని మహిళ, ఏకంగా టాబ్లెట్ షీట్ మింగేసి 17 రోజుల పాటు నరకయాతన అనుభవించింది. ఈ విచిత్ర సంఘటన గురించిన మరిన్ని వివరాలు …

ఆమె సగం రాత్రిలో నిద్ర మత్తులో టాబ్లెట్ వేసుకోబోయింది ….

ఆమె సగం రాత్రిలో నిద్ర మత్తులో టాబ్లెట్ వేసుకోబోయింది ….

ఒక 40 సంవత్సరాల వయసుగల మహిళ, ఒక రోజు రాత్రి మధ్యలో అనాలోచితంగా ఒక టాబ్లెట్ వేసుకోబోయింది. అది కూడా టాబ్లెట్ షీట్ నుండి, టాబ్లెట్ బయటకు తీయకుండా తెలియని మత్తులో ఈ చర్యకు పాల్పడింది . ఉదయం నిద్ర లేచిన తర్వాత గొంతులో ఏదో సమస్య తలెత్తిందని అర్ధం చేసుకుని, క్రమంగా వైద్యుని సందర్శించి సమస్యను వివరించినా, 17 రోజుల పాటు వైద్యులు గుర్తించలేకపోయారు.

అనేకమార్లు వైద్యులను సందర్శించినా ఫలితం లేకపోయింది..

అనేకమార్లు వైద్యులను సందర్శించినా ఫలితం లేకపోయింది..

క్రమంగా నొప్పి ఎక్కువవడంతో, ఆసుపత్రికి వెళ్లి ఆహారంతీసుకునే సమయంలో తనకు గల అసౌకర్యం గురించి వైద్యులకు తరచుగా ఫిర్యాదు చేసేది. ఆసుపత్రిలోని ENT స్పెషలిస్ట్స్ ఆమె ద్రవాలను తీసుకోవడంలో ఇబ్బందిపడుతుందని, కానీ ఆమె శ్వాస తీసుకోవడంలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవని నిర్ధారించారు. కానీ, మెడను కదిలించే సమయంలో నొప్పి ఎక్కువగా ఉందని గ్రహించారు. క్రమంగా సోర్ థ్రోట్ అని నిర్ధారించుకుని., తాత్కాలిక ఉపశమనమనానికి యాంటీ బయాటిక్స్ రాసిచ్చారు.

4 వ మారు వైద్యులను సందర్శించినప్పుడు, ఆమె పరిస్థితిని నిర్థారించడం జరిగింది...

4 వ మారు వైద్యులను సందర్శించినప్పుడు, ఆమె పరిస్థితిని నిర్థారించడం జరిగింది...

ఎన్ని యాంటీ బయాటిక్స్ ఉపయోగించినా, ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఎక్స్-రే చేయగా, అందులో కూడా ఎటువంటి అసాధారణ వస్తువూ కనపడలేదు. దీనికి కారణం ఆ షీట్ అంత సన్నదిగా ఉండడమే. క్రమంగా ఎటువంటి సమస్య లేదని, మహిళకు అంతా బాగానే ఉందని, రాబోయే రోజుల్లో ఎలాంటి మెరుగుదల గమనించకపోతే తిరిగి రావాలని ఆమెకు సూచించారు. 4 వ సందర్శనలో జరిగిన స్కాన్లో గొంతు వెనుక భాగంలో ఒక వస్తువు ఉన్నట్లుగా గమనించారు.

Most Read :ఈ రాశుల వారి దశ తిరగనుంది, ప్రేమలో విజయం సాధిస్తారు, ఇష్టపడ్డ వ్యక్తులే వచ్చి మనస్సులో మాట చెబుతారుMost Read :ఈ రాశుల వారి దశ తిరగనుంది, ప్రేమలో విజయం సాధిస్తారు, ఇష్టపడ్డ వ్యక్తులే వచ్చి మనస్సులో మాట చెబుతారు

టాబ్లెట్ షీట్ అంతర్గతంగా సర్దుకుని నిలబడింది కానీ, చెక్కుచెదరలేదు!

టాబ్లెట్ షీట్ అంతర్గతంగా సర్దుకుని నిలబడింది కానీ, చెక్కుచెదరలేదు!

స్కానింగ్లో టాబ్లెట్ షీట్ కనుగొన్న వైద్యులు ఆ మహిళా పరిస్థితి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రమంగా తేలికపాటి సర్జరీతో, 17 రోజుల తర్వాత ఆ టాబ్లెట్ షీట్ తొలగించడం జరిగింది. సగం నిద్రలో ఉన్న కారణంగా తెలియక జరిగిన తప్పిదంగా ఆమె వివరించింది. కానీ, కేవలం ద్రవాల మీద ఆధారపడిన కారణంగా, బలహీనతకు గురైంది. ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటుందని వైద్యులు వెల్లడించారు.

మీకు నచ్చినట్లయితే

మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

Most Read :కామంతో కళ్లు మూసుకుపోయాయి.. శారీరక సుఖం కోసం మేకను కూడా వదలలేదుMost Read :కామంతో కళ్లు మూసుకుపోయాయి.. శారీరక సుఖం కోసం మేకను కూడా వదలలేదు

English summary

Woman Had a Plastic Pill Packaging Lodged in Her Throat

She Had A Plastic Pill Packaging Lodged In Her Throat For 17 Days
Desktop Bottom Promotion