For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Amazon CEO Jeff Bezos:కలియుగ కుబేరుడు జెఫ్ బెజోస్ సక్సెస్ సీక్రెట్స్ ఇవే...

జెఫ్ బెజోస్ విజయం సాధించేందుకు చెబుతున్న సీక్రెట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రపంచ కుభేరుల్లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అనేక సార్లు అగ్ర స్థానంలో నిలిచారు. అపారమైన సంపదను సొంతం చేసుకున్న జెఫ్ అమెజాన్ సిఇఒగా ఇటీవల గుడ్ బై చెప్పేశాడు.

Amazon CEO Jeff Bezos Secrets to Success in Life in Telugu

తన కెరీర్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనవంతుడిగా రికార్డు నెలకొల్పాడు. ఆన్ లైన్ లో పుస్తకాలు అమ్మాలనే తన ఆలోచనతో మంచి ఉద్యోగాన్ని వీడాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే తన యజమాని నుండి అద్భుత అవకాశం వచ్చినా దాన్ని సైతం వదులుకున్నాడు.

Amazon CEO Jeff Bezos Secrets to Success in Life in Telugu

తన కలను నిజం చేసుకోవడానికి ప్రపంచంలో పరుగెత్తడం ప్రారంభించాడు. అప్పటి నుండి ఇప్పటివరకు తన సంపద పుట్టగొడుగుల్లా పెరుగుతూ పోయింది.. ఇప్పుడు తన కంపెనీ సేవలందించని ప్రాంతాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. తన జీవితంలో ఇంత గొప్ప విజయం సాధించిన జెఫ్ బెజోస్ విజయ రహస్యాల గురించి పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఈ సందర్భంగా తన అభిరుచులు, అలవాట్ల గురించి ఓసారి తెలుసుకుందామా...

సొంత సంస్థలా..

సొంత సంస్థలా..

ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలిసిన ఈ-కామర్స్ సంస్థ అమెజాన్. ఈ కంపెనీలో ప్రస్తుతం సుమారు ఆరు లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక్కడ పని చేసే వారంతా తమ కంపెనీని సొంత సంస్థలా భావిస్తారని, ఇదే తన సక్సెస్ ఫార్ములా అని జెఫ్ బెజోస్ అంటూ ఉంటారు. ఉద్యోగులతో మంచి సత్సంబంధాలు ఉండేలా చూసుకుంటూ.. వ్యక్తిగతంగా లెటర్లు రాస్తుంటానని, రెగ్యులర్ గా వారితో మీటింగ్స్ ఏర్పాటు చేస్తుంటారు. తమ సంస్థలో బాధ్యతతో, నిజాయితీగా పని చేసే వారందరికీ పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇన్సెంటివ్స్ కచ్చితంగా లభిస్తాయని, తాను ఇంత గొప్ప స్థానానికి చేరడానికి, ఇంతటి విజయం వెనుక నా ఉద్యోగులందరి ఎనలేని క్రుషి ఉందని జెఫ్ ఎన్నోసార్లు చెప్పారు.

నెంబర్ వన్ కంటే..

నెంబర్ వన్ కంటే..

తాజాగా ప్రపంచంలోనే నెంబర్ వన్ కుభేరుని స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన మిలినీయర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా.. ఓ విలేకరి ఇప్పుడు ఎలా ఫీలవుతున్నారని అడగగా.. తనకు నెంబర్ వన్ పొజిషన్ కంటే సంపద క్రియేట్ చేసే వ్యక్తిగా, అలాంటి యజమానిగా ఉండటం అంటేనే ఇష్టమని చెప్పాడు. ఆయన స్నేహితులను, ఆయనకు తెలిసిన వారిని ఎవరిని అడిగినా తన గురించి చాలా గొప్పగా చెబుతారు. జెఫ్ బెజోస్ కు ఇసుమంతైనా అహంకారం లేదని చెబుతారు. ఎంత డబ్బు సంపాదించినా ఏ మాత్రం గర్వం లేదని చెబుతారు. ముఖ్యంగా కిందిస్థాయి ఉద్యోగులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు.

పోటీ సహజమే..

పోటీ సహజమే..

వ్యాపారంలో పోటీ అనేది చాలా సహజమే. అయితే పోటీదారులు మనల్ని దాటిపోవడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. అమెజాన్ కంపెనీ ప్రారంభించినప్పుడు చాలా చిన్న స్టార్టప్ కంపెనీ. అప్పటికే చాలా వాల్ మార్ట్ దిగ్గజ కంపెనీలో మార్కెట్లో ఉన్నాయి. అయినా కూడా బెజోస్ ఏ మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోలేదు. వినియోగదారులకు ఏమి కావాలి.. వారి మనసును దోచే ప్రయత్నాలు.. ప్రయోగాలు ఎన్నో చేశారు. అంతేకాదు అమెజాన్ కంపెనీకి చిన్న మిస్డ్ కాల్ ఇస్తే చాలు వారికి అతి తక్కువ సమయంలోనే ఫోన్ చేయడం.. వారు కోరుకున్న వస్తువులను వారి ఇంటికి చేర్చడం.. వారికి నచ్చకపోతే రిటర్న్ చేయడం వంటి ఫెసిలిటీస్ కల్పించారు. అంతేకాదు వారికి ప్రాడక్ట్ నచ్చకపోతే అందుకు గల కారణాలు తెలుసుకునేవారు. అలా వినూత్న మార్పులతో మార్కెట్ మొత్తం తన చుట్టూ చేరేలా చేసుకున్నారు.

ఎక్కడా ఆగలేదు..

ఎక్కడా ఆగలేదు..

జెఫ్ అభిప్రాయం ప్రకారం, వ్యాపారం డెవలప్ మెంట్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది. విజయవంతంగా వ్యాపారాన్ని కొనసాగించడం ఒకటి. రెండోది.. వ్యాపారాన్ని మరింత డెవలప్ చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించడం. ఆన్ లైనులో పుస్తకాలు అమ్మడంతో మొదలైన ఈ కంపెనీ తర్వాత అన్ని రంగాలకు విస్తరించింది. కేవలం ఒక్క సక్సెస్ తో ఆగిపోయి ఉంటే.. అమెజాన్ ఇప్పుడున్నంతలా విస్తరించేది కాదు. ఇప్పుడు గుండు సూది నుండి గుమ్మడి కాయ వరకు, ఉప్పు నుండి ఊరగాయ వరకు అన్నీ అమెజాన్లో కొనుక్కోవచ్చు. అయితే ఇంత సామ్రాజ్యాన్ని జెఫ్ ఒక్కరోజులో విస్తరించలేదు. అలాగే తన ప్రయాణం ఎక్కడా ఆగలేదు. ఎలాంటి ఉత్పత్తుల అమ్మాలి? కొత్త ఐడియాలను ఎలా ఆచరణలో పెట్టాలి అని మార్కెట్ ను పరిశోధించడానికి అమెజాన్ లో ఒక టీమ్ ఉంటుంది.

సరికొత్త ఆలోచనలు..

సరికొత్త ఆలోచనలు..

ఈ ప్రపంచంలో మేధావులు, సమర్థులు తెలివైన వాళ్లు ఎందరో ఉన్నారని బెజోస్ నమ్ముతారు. వారి వద్ద టన్నుల కొద్దీ సరికొత్త ఆలోచనలు ఉంటాయని అవి ఆచరణలో పెట్టినప్పుడే మంచి విజయం దక్కుతుందని, అయితే అది ఆలోచనగానే మిగిలిపోతే విజయం సాధించడం కష్టమని చెప్పారు. తమ ఐడియా సక్సెస్ అయ్యే సమయంలో ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుందన్నారు.

బెజోస్ అలవాట్లు..

బెజోస్ అలవాట్లు..

ప్రపంచంలో నెంబర్ వన్ కుభేరుడిగా ఉండే బెజోస్ ప్రతిరోజూ ఎంత బిజీగా ఉంటారో ఊహించడం కష్టమే. అయితే తను ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా.. కాసేపు ఖాళీ దొరికితే మాత్రం తాను ‘స్టార్ ట్రెక్' చూడటం చేస్తారట. ఇది టెలివిజన్లో వచ్చే పాపులర్ ప్రోగ్రామ్. అలాగే నాసా విడుదల చేసే రాకెట్ల నుండి సముద్రాల్లో శకలాలను ఎప్పటికప్పుడు సేకరించడం వంటివి చేస్తుంటారట. అప్పుడప్పుడూ ఈ శకలాల అన్వేషణకు తన పిల్లల్ని కూడా తీసుకెళ్తారట.

English summary

Amazon CEO Jeff Bezos' Secrets to Success in Life in Telugu

Here we are talking about the amazon CEO jeff bezos' secrets to success in life in Telugu. Have a look
Desktop Bottom Promotion