For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పట్టుచీరపై రామాయణం.. 60 మీటర్ల వస్త్రంపై 32 వేల సార్లు ‘జై శ్రీరామ్’.. ఆంధ్రా నేతన్న నుండి అద్భుత కళాఖండం...

60 మీటర్ల పట్టుచీరపై ‘జై శ్రీరామ్’ నామాన్ని 13 భారతీయ భాషల్లో 32, 200 సార్లు వచ్చేలా డిజైన్ చేసిన ఆంధ్రా చేనేత కళాకారుడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి శ్రీసత్య సాయి జిల్లాలోని ధర్మవరానికి చెందిన జురాజు నాగరాజు అనే నేతన్న అద్భుతమైన కళా ఖండాన్ని ఆవిష్కరించాడు. 60 మీటర్ల పట్టు చీరపై 13 భారతీయ భాషల్లో ఏకంగా 32, 200 సార్లు 'జై శ్రీరామ్' అనే నామాన్ని డిజైన్ చేసి రూపొందించాడు.

Andhra Pradesh loomsman weaves 60-metre silk sari with Jai Shri Ram written in 13 Indian languages

అంతేకాదండోయ్ ఆ పట్టు వస్త్రంపై రామాయణ ఘట్టాలను సైతం డిజైన్ చేశాడు. నాగరాజు రూపొందించిన ఈ చీరను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీన్ని సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయ్యింది. నాగరాజు స్వయంగా రూపొందించిన ఈ ప్రత్యేకమైన పట్టు వస్త్రాన్ని 'రామ కోటి వస్త్రం'గా పిలుస్తున్నట్లు నాగరాజు వివరించారు.

Andhra Pradesh loomsman weaves 60-metre silk sari with Jai Shri Ram written in 13 Indian languages

ఈ పట్టు వస్త్రంపై రామాయాణంలోని సుందరకాండలోని 168 ఘట్టాలను కళ్లకు కట్టేలా రూపొందించినట్లు వెల్లడించాడు. దీన్ని రూపొందించడం అంత సులువు కాదని.. దీని కోసం చాలా కష్టపడినట్టు వివరించారు. ఖర్చు కూడా భారీగానే అయ్యిందని తెలిపాడు.

ఈ పట్టుచీర దాదాపు 16 కిలోల బరువు ఉంటుందని, 44 ఇంచుల వెడుల్పు ఉన్న ఈ చీరను రూపొందించేందుకు 4 నెలల సమయం పట్టిందని పేర్కొన్నాడు. దీని కోసం సుమారు ఒకటిన్నర లక్ష రూపాయలు ఖర్చయ్యిందన్నారు. ఈ చీరను రూపొందించేందుకు తనకు మరో ముగ్గురు సహాయం చేసినట్లు వివరించారు.

ఈ చీరను అయోధ్యలో నిర్మించే రామాలయంలో రాముడికి సమర్పించనున్నట్లు వివరించాడు.

English summary

Andhra Pradesh loomsman weaves 60-metre silk sari with Jai Shri Ram written in 13 Indian languages

Andhra Pradesh loomsman weaves 60-metre silk sari with Jai Shri Ram written 32,200 times in 13 Indian languages. Know more
Story first published:Thursday, April 21, 2022, 15:07 [IST]
Desktop Bottom Promotion