For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భర్తనే భగవంతుడిగా భావించిన భార్య.. భర్త విగ్రహానికి ప్రతిరోజూ పూజ...

ఆంధ్రప్రదేశ్ మహిళ తన భర్తపై ప్రేమతో తను చనిపోయినా గుడి కట్టి ప్రతిరోజూ పూజ చేస్తోంది. ఆ విశేషాలేంటో మీరు చూడండి.

|

సినిమా హీరోలకు, హీరోయిన్లకు వారి అభిమానులు విగ్రహాలు పెట్టడం.. వారికి అనునిత్యం ఆలయాలు కట్టి పూజలు చేయడాన్ని మనం ఇది వరకే చూశాం. అయితే తాజాగా తన భర్త విగ్రహాన్ని పెట్టి గుడి కట్టేసిందో మహిళ. అంతేకాదండోయ్ ప్రతిరోజూ ఆ గుడిని శుభ్రం చేస్తూ.. విగ్రహాన్ని అలంకరిస్తూ పూజలు చేస్తోంది ఓ భార్య. 'నిజమైన ప్రేమ ఎన్నటికీ చావదు' అని నిరూపిస్తోంది. ఇదంతా ఎక్కడో తెలుసా.. మన తెలుగు రాష్ట్రాల్లోనే. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఏ జిల్లాకు చెందిన ఆమె? తన భర్త విగ్రహానికి ప్రతిరోజూ ఎందుకు పూజలు చేస్తోందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Andhra Pradesh woman builds temple for late husband, offers prayers to his idol everyday

PC : Youtube

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని పద్మావతి మరియు అంకిరెడ్డి కొన్ని సంవత్సరాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఐదు సంవత్సరాల క్రితం తన భర్త మరణించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తన భర్తను మరచిపోలేక.. చనిపోయిన తన భర్త పేరిట ఓ ఆలయాన్ని నిర్మించింది. అంకిరెడ్డి విగ్రహాన్ని పాలరాయితో తయారు చేయించింది. అంతేకాదు తన విగ్రహం ఎదుట చేరి ప్రతిరోజూ ప్రార్థనలు మరియు పూజలు చేస్తోంది. తన భర్త ఐదో వర్ధంతి సందర్భంగా తను విగ్రహ ప్రతిష్టాపన చేసింది.

తన భర్త రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించాడు. తన అకాల మరణంతో పద్మావతి తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. అప్పటినుండి నాలుగు సంవత్సరాల వరకు తనకు ఏమి చేయాలని దిక్కుతోచలేదు. ఈ నేపథ్యంలోనే తన భర్త ఆమె కలలో వచ్చి తనకు ఆలయాన్ని నిర్మించమని కోరినట్లు ఆమె ఇటీవలే వెల్లడించింది. దీంతో తన భర్త కోరిక మేరకు తన స్నేహితుడు తిరుపతి రెడ్డి మరియు అతని కుమారుడు శివ శంకర్ రెడ్డి సహాయం తీసుకుని భర్త రూపంలో పాల రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

అప్పటి నుండి పద్మావతి ప్రతిరోజూ అక్కడే పూజలు చేస్తూ తన కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తోంది. అంతేకాదు వారాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తోంది. తన భర్త పేరు మీద అన్నదానం కూడా చేస్తోంది. తన భర్త బతికి ఉన్నప్పుడు తనను దేవుడిగా భావించానని ఆమె చెప్పుకొచ్చింది.

భర్త పట్ల తనకున్న ప్రేమ మరియు భక్తిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన తమను చాలా భావోద్వేగానికి గురి చేసిందని కామెంట్లు చేస్తున్నారు. తన కుమారుడు శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఒకరినొకరు ఎంతో అంకితభావంతో ఉండే దంపతులకు జన్మించడం తన అదృష్టంగా భావించి, తన తల్లిదండ్రులను ఆదర్శవంతమైన జంటగా పేర్కొన్నాడు.

ఇంతకుముందు కర్నాటకలో ఓ వ్యాపారవేత్త తన స్వర్గీయ భార్య జ్ణాపకార్థం ఆమె మైనపు విగ్రహాన్ని స్థాపించారు. వారి కలల ఇల్లు పూర్తయినప్పుడు ఆమె విగ్రహాన్ని ఆ ఇంట్లో ఉంచి పూజను ప్రారంభించారు. అప్పుడు తన భార్య తనతోనే ఉందని భావించాడు.

English summary

Andhra Pradesh woman builds temple for late husband, offers prayers to his idol everyday

Here we are talking about the andhra pradesh woman builds temple for late husband, offers prayers to his idol everyday. Read on
Story first published:Friday, August 13, 2021, 16:20 [IST]
Desktop Bottom Promotion