For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రకమైన వ్యాపారం మీకు అనుకూలంగా ఉంటుంది?

|

జ్యోతిష్య శాస్త్రాన్ని బలంగా అనుసరించే వ్యక్తులు, వ్యాపార లావాదేవీల గురించిన వివరాలు తెలుసుకునేందుకు తీవ్రంగా ఆకాంక్షిస్తుంటారు. ఈ వ్యాసం చదివిన తర్వాత, జ్యోతిష్య శాస్త్ర అనుచరులు మరియు ఇతర జ్యోతిష్కులు వ్యాపార సంబంధిత అంశాలలో జ్యోతిష శాస్త్రం యొక్క శక్తి మరియు విజయం గురించిన స్పష్టమైన చిత్రాన్ని కలిగి ఉంటారని ఆశిస్తున్నాం. ఏ వ్యాపారం వారికి మంచిగా, మరియు లాభదాయకంగా ఉంటుందో వారి ఖాతాదారులకు వివరించడం కూడా వారికి అత్యంత సులభతరం అవుతుంది.

కొంతమంది వ్యక్తులు చదువుతో సంబంధంలేని ఇతర రంగాలలోని వృత్తులలో స్థిరపడతారని మీకు తెలుసు కదా. వాస్తవానికి కొందరికి మానసిక సంతృప్తి లేకపోయినా ఆదాయార్జనలో మాత్రం ముందు వరుసలోనే ఉంటారు. కొందరు చదువుకు వ్యతిరేకంగా ఇష్టమైన ఉద్యోగాన్ని ఎంచుకుని మరీ సంతోషంగా కాలం వెళ్ళదీస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అని ఆలోచన కలగడం సహజం. ఇప్పుడు, మేము మీ అందరితో ఈ రహస్యాన్ని వెల్లడించబోతున్నాము.

జ్యోతిష శాస్త్రంలో కుండలినిలోని ఐదవ గృహం, అధ్యయనం చేయవలసిన విషయాలను సూచిస్తుందని మనందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది జ్యోతిష్కులు తమ ఖాతాదారులకు సలహాలను ఇస్తుంటారు. కానీ ఈ గ్రహ స్థానమనేది, ఆదాయపు వనరుతో అనుసంధానించబడిందో లేదో మాత్రం వారు ధృవీకరించరు. కానీ జ్యోతిష శాస్త్రంలో, 2 వ గృహం, 5 వ గృహం , 9 వ గృహం మరియు 11వ గృహం కూడా ఆదాయ వనరులను సూచిస్తాయని చెప్పబడుతుంది.

5వ గృహంలోని ప్రభువు ఈ మిగిలిన గృహాలతో అనుసంధానించబడి ఉంటే వారు చదివిన అధ్యయనాల నుండి అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ 5 వ గృహంలోని అధికారిక గ్రహం ఈ మిగిలిన గృహాలతో అనుసంధానించబడకపోతే వారు అధ్యయనం చేసిన దాని నుండి ఆదాయం పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఐతే ఏంటి? మా అభిప్రాయం ప్రకారం, డబ్బు ప్రవాహాన్ని సూచించే గృహాలు మరియు వీటిలో ఉన్న గ్రహాలు విలీనం కావాలి, క్రమంగా మీరు ఆ రకమైన విద్యా రంగాన్ని ఎన్నుకోవటానికి గ్రహాల స్థానాల ప్రకారం వారికి సూచన ఇవ్వగలరు. అంటే ఆదాయ వనరుల సంబంధిత గృహాలతో అనుసంధానించబడిన గ్రహాలు, విద్యా రంగంతో కూడా సంబందాన్ని కలిగి ఉండాలి.ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల దృష్ట్యా ఏ రకమైన వ్యాపారం ఉత్తమమనే అంశం గురించి తెలుసుకుందాం.

అన్నింటిలో మొదటగా

అన్నింటిలో మొదటగా

అన్నింటిలో మొదటగా, ఏ గ్రహం శక్తివంతంగా ఉందో మనం గుర్తించవలసి ఉంటుంది. మరియు ఏ ఇంటిలో ఉన్న ఇళ్ళు. కుండలిని చార్టులో జ్యోతిష శాస్త్రం ప్రకారం 2 వ గృహం, 5 వ గృహం, 9 వ గృహం మరియు 11 వ గృహానికి అనుసంధానించబడిన గ్రహాలు ఎక్కువ ఆదాయాన్ని పొందగల శక్తిని కలిగి ఉన్నాయని చెప్పబడుతుంది.

ఈ గృహాలలో బలంగా ఉన్న గ్రహాల గురించి

ఈ గృహాలలో బలంగా ఉన్న గ్రహాల గురించి

ఈ గృహాలలో బలంగా ఉన్న గ్రహాల గురించి, వాటికి సంబంధించిన ఉద్యోగ వివరాలను తెలుసుకోవడానికి వ్యాసంలో ముందుకు సాగండి. క్రమంగా మీరు మీ ఖాతాదారులకు ఈ రకమైన వ్యాపారం చేయడానికి మార్గనిర్దేశం చేయవచ్చు, ఏ గ్రహం ఎటువంటి రకం వ్యాపారాన్ని సూచిస్తుంది, మరిన్ని సమగ్ర వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ గ్రహాల అనుసరణ ఆధారితంగా, మీ కుటుంబ ఆర్ధిక ఆరోగ్య సంక్షేమానికి ఏ రకమైన వ్యాపారం మీకు అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

సూర్యుడు - సూర్య గ్రహం సూచించే వ్యాపారాల వివరాలు :

సూర్యుడు - సూర్య గ్రహం సూచించే వ్యాపారాల వివరాలు :

ప్రభుత్వ సంబంధిత వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లు, కాంట్రాక్టులు, సెమీ ప్రభుత్వ కార్యకలాపాలు, ఎగుమతి మరియు దిగుమతి సంబంధిత వ్యాపారాలు , ప్రభుత్వ ప్రాంతాలలో క్యాంటీన్, బంగారానికి సంబంధించిన వ్యాపారం, విద్యుత్ మరియు ఇంధన వ్యాపారాలు, టైకూన్లతో వ్యాపారం, ఆహార నిర్వహణా సహకారం, టీ లేదా కాఫీ మొక్కల పెంపకం, మొక్కల వ్యాపారం మరియు గ్రీన్‌ స్టఫ్, గుండెకు సంబంధించిన మందులు లేదా పరికరాల వ్యాపారం, గుండె సమస్యకు సంబంధించిన ఏదైనా ఇతరత్రా వ్యాపారాలు, కళ్ళద్దాలు లేదా కంటి చికిత్స వంటి కళ్ళ సమస్యలకు చెందిన వ్యాపారం, పరిశోధన మరియు సృజనాత్మకత క్షేత్ర వ్యాపారాలు, ఫైనాన్షియర్ వ్యాపారం, ఉన్ని బట్టలకు సంబంధించిన వ్యాపారం, మెడికల్ స్టోర్స్, ఫార్మసీకి సంబంధించిన వ్యాపారం, ఆహార ధాన్యాలకు సంబంధించిన వ్యాపారం, సైన్స్ రంగంలో పరిశోధన, సైన్స్, మాజర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, లా, పాలిటిక్స్, హోదా మరియు కీర్తిని ఇచ్చే వ్యాపారాలు ఏవైనా, ఫిల్మ్ లైన్ నిర్మాతలు.

చంద్రుడు - చంద్ర గ్రహం సూచించే వ్యాపారాల వివరాలు :

చంద్రుడు - చంద్ర గ్రహం సూచించే వ్యాపారాల వివరాలు :

పాలకు సంబంధించిన వ్యాపారం, శీతల పానీయాల వ్యాపారం, హాట్ & సాఫ్ట్ డ్రింక్స్, సంబంధించిన వ్యాపారం. నీరు, వెండి, నావికులు, విదేశాలతో వ్యాపారం, షేర్ మార్కెట్స్, పర్యటనలు, ప్రయాణాలు మరియు ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన వ్యాపారం, రాత్రి వేళల్లో జరిగే అన్ని రకాల వ్యాపారాలు, రెడీమేడ్ వస్త్రాల వ్యాపారం, వ్యవసాయం, పౌల్ట్రీ ఫామ్, నర్సరీ, బొమ్మలు, కూరగాయలు, కాలానుగుణ వ్యాపారాలు, రవాణా, ఉప్పు, పట్టు, పాలిస్టర్ బట్టలు, అన్ని రకాల డిజైనింగ్ ఫీల్డ్, రచన, కళ, పిల్లలకు సంబంధించిన విద్య, పిల్లల సంరక్షణ, పీడియాట్రిక్, మహిళల వైద్య సమస్యలకు సంబంధించిన నిపుణుడు, డాక్టర్, సైకియాట్రిక్, ఐస్ క్రీం వ్యాపారం.

గురుడు - గురు గ్రహం ఈ రకమైన వ్యాపారాలను సూచిస్తుంది :

గురుడు - గురు గ్రహం ఈ రకమైన వ్యాపారాలను సూచిస్తుంది :

హార్డ్ వర్క్‌ సంబంధించిన వ్యాపారం, అన్ని రకాల యంత్రాలు, ఎలక్ట్రిక్స్ మరియు ఎలక్ట్రానిక్స్, అగ్ని ప్రమాదానికి సంబంధించిన వ్యాపారం. మంటలు, బంగారం, రసాయనాలు, క్రీడలు, యోగా, వ్యవసాయం, వ్యవసాయానికి సంబంధించిన అన్ని వ్యాపారాలు, పదార్థం, ఎరువులు మరియు పురుగు మందుల వ్యాపారం, సిఎ, ఇల్లు, భూమి మరియు భూమి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల సంబంధిత వ్యాపారం, జిమ్, క్రీడా వస్తువులకు సంబంధించిన వ్యాపారం మరియు పరికరాలు, కారంగా ఉండే పదార్థాలు, రక్షణ, సెక్స్ థెరపీకి సంబంధించిన వ్యాపారం, సర్జరీ, వాహనాలు, ఆటోమొబైల్స్, కంప్యూటర్, ఆటో విడిభాగాలకు సంబంధించిన వ్యాపారం, విదేశీ సంబంధిత వ్యాపారాలు ఏవైనా, ఇంజనీరింగ్, మెకానికల్, మరమ్మత్తు, అన్ని రకాల పరికరాల నిర్వహణకు సంబంధించిన వ్యాపారం, విడిభాగాలకు సంబంధించిన వ్యాపారం, మందులు, క్రీడా పరికరాలు, అన్ని రకాల సాహసోపేత పనులకు సంబంధించిన వ్యాపారం, చమురు, గ్యాసోలిన్‌కు సంబంధించిన వ్యాపారం, పెట్రోల్‌కు సంబంధించిన వ్యాపారం, గనులకు సంబంధించిన వ్యాపారం , అన్ని రకాల అగ్ని ప్రమాదాలకు సంబంధించిన వ్యాపారం.

మీ గ్రహాల ఆధారితంగా మీ కుటుంబ ఆర్ధిక సంక్షేమానికి

మీ గ్రహాల ఆధారితంగా మీ కుటుంబ ఆర్ధిక సంక్షేమానికి

మీ గ్రహాల ఆధారితంగా మీ కుటుంబ ఆర్ధిక సంక్షేమానికి ఎటువంటి వ్యాపారం నప్పుతుందో తెలుసుకొనుటకు మీ కుటుంబ జ్యోతిష్కుని సంప్రదించండి, కుండలిని ఆధారితంగా మరిన్ని వివరాలు తెలుసుకొనుటకు అనువుగా ఉంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక,ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

As Per Astrology Which Business Is Preferable For You

WHICH TYPE OF BUSINESS IS PREFERABLE FOR YOU AS PER ASTROLOGY. Read to know more about it..
Story first published: Wednesday, December 4, 2019, 8:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more