For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమైందా? కరోనా వైరస్ బారిన పడి జనాలు కాకుల్లా రాలిపోతున్నారా?

|

కరోనా వైరస్ రోజు రోజుకు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది పాముల నుండి సోకిన వైరస్ గా వైద్యులు అనుమానిస్తున్నారు. దీన్ని తొలిసారిగా చైనా దేశంలో గుర్తించారు. దీని దెబ్బకు ఇప్పటికే 170కి మందికి పైగా మరణించారు. గంట గంటకు చనిపోయినా వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.

మరోవైపు ఇప్పటివరకు 7 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అయినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే ఇదే వైరస్ గురించి వీర బ్రహ్మం గారు 17వ శతాబ్దంలోనే తన కాలజ్ఞానం ద్వారా జోస్యం చెప్పారట.

ఆ విషయం గురించి 114వ పద్యంలో ఉందని పలువురు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా జరగబోయే విపత్తులు, వినాశకాల గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పారట.ఇంతకీ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమి చెప్పారు? ఏమని హెచ్చరించారు అనే విషయాలపై ఈ స్టోరీలో తెలుసుకుందాం...

తస్మాత్ జాగ్రత్త! కేరళ నుండి కమ్ముకొస్తున్న కరోనా వైరస్.. దాని నుండి ఎలా తప్పించుకోవాలంటే...

ఈశాన్య దిక్కున..

ఈశాన్య దిక్కున..

బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఓ పద్యం ఉంది.

ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను

లక్షలాది ప్రజలు సచ్చేరయ

కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి

కోడిలాగా తూగి సచ్చేరయ

PC : FB

కరోనా వైరస్ ను ఉద్దేశించి..

కరోనా వైరస్ ను ఉద్దేశించి..

ప్రస్తుతం ఈ పద్యం ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బ్రహ్మంగారు చైనాలో పుట్టే ఈ కరోనా వైరస్ భూతాన్ని ఆనాడే ఊహించి చెప్పారని చాలా మంది చెబుతున్నారు. దీనితో పాటు భవిష్యత్తులో జరగబోయే విపత్కరమైన పరిణామాల గురించి ఆయన ఎన్నో విషయాలు చెప్పారని, అవి కూడా నిజం అయ్యాయని చాలా మంది నమ్ముతున్నారు.

PC : FB

కరోనా అర్థమేమిటంటే..

కరోనా అర్థమేమిటంటే..

అయితే ఇంకా కొందరు కరోనా వైరస్ కు అర్థం కూడా ఉందని చెబుతున్నారు. కరోనా అంటే ఓ కీరిటం పేరు అని చెబుతున్నారు. కిరీటం ఆకారంలో ఈ వైరస్ ఉంటుంది కాబట్టే దీనికి కరోనా వైరస్ అని పేరు వచ్చిందని చెబుతున్నారు.

కరోనా వైరస్ విజృంభించకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ విదేశీ ప్రయాణికులకు ఇస్తున్న విలువైన సలహాలివే...

19వ శతాబ్దంలోనే..

19వ శతాబ్దంలోనే..

ఈ కరోనా వైరస్ అనేది ఇప్పుడు పుట్టింది కాదంట. 19వ శతాబ్దంలో ఈ వైరస్ పుట్టిందట. కాకపోతే ఇది మనుషులకు సంబంధించి కాదట. అది జంతువులకు, పశువులకు, పక్షులకు సంబంధించిన వైరస్ అని చెబుతున్నారు.

PC :FB

భారత్ నుండి దాదాపు..

భారత్ నుండి దాదాపు..

చైనా దేశం మన దేశం నుండి దాదాపు ఈశాన్య దిక్కున ఉంది కాబట్టే, బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఈ కరోనా వైరస్ గురించి ఉదహరించినట్లు.. అందులో చెప్పిన విధంగా కోరంకి అనే జబ్బు ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్ కూడా దాదాపు ఒకటే అని అందరూ వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అది కాస్త బాగా వైరల్ అవుతోంది.

కరోనా వైరస్ లో చాలా రకాలు..

కరోనా వైరస్ లో చాలా రకాలు..

కరోనా వైరస్ అంటే ఒకటే రకం కాకుండా అందులో సుమారు నాలుగు లేదా ఐదు రకాలు ఉన్నాయట. అయితే మనుషులకు వాటిలో నుండి ఓ రకం వైరస్ వచ్చిందట. ఇదే విషయాన్ని చైనా వైద్యులు కూడా ధ్రువీకరించినట్లు తెలుస్తోంది.

అలర్ట్! కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

జాగ్రత్తల గురించి..

జాగ్రత్తల గురించి..

మన దేశంలో ఈ వ్యాధి ఇప్పటివరకు వ్యాపించకపోయినా.. దాని లక్షణాలు మాత్రం కొందరిలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేరళలో ఒకరి ఈ వ్యాధి సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి సోకినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. కరోనా వైరస్ సోకకుండా చల్లని ప్రదేశాలలో తిరగకుండా ఉండాలట. అలాగే జన సమూహం సాధ్యమైనంత దూరంగా ఉండాలట.

భారత ప్రభుత్వం చర్యలు..

భారత ప్రభుత్వం చర్యలు..

అయితే ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కరోనా వైరస్ కు సంబంధించి అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయంలోనే సెంట్రల్ మెడికల్ అథారిటీ ప్రత్యేక టీమ్ పర్యవేక్షణలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా ఈ వైరస్ లక్షణాలు ఉంటే వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు.

English summary

Brahmam Garu Says in His Prophecy About the Corona Virus

Here we talking about brahmam garu says in his prophecy about the corona virus. Read on