For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా అప్ డేట్ : ఇకపై వాట్సాప్ ద్వారా క్షణాల్లో గ్యాస్ బుకింగ్ చేసేయ్యండి ఇలా...

ఇకపై గ్యాస్ బుకింగ్ ను వాట్సాప్ ద్వారా క్షణాల్లో చేసేసుకోండి.

|

ఇప్పటివరకు గ్యాస్ బుక్ చేయడానికి ఏ నెంబర్ కు చేయాలో ఇబ్బందిపడేవారా? ఒకవేళ ఫలానా నెంబర్ కనుక్కొని, వాటికి ఫోన్ చేసినా ఒకటి నొక్కండి.. రెండు నొక్కండి.. కన్ఫార్మ్ కోసం మూడు నొక్కండి.. వివరాలు సరి చూసుకోవడానికి నాలుగు నొక్కండి అని చాంతడంతా లిస్టు వినేవారా? అయితే ఇప్పడు అదంతా అవసరం లేదు.

Corona Update : Now onwards gas cylinder Booking through whatsapp and know more details

ఇప్పటి నుండి గ్యాస్ బుకింగ్ చేసుకోవడం చాలా సులభం. అది కూడా కేవలం ఒక్క క్లిక్ తోనే. ఇందుకు కావాల్సిందల్లా కేవలం స్మార్ట్ ఫోన్. అందులోని వాట్సాప్ యాప్ ద్వారా క్షణాల్లో గ్యాస్ ను బుక్ చేసుకోవడమే కాదు.. మీ బ్యాంకు అకౌంట్లో గ్యాస్ సబ్సిడీ డబ్బు పడిందా లేదా? మీకు ఎంత కోటా ఉంది? మీరు ఎన్నిసార్లు వాడారు అనే విషయాలను కూడా తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూడండి....

వాట్సాప్ ద్వారా..

వాట్సాప్ ద్వారా..

ప్రస్తుతం మన దేశంలో సుమారు 70 శాతం మందికి పైగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అందులో వాట్సాప్ లేని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడటం సర్వసాధారణమైపోయింది. అయితే అదే వాట్సాప్ ద్వారా మీకు కావాల్సిన గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

సిలిండర్ బుక్ చేసుకోండిలా..

సిలిండర్ బుక్ చేసుకోండిలా..

  • ముందుగా హెచ్ పి గ్యాస్ వినియోగదారులైతే.. ఆ గ్యాస్ వాట్సాప్ బుకింగ్ నెంబర్ 9222201122ని మీ ఫోన్ లో సేవ్ చేసుకోవాలి.
  • ఆ నెంబర్ సేవ్ చేసుకున్నాక వాట్సాప్ కాంటాక్ట్స్ లో మీరు ఏ పేరుతో సేవ్ చేసుకుంటే.. ఆ పేరుతో సెర్చ్ చేయాలి.
  • నంబర్ ఓపెన్ చేశాక.. అందరికి మెసెజ్ లు ఎలా పంపుతారో అలాగేఇందులో మొదటగా HELP అని టైప్ చేసి.. సెండ్ చెయ్యాలి.
  • వెంటనే మీకు ఓ మెసెజ్ వస్తుంది. అది ఇలా ఉంటుంది.
  • బుకింగ్ కోసం..

    బుకింగ్ కోసం..

    • "Please send any of the below keywords to get help. SUBSIDY/QUOTA/LPGID/BOOK" గ్యాస్ బుకింగ్ కోసం : BOOK అని టైప్ చేసిసెండ్ చెయ్యాలి.
    • తర్వాత కస్టమర్ పేరు, కస్టమర్ నంబర్ యొక్క వివరాలు ప్రత్యక్షమవుతాయి.
    • ఆ వివరాలన్నీ కరెక్టుగా ఉంటే "Y" అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.
    • అంతే వెంటనే మీ బుకింగ్ కన్ఫార్మ్ అయినట్టు ఓ మెసెజ్ వస్తుంది.
    • అందులో రిఫరల్ నెంబర్, డెలివరీ అథెంటీకేషన్ కోడ్ వస్తాయి.
    • సబ్సిడీ వివరాల కోసం

      సబ్సిడీ వివరాల కోసం

      • ఒక వేళ మీకు సబ్సిడీ వివరాలు కావాలనుకుంటే ఇలా చేయాలి.
      • మీ వాట్సాప్ లో SUBSIDY అని టైప్ చేసి.. సెండ్ చెయ్యాలి. మీ వివరాలు ఇలా కనిపిస్తాయి.
      • Refill subsidy sent on 2020-01-28 to your account 6XXXXXXXXX9212 Bank:ICICI BANK
      • Refill subsidy sent on 2020-03-26 to your account 6XXXXXXXXX9212 Bank:ICICI BANKఇలా ఒక ఆరు సార్లు ట్రాన్స్ సాక్షన్ వివరాలు కనిపిస్తాయి.
      • కోటా వివరాలు తెలుసుకోవడానికి..

        కోటా వివరాలు తెలుసుకోవడానికి..

        మీ వాట్సాప్ లో గ్యాస్ బుకింగ్ కోటా వివరాలు తెలుసుకోవడానికి ఇలా చేయండి.

        • QUOTA అని టైప్ చేసి సెండ్ చెయ్యండి.
        • వెంటనే మీకు ఓ మెసెజ్ రిప్లై వస్తుంది.
        • ఉదాహరణకు 5/12 సిలిండర్లు వాడరు అనే వివరాలు ప్రత్యక్షమవుతాయి. అంటే మీరు ఐదు వాడారు. ఇంకా 7 సిలిండర్లను వాడుకోవచ్చని అర్థం.
        • ఇక LPG కస్టమర్లు 17 నంబర్లను తెలుసుకునేందుకు LPGID అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి. లేదా www.mylog.inలో వివరాలు ఇచ్చి ఐడీ పొందొచ్చు.
        • భారత్ గ్యాస్ వినియోగదారులైతే..

          భారత్ గ్యాస్ వినియోగదారులైతే..

          • భారత్ గ్యాస్ వినియోగదారులు 1800224344 అనే నెంబర్ ను మీ స్మార్ట్ ఫోన్ లో సేవ్ చేసుకోవాలి.
          • ఆ నెంబర్ సేవ్ చేసుకున్నాక వాట్సాప్ కాంటాక్ట్స్ లో మీరు ఏ పేరుతో సేవ్ చేసుకుంటే.. ఆ పేరుతో సెర్చ్ చేయాలి.
          • నంబర్ ఓపెన్ చేశాక.. అందరికి మెసెజ్ లు ఎలా పంపుతారో అలాగేఇందులో మొదటగా HELP అని టైప్ చేసి.. సెండ్ చెయ్యాలి.
          • వెంటనే మీకు ఓ మెసెజ్ వస్తుంది. అది ఇలా ఉంటుంది.
          • బుక్ చేసి కన్ఫార్మ్ చేయడమే..

            బుక్ చేసి కన్ఫార్మ్ చేయడమే..

            • "Please send any of the below keywords to get help. SUBSIDY/QUOTA/LPGID/BOOK" గ్యాస్ బుకింగ్ కోసం : BOOK అని టైప్ చేసిసెండ్ చెయ్యాలి.
            • తర్వాత కస్టమర్ పేరు, కస్టమర్ నంబర్ యొక్క వివరాలు ప్రత్యక్షమవుతాయి.
            • ఆ వివరాలన్నీ కరెక్టుగా ఉంటే "Y" అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.
            • అంతే వెంటనే మీ బుకింగ్ కన్ఫార్మ్ అయినట్టు ఓ మెసెజ్ వస్తుంది.
            • అందులో రిఫరల్ నెంబర్, డెలివరీ అథెంటీకేషన్ కోడ్ వస్తాయి.
            • పేమెంట్ కూడా ఫోన్ లోనే..

              పేమెంట్ కూడా ఫోన్ లోనే..

              అంతేకాదండోయ్ మీ గ్యాస్ బుక్ అయిన తర్వాత వచ్చే లింక్ పై క్లిక్ చేసి అక్కడే మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో పాటు యూపిఐ చెల్లింపుల ద్వారా పేమెంట్ కూడా చేయొచ్చు.

              చూశారు కదా మీరు కూడా గ్యాస్ వినియోగదారులైతే.. మీ ఇంట్లో గ్యాస్ అయిపోయింటే వెంటనే వాట్సాప్ ద్వారా బుక్ చేసేయండి... క్షణాల్లో అన్ని వివరాలను తెలుసుకోండి...

English summary

Corona Update : Now onwards gas cylinder Booking through whatsapp and know more details

Here we talking about corona update : now onwards gas cylinder booking through whatsapp and know more details.
Desktop Bottom Promotion