For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జరభద్రం! కరోనా భూతం కమ్ముకొచ్చింది... తెలంగాణలో తొలి పాజిటివ్ కేసు...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ తొలి కేసును నిర్ధారించిన కొద్ది గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ వైరస్ కు సంబంధించి తైవాన్ కు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు సమాచారం.

|

కరోనా వైరస్ భూతం కారుమబ్బులా కమ్ముకొస్తోంది. చాలా దేశాల్లో కలకలం రేపుతోంది. ఈ కరోనా వైరస్ ఇటీవలే కేరళ రాష్ట్రంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ తొలి కేసు నమోదు అయినట్లు ధ్రువీకరించింది. అయితే తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కరోనా వైరస్ భూతం అడుగు పెట్టింది.

Corona virus cases in India: Three people test positive

సోమవారం నాడు హైదరాబాద్ లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ కు సంబంధించి పాజిటివ్ లక్షణాలు కనబడినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఇదిలా ఉండగా మన తెలుగు రాష్ట్రాల్లో మరి కొన్ని చోట్ల కరోనా వైరస్ భూతంపై వదంతులు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవల కాకినాడలో కరోనా వైరస్ వల్ల అస్వస్థతకు గురయ్యారని పుకార్లు వినిపించగా... ఇప్పుడు నెల్లూరు జిల్లాతో పాటు ఇంకా పలు జిల్లాల్లో కూడా ఇలాంటి వదంతులు పెరిగిపోయాయి. అయితే వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారిపోయాయి.

ఏపీలోనూ కరోనా..!

ఏపీలోనూ కరోనా..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ తొలి కేసును నిర్ధారించిన కొద్ది గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ వైరస్ కు సంబంధించి తైవాన్ కు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు.. అతడిని అదుపులోకి తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తికి చికిత్స అనంతరం అతనికి కరోనా వైరస్ కు సంబంధించి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మొన్నటిదాకా ముగ్గురికే..

మొన్నటిదాకా ముగ్గురికే..

కరోనా వైరస్ మైన్నటిదాకా మన దేశంలో కేవలం ముగ్గురికే ఉందని, వారంతా కూడా కోలుకుంటున్నారని అందరూ ధైర్యంగా ఉండేవారు. అయితే ఆ సంఖ్య కాస్త ప్రస్తుతం డబుల్ అయ్యింది. కొత్తగా వైరస్ సోకిన వారిలో ఒకరు తెలంగాణలో.. ఇంకొకరు ఢిల్లీలో.. మరొకరు రాజస్థాన్ (జైపూర్) లో ఉన్నారు.

హై అలర్ట్...

హై అలర్ట్...

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పుడు హైఅలర్ట్ లోకి వెళ్లాయి. అయినా కూడా మనం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.

వేడి వల్లే..!

వేడి వల్లే..!

ఇప్పటిదాకా మన ప్రాంతంలో ఉండే ఎండ వేడి వల్ల కరోనా వైరస్ రావట్లేదని చాలా మంది అనుకున్నారు. అయితే అదంతా నిజం కాదంటున్నారు డాక్టర్లు. సౌదీ అరేబియా వంటి దేశంలో కూడా కరోనా వైరస్ కాలు పెట్టింది. అక్కడ మన దేశం కంటే విపరీతమైన ఎండలుంటాయి. మన దేశంలో కూడా బయటి దేశాల నుండి వచ్చే వారి నుండే ఎక్కువగా ఈ వ్యాధి వస్తోంది.

ఇతరులకు వ్యాపించి..

ఇతరులకు వ్యాపించి..

ఇండియాకు వచ్చిన విదేశీయుల నుండే ఇతరులకు ఈ కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కాబట్టి ఇండియాలో ఎంత ఎక్కువగా ఎండలు ఉన్నా.. కరోనా వైరస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో మనం ఎంత ముందు జాగ్రత్తలు తీసుకుంటే, అంత సురక్షితంగా ఉంటామని డాక్టర్లు చెబుతున్నారు.

కరోనా ఎలా వస్తుంది?

కరోనా ఎలా వస్తుంది?

కరోనా వైరస్ అనేది గాలి ద్వారా వచ్చే కాదని గుర్తుంచుకోవాలి. ఎవరికైనా కరోనా వైరస్ వ్యాధి ఉంటే, వారు దగ్గినా, తుమ్మినా.. ఆ సమయంలో వచ్చే నీటి బిందువులు (తుంపర్ల) ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. అది గాలిలో నుండి వచ్చి మనల్ని తాకితే, వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. ఇలా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి.

వైరస్ ఉన్న వ్యక్తుల వస్తువులను తాకితే..

వైరస్ ఉన్న వ్యక్తుల వస్తువులను తాకితే..

ఈ కరోనా వైరస్ ఉన్న వ్యక్తులు ప్రయాణించే సమయంలో ఆటోల్లో, క్యాబ్ లలో, రైళ్లలో, బస్సులలో, విమానాలతో పాటు ఎక్కడైనా.. ఏదైనా వస్తువును ముట్టుకుంటే.. వాటిపై వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వస్తువులను మీరు టచ్ చేస్తే ఆ వైరస్ మనల్ని చేరే ప్రమాదం ఉంటుంది. వీలైనంత వరకూ అలాంటివేవీ ముట్టుకోకుండా జాగ్రత్తపడాలి.

మాస్క్ తో పాటు..

మాస్క్ తో పాటు..

ఎవరైనా బయటికి వెళ్లే సమయంలో మాస్క్ ను కచ్చితంగా ధరించాలి. మాస్క్ ను ధరించలేని వారు కనీసం కర్చీఫ్ అయినా (ముక్కు, నోరు మూసుకుపోయేలా) ముఖానికి కట్టుకుంటే మంచిది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ సోకితే భయపడాల్సిన పని లేదు. మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటే, మీరు కచ్చితంగా త్వరగా కోలుకుంటారు. మీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగేకొద్దీ అది కరోనా వైరస్ తో పోరాడుతుంది. అలాగే కేరళలో ముగ్గురూ రికవరీ అయినట్లు తెలుస్తోంది.

English summary

Corona virus cases in India: Three people test positive

Here we talking about corona virus cases in india : two people test positive. Read on
Story first published:Tuesday, March 3, 2020, 14:43 [IST]
Desktop Bottom Promotion