Just In
- 16 hrs ago
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- 22 hrs ago
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- 1 day ago
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- 1 day ago
రాత్రి ఫోన్ వాడకుండా జాగ్రత్త వహించండి .. డేంజర్ !!
Don't Miss
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- News
ఏపీలో కరోనా: కొత్తగా 172 కేసులు -ఒకరి మృతి -టీకాల పంపిణీపై కేంద్రాకి జగన్ సర్కారు లేఖ
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Sports
36 పరుగులకు ఆలౌట్ అవ్వగానే.. గంగూలీ నుంచి కాల్ వచ్చింది: రహానే
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వైరల్ వీడియో : నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న కరోనా కచేరీ...
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందరినీ కలవరపరుస్తోంది కరోనా వైరస్. పాఠశాలలు, కాలేజీలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, స్పోర్ట్స్ తో సహా ముఖ్యమైన రంగాలన్నింటిపైనా కరోనా వైరస్ తన ప్రతాపం చూపుతోంది.
చైనాలోని వూహాన్ నుంచి ఈ వైరస్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచమంతటా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికీ ఈ కరోనా భూతానికి ఎలాంటి మందు అందుబాటులో లేదు. కేవలం ముందు జాగ్రత్తలు మాత్రమే పాటించాలి.
ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అనేక వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈ కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక ప్రచారాలు చేపట్టాయి. అయితే కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో.. అది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే వార్తలు నిత్యం పత్రికలలో, ప్రసార మాధ్యమాలలో వస్తూనే ఉన్నాయి. అయితే వీటన్నింటి కంటే కరోనా వైరస్ కు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం పదండి...

కరోనా పాట
మనం ఏదైనా వేడుకలు లేదా ఏదైనా కార్యక్రమాల్లో అందరూ ఒక చోట చేరి అంత్యాక్షరి లేదా భజన పోటీలు, కచేరీలు నిర్వహించడం అనే విషయాలు మనకు తెలిసినవే. అయితే తాజాగా కొంతమంది మహిళలు కరోనా వైరస్ పై ఓ ప్రత్యేకమైన పాట పాడారు.

‘కరోనా బాగ్ జా‘..
‘కరోనా బాగ్ జా‘ (కరోనా పారిపో.. భారతదేశంలో నీకేం పని, ఇక్కడి నుండి పారిపో.. కరోనా పారిపో) అనే అర్థం వచ్చేలా హిందీలో ఆ మహిళలు పాడిన పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది.

తెగ హల్ చల్
నాలుగు నిమిషాల వ్యవధిలో ఉన్న ఈ పాట ప్రస్తుతం యూ ట్యూబ్ లో తెగ వైరల్ అయిపోతోంది. అంతేకాదు వీరు స్మార్ట్ ఫోన్ లో చరణాలను చూస్తూ పాట పాడుతూ.. కరతాళ ధ్వనులు చేసుకుంటూ ఉత్సాహం పాడుతున్న విధానంపై నెటిజన్లు తమదైన కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా గ్రూపులలో తెగ హల్ చల్ చేస్తోంది.

వినూత్న ప్రయత్నం..
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అమెరికాలోని ఓ పాఠశాల వినూత్న ప్రయత్నం చేసింది. ఆ దేశంలోని మిస్సోరి రాష్ట్రంలో ‘మిసెన్ ఉడ్స్‘ అనే పాఠశాలలో విద్యార్థులకు కరోనా వ్యాపించకుండా వారి చేతులపై ‘మిసెస్ ఉడ్స్‘ ఉన్న స్టాంప్ వేస్తోంది.

స్టాంప్ తొలగిపోతే బహుమతులు..
ఉదయం విద్యార్థులకు వేసిన స్టాంపులను ఎవరైతే సాయంత్రం లోపు ఎవరి చేతులపై ఈ స్టాంప్ తొలగిపోతుందో వారికి బహుమతులు ఇస్తామని ప్రకటించింది. దీంతో చిన్నారులంతా బహుమతుల కోసం పోటీపడి మరీ పదే పదే చేతులు కడుగుతున్నారు.

చేతులు కడుక్కోవడం వల్ల..
ఇలా క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల కరోనా వైరసే కాదు.. ఇతర జబ్బులేవీ ఈ విద్యార్థులను చేరుకోలేవని ఆ స్కూల్ యాజమాన్యం చెబుతోంది. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ యాజమాన్యం ఆలోచన అందరినీ ఆలోచింపజేసింది.