For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (12-12-2019)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మార్గశిర మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో గొప్పగా ఉంటుంది. ఆఫీసులో మీ సీనియర్లు మీ నుండి గొప్ప పనితీరును ఆశిస్తారు. అందువల్ల మీరు కష్టపడి పని చేయడం మంచిది. మీరు పనిలో విజయవంతం కావాలంటే మీరు వారి నమ్మకాన్ని గెలుచుకోవాలి. ఈరోజు వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. మరోవైపు పిల్లలతో గడపడానికి మీరు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. వైవాహిక జీవితంలో సామరస్యం ఉంటుంది. ఈరోజు ఆర్థికంగా మీకు అదృష్టం కలసి వస్తుంది. మీరు మీ ప్రియమైన వారి కోసం బహుమతులు కూడా కొనుగోలు చేయవచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:55 నుండి రాత్రి 8:20 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. పని విషయంలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు మీరు గతంలో చేసిన కృషి ఫలాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ ఉన్నతాధికారుల నుండి సలహాలు పొందే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో కూడా లాభం పొందొచ్చు. ఈరోజు మీకు లక్కీ కలిసి వస్తుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ నిర్లక్ష్యం వల్ల అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు గాయాలయ్యే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : రాత్రి 7:30 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ఖాళీ సమయాన్ని బాగా వినియోగించుకోండి. సాధ్యమైనంత వరకు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితంలో సమస్యలను నివారించడానికి, మీ జీవిత భాగస్వామితో మాట్లాడకుండా ఉండండి. ఎందుకంటే మీరు సైలెంట్ గా ఉంటే మీ మధ్య వివాదానికి కారణం కావచ్చు. కోపం మరియు తగాదా నుండి ఎవరూ ప్రయోజనం పొందలేరు. మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫ్యాక్టరీ లేదా షాపులో ప్రమాదం సంభవించవచ్చు. ఈరోజు మీ స్నేహితులు మీ ఉత్సాహాన్ని పెంచుతారు. ఈరోజు ప్రయాణానికి అనుకూలంగా ఉండదు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సందర్భాల్లో చాలా కష్టంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపారవేత్తలకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీకు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కొన్ని ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత మరియు వ్యాపార విషయాలలో, ఈ రోజు మీరు మీ నిర్ణయాలన్నింటినీ తెలివిగా తీసుకుంటారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ఈ రోజు మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. అకస్మాత్తుగా పని భారాన్ని పెంచడం మీకు కొన్ని సమస్యలను కలిగిస్తుంది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరినీ ఎక్కువగా నమ్మవద్దు. మీరు ఎల్లప్పుడూ నమ్మే వ్యక్తినే మీకు ఇబ్బంది కలిగించవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కష్ట సమయాల్లో మీకు మద్దతు ఇస్తారు. డబ్బు విషయానికొస్తే, ఇతరులను ఆకట్టుకోవడానికి ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండండి. పిల్లల మొండి స్వభావం ఈ రోజు మిమ్మల్ని బాధపెడుతుంది. మీరు వారిని ప్రేమతో ఒప్పించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. ముఖ్యంగా ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండదు. మీ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ఖర్చులు పెరుగుతాయి. మీరు అనవసరంగా డబ్బు ఖర్చు చేయకపోవడమే మంచిది. మీరు ఆశించిన లాభం పొందవచ్చు. మీరు ఈరోజు కష్టపడి పని చేస్తే, ఈ రోజు మీ సీనియర్లు మీ పనిని అభినందిస్తారు. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, ఈ రోజు మీకు చాలా విశ్రాంతి లభిస్తుంది. మీరు కొన్ని ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేయగలరు. మీ వ్యక్తిగత జీవితంలో మీరు సమస్యలను ఎదుర్కొంటే, వాటిని పరిష్కరించడానికి ఈ రోజు సరైన సమయం. మీకు మీ జీవిత భాగస్వామి, కుటుంబసభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ సంబంధం బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 12:20 గంటల నుండి

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, ఖర్చుల పెరుగుదల మిమ్మల్ని బాధపెడుతుంది. ఖరీదైన వస్తువు కొనడానికి మీరు డబ్బు ఖర్చు చేయకపోవడమే మంచిది. ఈరోజు మీ వ్యక్తిగత సంబంధంలో ఉద్రిక్తత ఉంటుంది. ఈరోజు మీ కుటుంబం మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. మీ జీవిత భాగస్వామితో స్వల్ప వాదనలు ఉంటాయి. కానీ సాయంత్రం నాటికి అంతా సర్దుకుపోతుంది.ఈరోజు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు గాసిప్ మరియు పుకార్లకు దూరంగా ఉండండి. ఒత్తిడి మరియు పనిభారం మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి. మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు పరిస్థితిని నిర్వహించటం కష్టం. ప్రశాంతంగా ఉండటం ద్వారా మీరు విషయాన్ని పరిష్కరించవచ్చు. కొంత కాలంగా మీరు మీ కోసం తగినంత సమయాన్ని పొందలేకపోయారు. ఈరోజు ప్రేమ విషయానికొస్తే మీ ఇద్దరి మధ్య స్వల్ప వివాదం ఇవ్వవచ్చు. మీరు మీ సంబంధంలో సామరస్యాన్ని కోరుకుంటే, మీ భాగస్వామిని ప్రేమతో ఒప్పించటానికి ప్రయత్నించండి. వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 10:45 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు నిర్లక్ష్యంగా ఉంటే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మీరు ఏమి చేస్తున్నారనే దానిపై మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఆర్థికంగా పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా డబ్బులు అందవు. అయితే మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీపై ఉన్న అన్ని ఫిర్యాదులను పరిష్కరించడంలో ఈరోజు మీరు విజయవంతమవుతారు. ప్రేమ విషయంలో ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. మీరు ఈరోజు చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఈరోజు సానుకూల శక్తితో ఉంటారు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ పనిలో ఎలాంటి ఆటంకం ఉండదు. మీరు సమర్థవంతంగా పని చేస్తే అది ఇతర ఉద్యోగులపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. మీ పనితీరుతో మీ సీనియర్లు చాలా సంతోషంగా ఉంటారు. మీ వ్యక్తిగత సంబంధంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఆస్తికి సంబంధించిన విషయంపై ఈరోజు మీ ఇంట్లో చర్చ జరగవచ్చు. మీరు పరిపక్వతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆలోచించకుండానే దేనికీ స్పందించకూడదు. ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీకు నచ్చిన పనిని చేయడానికి ఎక్కువ సమయం గడపవచ్చు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. అయితే ఆర్థికంగా మీకు మంచి ఫలితాలు ఉండవు. డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఈరోజు వ్యాపారులకు చాలా కష్టమవుతుంది. మీ ముఖ్యమైన పని మధ్యలో ఆగిపోయి నిరాశ పడే అవకాశం ఉంది. ఈరోజున మీరు మీ ప్రవర్తనలో దూకుడు కలిగి ఉంటారు. ఇది మీ వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. ఈరోజు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలనుకుంటే, మీరు మీ స్థిర ప్రణాళికను అనుసరించాలి. ఈరోజు పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి మీరు దానిని కొంతకాలం వాయిదా వస్తే మంచిది. మీ వ్యక్తిగత జీవితంలో ఆహ్లాదకరమైన ఫలితాలు కనిపిస్తాయి. పిల్లలతో కొంత సమయం గడపడం మీకు ఉపశమనం ఇస్తుంది. శృంగార జీవితం గురించి మాట్లాడితే, ఈ రోజు మీరు మీ మనస్సుతో పనిచేయాలి. మీ మనసులో ఏమైనా సందేహాలు ఉంటే, మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10:45 గంటల వరకు

English summary

Daily Horoscope December 12, 2019

Every small and big detail about your life will guide you and that is why it is essential to know what’s in your daily horoscope. Let's see what the stars have to say about you.
Story first published: Thursday, December 12, 2019, 6:00 [IST]