Just In
- 11 hrs ago
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- 11 hrs ago
పెళ్లి తర్వాత సెక్స్ లైఫ్ గురించి ఎక్కువమంది అబద్ధాలే చెబుతారని మీకు తెలుసా...!
- 12 hrs ago
Winter Tips: ఈ 5 ప్రభావవంతమైన చిట్కాలతో ఈ శీతాకాలంలో మీ పొడి చర్మాన్ని తేమగా చేయండి..
- 13 hrs ago
Winter Tips: మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి స్నానం చేసేటప్పుడు ఆయుర్వేదంలో ఈ చిట్కాలను అనుసరించండి!
Don't Miss
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Movies
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సోమవారం మీ రాశిఫలాలు (24-02-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘ మాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.
ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా కొంత బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని పాత విషయాల గురించి ఆలోచించి మనసును పాడు చేసుకుంటారు. ఇలాంటి సమయంలో మీరు మీ కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి గడపండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ప్రయోజనకరంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు శృంగార జీవితంలో కొన్నిసమస్యలు ఎదురుకావచ్చు. ఇలాంటి సమయంలో మీరు మీ భాగస్వామిని శాంతంగా లేదా ప్రేమకు ఒప్పించండి. వివాహితులకు ఈరోజు కొంత సమస్యగా ఉంటుంది. పని విషయంలో సాధ్యమైనంత శ్రద్ధ వహించండి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు పని మీద శ్రద్ధ చూపుతారు. మీరు ఈరోజు మీ అందం మరియు శరీర సౌందర్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీరు స్నేహితులుగా ఉంటే, ఈరోజు మీ ఇద్దరి మధ్య ప్రేమ ప్రారంభమవుతుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:15 గంటల వరకు
2020లో ఓ రాశి వారికి రెండు లక్కీ డేస్... మిగిలిన రాశులకు అదృష్ట రోజు ఎప్పుడంటే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నిరాశ పడాల్సిన అవసరం లేదు. ప్రతికూల ఆలోచనలను పక్కనబెట్టండి. పనిలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. పని విషయంలో కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీ ఆలోచనలు బాగుంటే మీ శరీరం చాలా బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీ మనస్సులో అకస్మాత్తుగా కొన్ని విషయాలపై మోహం పెరుగుతుంది. మానసికంగా ఈరోజు సానుకూలంగా ఉంటారు. అలాగే సానుకూల ఆలోచనలపై శ్రద్ధ వహించండి. మీ కుటుంబ జీవితంలో ఈరోజు సమస్యగా ఉండవచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు బాగా గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ రాశి వారిలో కొందరు ఈరోజు తొలి చూపులోనే ప్రేమలో పడొచ్చు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 4:20 నుండి రాత్రి 8:45 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు చాలా కష్టపడి పని చేయాలి. అప్పుడు మీకు విజయం వరిస్తుంది. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు నిరాశ చెందవచ్చు. దీని వల్ల మీ సమయం నాశనం అవుతుంది. సానుకూలమైన విషయాలను ఆలోచించండి. ఆర్థిక సమస్య వల్ల ఈరోజు మీ మనసు చెదిరిపోతుంది. కొన్ని ముఖ్యమైన పనులు కూడా పెండింగులో పడిపోతాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు నూనె వస్తువులను తినడం తగ్గించాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు ఎక్కువ ఖర్చులు చేయవచ్చు. ముఖ్యంగా బయటి ఆహారం తినడం వంటివి తగ్గించండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది. మీ పనికి అందరూ ముగ్దులయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు మీ యజమాని యొక్క మనసు మరియు నమ్మకం కూడా గెలుచుకుంటారు. భాగస్వామి వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వివాహితుల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు శృంగార జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీ భాగస్వామితో కలిసి ఏదైనా ప్రఃదేశానికి ఏకాంతంగా వెళ్లండి. మీ ఇద్దరికీ ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలలో మీరు ఊహించిన దాని కంటే చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పని విషయంలో అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ శక్తిని అర్థవంతమైన పనులకు ఉపయోగించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మద్దతు పొందడం వల్ల మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. వివాహితులకు ఈరోజు పుష్కలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 7:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా చాలా లాభాలను పొందే అవకాశాలు పొందుతారు. మీరు ఈరోజు అకస్మాత్తుగా పెద్ద ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వివాహిత జీవితం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. పని విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు మానసికంగా ప్రశాంతంగా అనిపించదు. మీ మానసిక శాంతికి భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు చాలా రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. మీరు ఈరోజు జీవిత భాగస్వామితో సన్నిహితంగా ఉంటారు. మీ వివాహ జీవితంలో సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ ఆదాయం ఈరోజు కొంచెం బాగా పెరుగుతుంది. ఈరోజు అద్భుతంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా మెరుగుపడే అవకాశం ఉంది. ఈరోజు మీకు పాత పెట్టుబడి వల్ల ప్రయోజనం లభిస్తుంది. మీరు మీ బడ్జెట్ లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బిజినెస్ విషయంలో సానుకూలంగా ఉండండి. మీరు మీ పనిని పూర్తి చేస్తారు. అయితే పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:05 గంటల వరకు