For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (22-01-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లొచ్చు. దీని వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. పనిలో మీరు విజయం సాధించాలంటే కొంచెం కఠినంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. అయితే మీరు తొందరపడకుండా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. పనిలోనూ మంచి అవకాశాలను పొందుతారు. ఈ రాశి విద్యార్థులు చదువుపై కాకుండా ఇతర వాటిపై శ్రద్ధ చూపే అవకాశం ఉంది. అనవసర విషయాలను వదిలేస్తే మంచిది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుది. అయితే ఎక్కువ ఖర్చులు చేసే అవకాశం ఉంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. మీరు కష్టపడి, అంకితభావంతో చేసిన కృషికి ప్రశంసలు అందుకుంటారు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీరు ఈ రోజు మీ ఉన్నతాధికారుల నుండి కొన్ని ముఖ్యమైన సలహాలను పొందవచ్చు. అయితే ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఓపికగా ఉండాలి. కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి సాధారణమే.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు

జ్యోతిష శాస్త్రం ప్రకారం 2020లో ఈ రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుందట...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు చాలా రొమాంటిక్ గా ఉంటారు. మీకు ఇష్టమైన ప్రదేశానికి మీ భాగస్వామితో కలిసి వెళ్తారు. మీరు వివాహం చేసుకుంటే, ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలు వింటారు. పనిలోనూ ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే, ఈ రోజు మీరు సానుకూల సమాధానం పొందవచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా కొంచెం ఆందోళన పడతారు. మీ ఆదాయం నిజంగా తక్కువగా ఉందని మీరు భావిస్తారు. ఈ రోజు మీరు మీ ఆదాయాన్ని పెంచడానికి కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు చేయవచ్చు. ఈ సందర్భంలో, మీరు మీ స్నేహితుల సహాయం కూడా తీసుకోవచ్చు. ఇంటి వాతావరణం బాగుంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు వ్యాపారులకు చాలా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9:45 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో మీరు పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. మరోవైపు మీ సీనియర్లు ఈ రోజు ఆఫీసులో మీపై కోపంగా ఉంటారు. వారు మీ పనితో సంతృప్తి చెందకపోవచ్చు. నిరాశకు గురికాకుండా, కష్టపడి పనిచేయండి. మంచి ఫలితాలు అవే వస్తాయి. మీ ప్రియమైనవారితో మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 5:15 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు అవగాహనతో పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. వివాహిత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది, కానీ ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామితో గడపడానికి అవకాశం లభించదు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు తమ పని విషయంలో అసంతృప్తిగా ఉంటారు. అయితే మీరు ఓపికగా వేచి ఉండాలి. అప్పుడే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు వ్యాపారులకు సమస్యగా ఉంటుంది. మీ వ్యాపారంలో అంతరాయలు మరియు ఆందోళనను పెంచుతాయి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఈ రోజు మీ కుటుంబంతో చాలా మంచి సమయం గడుపుతారు. ఈ రోజు మీరు బంధువుల స్థలాన్ని కూడా సందర్శించవచ్చు. జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగులు చాలా బిజీగా ఉంటారు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఈ రోజు ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ రోజు మీరు ఒత్తిడికి దూరంగా ఉంటారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు విద్య పరంగా చాలా కష్టపడాలి. ఏవైనా సమస్యలు ఉంటే మీ పెద్దలు, స్నేహితులు లేదా గురువుల సహాయం తీసుకోవాలి. ఈరోజు కార్యాలయ వాతావరణం చాలా బాగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనకూలంగానే ఉంటుంది ఈరోజు ఇంట్లో కొన్ని అవాంతరాలు ఉంటాయి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 5:40 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు సరదాగా గడుపుతారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గొప్ప సమయాన్ని గడుపుతారు. ఈరోజు వినోదాత్మకంగా కూడా ఉంటారు. మీకు ఈరోజు అదృష్టం కలసి వస్తుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు మీరు ఎక్కువ ఖర్చు చేయవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం1:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి కారణం లేకుండా బాధపడొచ్చు. ఇలాంటి సమయంలో మీ కుటుంబం మరియు స్నేహితులతో కొంత సమయం గడపడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడికి సమయం అనుకూలంగా కనబడుతుంది. మరోవైపు బంధువుల నుండి మీకు కొంత ఒత్తిడి ఉండొచ్చు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9 గంటల వరకు

English summary

Daily Horoscope January 22, 2020

Today, some zodiac signs will be fortunate but others won’t be. Therefore, it is better to know in advance what the stars holds for you in the future. Read your daily horoscope to know.
Story first published: Wednesday, January 22, 2020, 6:00 [IST]