For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్ర గ్రహణం 2020 : ఆ సమయంలో ఈ పనులు చేస్తే మీరు ఎన్ని లాభాలు పొందుతారో తెలుసా...!

చాలా మంది వారి ఇళ్లలో చెట్లను లేదా మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే గ్రహణం సమయంలో బ్రహ్మ దండు చెట్టును తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కడితే మీకు తిరుగు అనేదే ఉండదు.

|

చంద్ర గ్రహణం మరియు సూర్య గ్రహణం ఈ నెలలో ఒకేసారి వచ్చాయి. ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాలు ఉన్నాయి. అందులో నాలుగు చంద్ర గ్రహణాలు కాగా, రెండు సూర్య గ్రహణాలు ఉన్నాయి.

Lunar eclipse

హిందు క్యాలెండర్ ప్రకారం జనవరి 10వ తేదీన పుష్య మాసంలో పౌర్ణమి రోజున తొలి చంద్ర గ్రహణం ప్రారంభమవుతుంది. దీని తర్వాత జూన్ 5వ తేదీ, జులై 5వ తేదీ మరియు నవంబర్ 30వ తేదీన సంపూర్ణ చంద్ర గ్రహణం పూర్తి అవుతుంది. అయితే గ్రహణం విషయంలో చాలా మందికి అనేక అపొహలు ఉన్నాయి.

Lunar eclipse

కొందరు ఏమో ఈ గ్రహణం తమ వ్యాపారానికి, ఆరోగ్యానికి మరియు తమ పనులను మంచిదని భావిస్తారు. మరికొందరేమో తమకు ఇది చెడు సూచకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్ర గ్రహణం నాడు మనం ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.

ముందుగా ఏయే పనులు చేయాలంటే..

ముందుగా ఏయే పనులు చేయాలంటే..

గరిక చాలా ముఖ్యమైనది..

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు, మీ ఇంట్లోని వస్తువులకు, ఆహారం వంటి వాటిపై చంద్ర గ్రహణం ప్రభావం పడకుండా గరికను అన్ని చోట్ల ఉంచాలి. దేవుని మందిరంలో కూడా ఆ గరికను ఉంచి దేవుడిని పూజించాలి. అలాగే దేవుడిని పూజించే సమయంలో నైవేద్యాన్ని లేదా పండ్లను నీటిలో వేసి ఉంచాలి. గ్రహణ కాంతుల నుండి గరిక అనేది దరి చేరనివ్వదు.

గ్రహణ సమయంలో..

గ్రహణ సమయంలో..

చంద్ర గ్రహణం సమయంలో దేవుడిని జపించాలి. ఈ సమయంలో చేసే జపాల వల్ల మీకు రెట్టింపు ఫలితం వస్తుందట. ఈ సమయంలో చేసే పూజలకు విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే గ్రహణ నివారణ పూజలు చేయాలి.

మీ ఇంటి గుమ్మానికి..

మీ ఇంటి గుమ్మానికి..

చాలా మంది వారి ఇళ్లలో చెట్లను లేదా మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే గ్రహణం సమయంలో బ్రహ్మ దండు చెట్టును తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కడితే మీకు తిరుగు అనేదే ఉండదు. మీకు ఎన్ని కష్టాలున్నా తొలగిపొతాయట.

మరి కొన్ని చెట్లు..

మరి కొన్ని చెట్లు..

చంద్ర గ్రహణం సమయంలో మాతంగి చెట్టుకు శక్తులు పెరుగుతాయట. దీన్ని కూడా గ్రహణం రోజున మీ ఇంటి గుమ్మానికి మీకు ఎలాంటి ప్రతికూల శక్తులు దరిచేరవట. నల్ల ఉమ్మెత్త చెట్టును కూడా మీ ఇంటి గుమ్మానికి కడితే నర పీడ తొలగిపోతుందట. వీటితో పాటు వాకుడి, జిల్లేడు, జువ్వి వంటి చెట్లలో మీకు ఏది దొరికితే అది మీ ఇంటి గుమ్మానికి కడితే మీకు ఇబ్బందులన్నీ తగ్గిపోతాయట.

దాన ధర్మాలు..

దాన ధర్మాలు..

చంద్ర గ్రహణం సమయంలో పేదలకు దాన ధర్మాలు చేయాలి. నిరుపేదలకు బట్టలు ఇవ్వడం లేదా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలి.

గ్రహణం తర్వాత..

గ్రహణం తర్వాత..

చంద్ర గ్రహణం ముగిసిన తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత దీపారాధన చేయాలి. అలాగే మీ ఇంటిని కూడా బాగా అలంకరించుకోవాలి.

గ్రహణం సమయంలో చేయకూడని పనులేంటో చూద్దాం..

గ్రహణం సమయంలో చేయకూడని పనులేంటో చూద్దాం..

ఆ కార్యం అస్సలు చేయకూడదట..

పురాణాల ప్రకారం సూర్య గ్రహణం మరియు చంద్ర గ్రహణం సమయంలో ఆ రెండింటిని రాహువు మరియు కేతువు మింగేస్తారట. ఆ సమయంలో ఆ కార్యం అస్సలు చేయకూడదట. ఆహారం కూడా వండకూడదట.

ఏమి తినకూడదు.. తాగకూడదు..

ఏమి తినకూడదు.. తాగకూడదు..

చంద్ర గ్రహణం సమయంలో మీరు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. అంతేకాదు ఎలాంటి పానీయాలను కూడా తాగకూడదు. ఎందుకంటే ఆ సమయంలో ఆహారం చెడిపోతుందని చాలా మంది నమ్మకం. ఒకవేళ ఆ సమయంలో ఆహారం తీసుకున్నా కూడా అజీర్ణానికి కారణమవుతుందట. అయితే కొంతమంది తమ ఆహారం పాడు కాకుండా ఉండటానికి ఆహారంలో పుదీనా ఆకులను ఉంచుతారట.

గర్భిణులు ఏ పనులు చేయరాదు..

గర్భిణులు ఏ పనులు చేయరాదు..

చంద్ర గ్రహణం సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి పనులు చేయకూడదట. అలాగే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలట. అలాగే గర్భిణీ ఆ సమయంలో కత్తులు మరియు పదునైన వస్తువులను దగ్గరగా ఉంచకోకూడదట.

ఆల్కహాల్ అస్సలు ముట్టకూడదు..

ఆల్కహాల్ అస్సలు ముట్టకూడదు..

గ్రహణం సమయంలో వాతావరణంలోని బ్యాక్టీరియాను సహజంగా నాశనం చేసే అతి నీల లోహిత వికిరణం చాలా తక్కువగా అయిపోతుంది. ఇది సూక్ష్మజీవుల అనియంత్రిత పెరుగుదలకు దారి తీస్తుంది. అలాగే మన శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ సమయంలో ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదట.

English summary

Do's and Don'ts during Lunar eclipse

Here we talking about do's and don'ts during lunar eclipse. Read on
Desktop Bottom Promotion