For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ కంపెనీ మందుతో కరోనా క్యూర్ అవ్వదా? ఏది నిజమో తెలుసుకోండి....

|

కరోనా వైరస్ చికిత్సకు గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ కొత్త మందును కనిపెట్టినట్టు ప్రకటించింది. అంతేకాదు దీనికి భారతీయ ఔషధ నియంత్రణ సంస్థ నుండి అనుమతి కూడా పొందినట్టు ప్రకటించింది. ఫ్యాబిఫ్లూ బ్రాండ్ పేరిట కరోనా నివారణకు ఈ ట్యాబ్లెట్లు ఉపయోగపడతాయని ప్రకటించింది.

అంతేకాదు ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.103గా నిర్ణయించింది. దీన్ని ముందుగా 1800 గ్రాముల మోతాదులో తొలిరోజు తీసుకోవాలని, తర్వాతి దశలో రోజుకు 800 గ్రాముల మేరకు తీసుకోవాలని కూడా చెప్పింది. ఇలా మొత్తం ట్యాబ్లెట్లకు సుమారు 14 వేల రూపాయల వరకు ఖర్చువుతుందని వివరించింది.

అయితే ఈ కంపెనీ విడుదల చేసిన ఫావిఫిరావిర్ అనే కరోనా మందు బాగా పని చేస్తున్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఏ దేశంలో కూడా స్పష్టమైన స్టడీ జరగలేదని చెబుతున్నారు. అంతేకాక దీన్ని జపాన్ దేశంలో నార్మల్ ఫ్లూ కోసం వాడుతున్న మందు అని చెబుతున్నారు. ఇది కరోనా రోగులకు ఏ మాత్రం పని చేయదని చెబుతున్నారు. కాబట్టి కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఎక్కడా మందు రాలేదని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతానికి కరోనా విరుగుడుకు ఎలాంటి మందు లేనందున ప్రస్తుతానికి మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ వాడటం, చేతులు శుభ్రంగా కడుక్కోవడాన్నే వ్యాక్సిన్ గా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఫ్యాభి ఫ్లూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వెల్లుల్లి ప్రతి జంట సమస్యను తొలగిస్తుంది, అంగస్తంభన సమస్యకు మంచి ఔషధం..

14 రోజుల పాటు..

14 రోజుల పాటు..

గ్లెన్ మార్క్ కంపెనీ విడుదల చేసిన ఫ్యాబి ఫ్లూ అనే ఈ ట్యాబ్లెట్లను 14 రోజుల పాటు వేసుకోవాలని ఆ సంస్థ తెలిపింది. కరోనా బారిన పడిన వారు 1800 ఎంజి(మిల్లి గ్రాములు) డోసు ఉన్న మాత్రలను మొదటి రెండు రోజులు వేసుకోవాలని, ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజి డోస్ మాత్రలను వేసుకోవాలని చెప్పారు.

డయాబెటిస్ రోగులు కూడా..

డయాబెటిస్ రోగులు కూడా..

ఈ ట్యాబ్లెట్లను డయాబెటిస్ తో లేదా గుండె జబ్బుతో బాధపడుతున్న వారు, చిన్న ఇన్ఫెక్షన్ ఉన్న రోగులు కూడా వాడొచ్చని గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ ప్రకటించింది. దీని వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయని వివరించింది.

ఉత్పాదక సామర్థ్యం..

ఉత్పాదక సామర్థ్యం..

ఈ ఔషధం యొక్క ఉత్పాదక సామర్థ్యం గురించి మాట్లాడితే, ఒక రోగికి అవసరమయ్యే మందులను, మొదటి నెలలో 82,500 మంది రోగులకు ఫ్యాబి ఫ్లూ మెడిసిన్ ను అందజేస్తామని ప్రకటించింది. దేశంలో ఆరోగ్య సంరక్షణకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ప్రకటించింది.

మీ పొట్ట ముందుకు పొడుచుకొచ్చి అసహ్యంగా ఉందా? రోజూ 2 టేబుల్ స్పూన్ల తేనె తినండి...

హిమచల్ ప్రదేశ్ లో..

హిమచల్ ప్రదేశ్ లో..

ఈ కరోనా మందుకు కేంద ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీ ప్రస్తుతం అంకలేశ్వర్ ప్లాంటులో, హిమచల్ ప్రదేశ్ లోని బడ్జి ప్లాంటులో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిని ఆసుపత్రులతో పాటు బహిరంగ మార్కెట్లో కూడా విడుదల చేస్తామని ప్రకటించింది.

త్వరలో అందుబాటులో..

త్వరలో అందుబాటులో..

ఈ ఫ్యాబి ఫ్లూ మందులు త్వరలో అందరికీ అందుబాటులో ఉంటాయని, కచ్చితంగా ఇవి రోగులకు ఉపయోగపడతాయని ప్రకటించింది. అలాగే వీటి ఉత్పత్తి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పని చేస్తామని ప్రకటించింది.

డిజిసిఐ అనుమతి..

డిజిసిఐ అనుమతి..

ఈ ఫ్యాబి ఫ్లూ మందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI) అనుమతి కూడా లభించినట్లు ఆ సంస్థ ఇటీవలే ప్రకటించింది. అలాగే మార్కెట్లో వీటిని అమ్ముకునేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని భావిస్తున్నామని తెలిపింది.

ఎవరికైనా కరోనా వస్తే, ఈ సమస్య జీవితకాలం కొనసాగే అవకాశం ఉంది ...

కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో..

కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో..

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న వేళ తమకు ఈ అనుమతి లభించడం గొప్ప విషయమని ఆ కంపెనీ సిఇఒ పేర్కొన్నారు. కరోనా మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని, ఇక నుండి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని సిఇఓ తెలిపారు.

కరోనా తగ్గుదల..

కరోనా తగ్గుదల..

ఫ్యాబి ఫ్లూ ట్యాబ్లెట్ల ద్వారా కరోనాను చాలా వరకు తగ్గించుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎవరైతే ప్రాథమిక లక్షణాలతో బాధపడుతుంటారో వారికి ఇది బాగా పని చేస్తుందని ప్రకటించింది. ఇలా బాధపడుతున్న వారిపై తాము నిర్వహించిన ట్రయల్స్ లో కచ్చితమైన ఫలితాలు వచ్చాయని సిఇఒ సల్హానా తెలిపారు.

వైద్య సంఘాలతో..

వైద్య సంఘాలతో..

ఈ ఫ్యాబి ఫ్లూ మందు కరోనాకు చికిత్స అనువైనదని, దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ ప్రభుత్వం, వైద్య సంఘాలతో కలిసి పని చేస్తుందని చెప్పారు.

విజయవంతంగా..

విజయవంతంగా..

పశ్చిమ ఆసియా మరియు ఆఫ్రికా యొక్క గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇండియన్ ఫార్ములేషన్స్ అద్యక్షుడు సుజేష్ దీని గురించి వివరిస్తూ.. ‘SARS COV2 వైరస్‌పై ఇది ప్రభావవంతంగా పని చేసిందని, అందుకే దీనిపై మేము మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నామ' ని ఆయన తెలిపారు.

English summary

Glenmark Launches New Coronavirus Medicine at 103 per tablet. Things to know

The company claimed that the branded tablet for anti-viral favipravir reduced viral load of COVID-19.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more