Latest Updates
-
రోజూ తినే పల్లీ చట్నీ బోర్ కొట్టిందా? అయితే ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ కొత్తిమీర చట్నీ ట్రై చేయండి! -
CSK vs DC మ్యాచ్లో దాగున్న చాణక్య నీతి రహస్యాలు ఇవే! -
మెడ వెనుక నలుపు మురికి అనుకుంటున్నారా? పెద్ద అనారోగ్యానికి సంకేతం! -
అరటిదూట పప్పు..సమీరా రెడ్డి చెప్పిన ఈ వంటకంతో ఆరోగ్యానికి పండగే! -
IPL 2026 స్టేడియంలో ధరల మోత! మీ డబ్బు ఆదా చేసే స్మార్ట్ టిప్స్ ఇవే -
మాటగాడే కాదు,మంచి వంటగాడు కూడా: ప్రధాని మోదీకి ఏమేం వంటలు వండటం వచ్చో తెలుసా? -
వైశాఖి 2026: మేష సంక్రాంతి వేళ ఈ పనులు చేస్తే అదృష్టం మీదేనా? -
ఈ 3 రాశుల జీవితంలో పెద్ద మార్పులు.. ఎవరికీ అదృష్టం? - శనివారం, 11 ఏప్రిల్ 2026 -
ప్రియుడితో కలిసి భర్తని చంపి..ఆస్కార్ లెవల్ యాక్టింగ్ చేసిన భార్య..వీడియో చూడండి! -
90s కిడ్స్ ఫేవరెట్: నోరూరించే చింతపండు లాలీపాప్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి!
Holi 2022: హోలీ సమయంలో మీ రాశిని బట్టి లక్కీ కలర్స్ ఏవో చూసెయ్యండి...
హోలీ పండుగ సమయంలో మీ రాశిని బట్టి లక్కీ కలర్స్ ఏవో ఇప్పుడే తెలుసుకోండి.
హిందువులు జరుపుకునే పండుగలలో హోలీ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. దీపావళి తర్వాత అత్యంత ఘనంగా జరుపుకునే పండుగగా హోలీ ప్రసిద్ధి గాంచింది. ఈ పండుగ సందర్భంగా మన కష్టాలన్నింటినీ మరచిపోయి, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో శాంతిని నెలకొల్పడం, చెడుపై మంచి సాధించిన విజయంగా ఈరోజును భావిస్తారు.

ఈ సమయంలో కుల, మత, జాతి భేదాలు లేకుండా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ ప్రతి ఏటా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 7, 18వ తేదీల్లో హోలీ పండుగను జరుపుకోనున్నారు. ఈ సమయంలో వసంత కాలం కూడా ప్రారంభమవుతుంది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, హోలీ పండుగ రోజున మీ రాశిని బట్టి మీకు ఏ రంగు లక్కీగా మరియు ప్రత్యేకంగా ఉంటుందో ఓ జాబితాను సిద్ధం చేశాం. అందులో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
ఈ రాశి వారు తమ స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో హోలీ పండుగ నాడు రంగులను చల్లుకోవడానికి ఇష్టపడతారు. వీరు అగ్నికి సంకేతం కాబట్టి, మీరు రెడ్ కలర్ ను వాడొచ్చు. మీ జాతకాన్ని బట్టి చంద్రుడు ఐదో స్థానంలో ఉంటాడు. మీరు హోలీ ఆడటానికి ముందు, దేవుళ్లకు ఎర్రని రంగులు అర్పించండి. దీని వల్ల మీకు వారి అనుగ్రహం లభిస్తుంది. రెడ్ కలర్ తో పాటు మీరు పసుపు, గులాబీ రంగులను కూడా వాడొచ్చు.

వృషభరాశి..
ఈ రాశి వారి జాతకాన్ని బట్టి నాలుగో ఇంట్లో చంద్రుడు ఉంటాడు. ఈ రాశి వారు శుక్రుని చేత పాలించబడతారు. కాబట్టి మీరు పింక్ మరియు కుంకుమ వంటి ప్రకాశవంతమైన రంగులను వాడొచ్చు. వీటితో పాటు ఈ హోలీ సమయంలో బ్లూ, గ్రీన్ కలర్లను కూడా వాడొచ్చు.

మిధున రాశి..
ఈ రాశి వారు బుధుడి చేత పాలించబడతారు. ఈ రాశిచక్రానికి చెందిన వ్యక్తులు హోలీని పెద్ద సంగీతం మధ్య, వారి కుటుంబసభ్యులతో ఆనందంగా జరుపుకోడానికి ఇష్టపడతారు. ఈ హోలీ సమయంలో మీరు గ్రీన్ కలర్ ను వాడొచ్చు. అలాగే మీరు గ్రీన్ కలర్ డ్రస్ వేసుకోవచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు చంద్రునిచే పాలించబడతారు. కాబట్టి దీనిని నీటి గుర్తుగా పిలుస్తారు. వీరు హోలీ పండుగను కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడతారు. కాబట్టి ఈ రాశి వారు వైట్ లేదా బ్లూ కలర్ ను వాడొచ్చు. ఆరెంజ్ అయినా కూడా పర్వాలేదు.

సింహ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి. వీరు అగ్ని సంకేతాలలో ఒకటిగా నమ్ముతారు. ఈ రాశి హోలీ వేడుకలను ఎప్పుడెప్పుడు జరుపుకుందామా అని ఆసక్తిగా ఎదురుచూస్తారు. కాబట్టి ఈ హోలీ పండుగ సమయంలో మీరు ఆరెంజ్ కలర్ ను వాడొచ్చు. అదే విధంగా మీరు లైట్ రెడ్, రాగి లేదా బంగారు రంగు దుస్తులను కూడా వేసుకోవచ్చు.

కన్య రాశి..
ఈ రాశి వారు భూమి సంకేతాలలో ఒకటి. వీరికి బుధుడు పాలకుడిగా ఉంటాడు. వీరు హోలీ పండుగను కుటుంబసభ్యులు మరియు స్నేహితులతో కలిసి జరుపుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి మీరు రెడ్ కలర్ కు దూరంగా ఉండాలి. హోలీ సమయంలో మీరు గ్రీన్, ఆరెంజ్ మరియు లైట్ ఎల్లో కలర్లను ఉపయోగించండి.

తుల రాశి..
ఈ రాశి వారు సూర్య గ్రహంచేత పాలించబడుతుంది. ఇది నీటి సంకేతాలలో ఒకటి. హోలీ వేడుకల సమయంలో వీరు చాలా మంది గురించి తెలుసుకుంటారు. ఈ పండుగ సమయంలో మీరు వైలెట్, పర్పుల్, పింక్ అండ్ వైట్ షేడ్స్ కలర్లను వాడొచ్చు.

వృశ్చికరాశి..
ఈ రాశి వారు అంగారకుడి చేత పాలించబడతారు. కాబట్టి వీరు రెడ్ కలర్ మరియు దాని ఇతర షేడ్స్ ను వాడొచ్చు. వీరు ప్రతి పండుగను ఎంతో ఆనందంతో మరియు ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇష్టపడతారు. రెడ్ కలర్ తో పాటు మీరు పింక్ మరియు గ్రీన్ రంగులను కూడా ధరించొచ్చు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు బ్రుహస్పతి చేత పాలించబడతారు. వీరు అగ్ని సంకేతాలలో ఒకటిగా పరిగణించబడతారు. వీరి జాతకాన్ని బట్టి వీరు వైలెట్ రంగులను వాడాలి.

మకర రాశి..
ఈ రాశి వారు శని గ్రహం చేత పాలించబడతారు. వీరు హోలీ పండుగను చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో నల్ల రంగు దుస్తులను ధరించకూడదు. హోలీ సమయంలో బ్రౌన్ లేదా బ్లూ కలర్లను వాడాలి.

కుంభ రాశి..
ఈ రాశి వారు గాలి సంకేతాలలో ఒకటిగా భావిస్తారు. వీరు ఎల్లప్పుడూ కొత్త ప్రారంభం కోసం అన్వేషిస్తూ ఉంటారు. హోలీ సమయంలో గ్రీన్, బ్లూ మరియు వైట్ వంటి రంగులతో మంచి అనుభూతి చెందుతారు.

మీన రాశి..
ఈ రాశి వారి నీటి సంకేతాలలో ఒకటిగా పరిగణించబడతారు. వీరు హోలీని ఆనందంగా జరుపుకోవాలని మరియు మీ ప్రియమైన వారిలో మీ అనుకూలత మరియు సామరస్యాన్ని వ్యాప్తి చేయడానికి ఎదురుచూస్తుంటే, మీ స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో రంగులు హోలీ ఆడేందుకు రెడ్, ఇండిగో మరియు పింక్ కలర్స్ వంటి వాటిని ఎక్కువగా వాడాలి.
హిందూ క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో మార్చి 18వ తేదీన అంటే శుక్రవారం నాడు హోలీ పండుగను జరుపుకోనున్నారు. అంతకుముందు రోజున 17వ తేదీ అంటే గురువారం రోజున కాముని దహనం జరుపుకుంటారు. హోలీ పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ వేడుకలను జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications











