For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020లో ఈ రాశిచక్రాల వారికి ఎలా గడిచిందంటే...!

|

2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ కరోనా కారణంగా కఠినమైన సవాళ్లు, లెక్కలేనన్ని విపత్తులు, సంక్షోభాలు, సమస్యలు ఎదురయ్యాయి. కరోనా మహమ్మారి దెబ్బకు మన జీవితాలు పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు. అయితే కరోనా వల్ల మనకు కొంత మంచే జరిగింది.

మనం కొత్త వాతావరణంలో ఆనందంగా బతికేందుకు కోవిద్-19 దోహదం చేసింది. అయితే ఇలాంటి భారీ మార్పులు జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేదు. అయితే దీని జ్యోతిష్యశాస్త్రం ముందుగానే హెచ్చరించింది. జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెప్పిన ప్రకారం, 2020లో చాలా మార్పులొచ్చాయి. ఈ నేపథ్యంలో 2020లో ప్రతి ఒక్కరాశికి ఎలా గడిచిందో ఇప్పుడు తెలుసుకుందాం...

కొత్త ఏడాదిలోని తొలి నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ లైఫ్ కి సరికొత్త బాటలు వేసుకోండి...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు కరోనా నామ సంవత్సరంలో తమ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వీరు అపొహలో బతుకుతున్నామన్న వాస్తవాలను గ్రహించాల్సి వచ్చింది. అలాగే వీరి జీవితంలో.. ముఖ్యంగా ప్రొఫెషనల్ విభాగంలో మార్పులు జరిగాయి. 2020 ఏడాదిలో వీరికి స్థిరత్వం యొక్క భావం ఉంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు 2020 సంవత్సరంలో చాలా విషయాల్లో స్థిరంగా మరియు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించారు. ఈ ఏడాది వీరు కుటుంబానికి ఆర్థికంగా మరియు మానసికంగా సహాయపడే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మరోవైపు కొందరికి ఈ సంవత్సరం కచ్చితంగా ఆహ్లాదకరంగా అనిపించలేదు. ఎందుకంటే వీరికి అదనపు బాధ్యతలు వచ్చి మీద పడ్డాయి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు 2020లో అంతా నెమ్మదిగా జరుగుతున్నప్పుడు, వీరు చాలా చురుకుగా ఉండాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరూ ఇంటి నుండి సమర్థవంతంగా పని చేయడానికి చాలా కష్టపడుతున్నందున వీరు ఎక్కువ సమయం వారి ఉద్యోగంపై శ్రద్ధ వహించాల్సి వచ్చింది. వీరి ద్రవ్య కోణంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే వీరి ప్రియమైన వారితో సంబంధాలు ఒకే విధంగా ఉన్నాయి.

New Year Vastu Tips : ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందట...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు గతేడాది చాలా విషయాలలో ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనేక సంఘర్షణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ప్రేమ మరియు వృత్తి పరమైన వాటిలో మాత్రం మెరుగుదల చూశారు. అయితే కొన్నిసార్లు భారీగా నిరాశ చెందారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి మాత్రం 2020 సంవత్సరంలో గొప్ప అవకాశం లభించింది. అందరూ కరోనా కారణంగా గందరగోళ పడుతుంటే.. సింహ రాశి వారు మాత్రం అవకాశం కోసం ఓపికతో ఎదురుచూశారు. వీరు కేవలం వృత్తిపరమైన అంశాలపై ఫోకస్ పెట్టగలిగారు. ఈ సమయంలో వీరు కేవలం అభివృద్ధి చేసుకోవడంపై ఫోకస్ పెట్టారు. రిలేషన్ షిప్ విషయంలో అంతా అనుకూలంగా ఉండేది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి ఎల్లప్పుడూ ఆచరణాత్మకంగా ఉండేవారు. అయితే 2020 సంవత్సరంలో మాత్రం వీరు అసాధ్యమైన పనుల నుండి బయటకు రావాల్సి వచ్చింది. అంతేకాకుండా వీరికి రిలేషన్ షిప్ మరియు జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. మరోవైపు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

Rasi Phalalu 2021 : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి ‘ఆ'విషయాల్లో ప్రతికూలంగా ఉంటుందట...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు 2020 సంవత్సరంలో ఎక్కువగా స్వీయ ఆత్మపరిశీలన ద్వారా మరియు తమకు తాము సమయం కేటాయించడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందారు. అయితే వీరు రాబోయే సంవత్సరాల కోసం కూడా సిద్ధంగా తయారయ్యారు. మరోవైపు పనుల గురించి ఆందోళన చెందకుండా, వీరు కుటుంబాలు మరియు సన్నిహితులతో మంచి, నాణ్యమైన సమయాన్ని గడుపుతున్నారు.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

ఈ రాశి వారు 2020 సంవత్సరంలో వ్యక్తిగత జీవితం, ఆసక్తి, అభిరుచులపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. వీరు ఎల్లప్పుడూ కష్టపడి పనిచేసే తత్వం కాబట్టి, వీరు ప్రయోజనాలన్నింటినీ విస్మరించాల్సి వచ్చింది. ఏదేమైనా, ఈ సంవత్సరం వారు తమ భావాలతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు ఈరోజు వృద్ధి పరంగా 2020 ఏడాదిలో నిలకడ సాధించారు. వీరు తమకు తాముగా ఒక మంచి అవకాశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరు గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా, ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అలాగే కొత్త వ్యక్తులను కూడా కలవడం వీరికి కొంత కలిసొచ్చింది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు 2020 సంవత్సరంలో ఎక్కువ సమయం నిరాశ చెందారు. ఎందుకంటే వీరు వృత్తిపరమైన పురోగతిని కొనసాగించడానికి నిరంతరం కష్టపడాల్సి వచ్చింది. వీరికి కనీసం విశ్రాంతి కూడా దొరకలేదు. అయితే వీరు రాబోయే సంవత్సరంలో అంటే 2021 మాత్రం సమయం దొరికిప్పుడల్లా సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు 2020 సంవత్సరంలో వీలైనంత సమయం మంచిగా ఉండేందుకు ప్రయత్నం చేశారు. వీరు ఎలాంటి అవకాశాలను వదల్లేదు. వీరు ప్రతి ఒక్క దాంట్లో ఉత్తమమైన పని చేస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో క్రియేటివిటీని ఉపయోగించారు. దీని వల్ల వీరికి కొన్ని మంచి పాయింట్లు లభించాయి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి 2020 సంవత్సరంలో ఎంతో ఆహ్లాదకరంగా మరియు ఉత్తేజకరంగా గడిపారు. వీరి యొక్క సాధారణ భావనకు విరుద్ధంగా, వారి వృత్తి జీవితం వికసించింది మరియు సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. లాక్ డౌన్ టైమ్ లో వీరు తమ ప్రియమైన వారితో ఇంట్లో గడిపేశారు. ప్రతి ఒక్కరితో తిరిగి కనెక్ట్ అయ్యేందుకు చాలా ప్రయత్నించారు. అయితే ఇవన్నీ వీరు గతంలో చేయలేకపోయారు.

English summary

How 2020 has been for each zodiac sign in Telugu

Here we talking about the how 2020 has been for each zodiac sign in Telugu. Read on.